న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిబంధనలు ఉల్లంఘించి.. బోట్‌మెన్‌ను కష్టాల్లో పడేసిన శిఖర్ ధావన్!!

Shikhar Dhawan feeds birds during boat ride in Varanasi, Boatman may face action

వారణాసి: నిబంధనలు ఉల్లంఘించి పక్షులకు ఆహారం వేసిన టీమిండియా సీనియర్ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వివాదంలో చిక్కుకున్నాడు. మార్గదర్శకాలు పాటించకుండా, పడవలోకి పర్యాటకులను అనుమతించిన బోటు యజమానిపై చర్యలు తీసుకుంటామని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)‌ కౌశల్‌‌ రాజ్‌ శర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ విజృంభిస్తున్న నేపథ్యంలో ధావన్‌ పడవలో విహరిస్తూ.. పక్షులకు ఆహారం వేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. దీంతో మేజిస్ట్రేట్‌ విచారణకు ఆదేశించారు. విషయంలోకి వెళితే...

పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!పుజారా.. బ్యాటింగ్ చేస్తుంటే నీకు బోర్ కొట్టదా?! వెలుగులోకి మరో ఆసీస్ ప్లేయర్ స్లెడ్జింగ్!

పక్షులకు గింజలు వేసిన ధావన్‌

పక్షులకు గింజలు వేసిన ధావన్‌

తాజాగా శిఖర్ ధావన్ వారణాసి టూర్‌కి వెళ్లాడు. గంగా నదిపై పడవ మీద వెళ్లిన ధావన్.. పక్షులకి గింజలు పెట్టడం ద్వారా నిబంధనల్ని అతిక్రమించాడు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం వారణాసిలో పర్యాటకులు పక్షులకి ఎలాంటి ఆహరం పెట్టకూడదని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. బోట్‌పై కూర్చుని పక్షికి ఫుడ్ తినిపిస్తున్న ఫొటోని ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'పక్షులకు మేత వేయడం ఆనందంగా ఉంది' అని ఆ ఫొటోకి క్యాప్షన్ పెట్టాడు. దీంతో గబ్బర్ రూల్స్ బ్రేక్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

బోట్‌మెన్‌ లైసెన్స్ రద్దు

బోట్‌మెన్‌ లైసెన్స్ రద్దు

శిఖర్ ధావన్ రూల్స్ బ్రేక్ చేసినా అతనిపై కాకుండా బోట్‌మెన్‌పై వారణాసి డిస్ట్రిక్ట్ మెజిస్రేట్ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు కారణం.. పోలీసులు, అధికారుల హెచ్చరికల్ని బోట్‌మెన్‌ లెక్కచేయకపోవడమే. వారణాసిలో పక్షులకి ఫుడ్ పెట్టకూడదనే రూల్ పర్యాటకులకి తెలియకపోవచ్చు. కాబట్టి బోట్‌మెన్‌లు తప్పనిసరిగా తమ పడవలోని టూరిస్ట్‌లకి ఆ విషయాన్ని తెలియజేయాలని పోలీసులు ఇటీవల ఆదేశించారు. దాంతో ధావన్‌ని గంగా నదిపైకి తీసుకెళ్లిన బోట్‌మెన్‌ లైసెన్స్‌ని రద్దు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

టూరిస్ట్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోం

టూరిస్ట్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోం

బోట్‌మెన్ ఎవరూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం లేదన్న సమాచారం తమకు అందిందని, ఇలాంటి విషయాలపై పర్యాటకులకు అంతగా అవగాహన ఉండదని కలెక్టర్ అన్నారు. డీఎం రాజ్ శర్మ మాట్లాడుతూ... 'బోట్‌మెన్స్‌కి ఇటీవల చాలా స్పష్టంగా పోలీసులు, అధికారులు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో టూరిస్ట్‌లను పక్షులకి ఇచ్చే ఆహరంతో ప్రయాణానికి అనుమతించకూడదని చెప్పారు. ఎవరైనా ఆ నిబంధనల్ని అతిక్రమిస్తే వారికి నోటీసులు జారీ చేసి.. మీ లైసెన్స్‌కి ఎందుకు రద్దు చేయకూడదో వివరణ అడుగుతాం. కానీ టూరిస్ట్‌లపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోం' అని అన్నారు.

ధావన్‌కు తప్పిన ముప్పు

పర్యాటకులను అనుమతించిన బోట్‌మెన్‌పైనే చర్యలు తీసుకుంటామని, పర్యాటకులపై కాదని చెప్పడంతో శిఖర్ ధావన్‌కు ముప్పు తప్పినట్టే. ఈ నెల 21 నాటికి దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు బర్డ్‌ఫ్లూ విస్తరించినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆరు రాష్ట్రాల్లో పౌల్ట్రీ కోళ్లలోను, మిగతా పది రాష్ట్రాల్లో ఇతర పక్షల్లోనూ ఈ వ్యాధి వ్యాపించినట్టు పేర్కొంది.

Story first published: Monday, January 25, 2021, 14:16 [IST]
Other articles published on Jan 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X