న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఫ్రైడే నైట్‌ని ఎంజాయ్ చేయాలి.. ద్రవిడ్‌ను ఔటివ్వండి అంపైర్​'

Rahul Dravids long innings spoil Shoaib Akhtar and Shahid Afridi Friday night plans

కరాచీ: టీమిండియా మాజీ కెప్టెన్, ఎన్‌సీఏ హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఒకసారి ఔట్‌ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యామని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తెలిపాడు. శుక్రవారం రాత్రిని ఎంజాయ్ చేసేందుకు భారీ ఇన్నింగ్స్ ఆడే ద్రవిడ్​ను త్వరగా ఔట్ చేయాలని తాను, షాహిద్ అఫ్రిది కలిసి ఓ మ్యాచ్​లో ప్రణాళిక వేశామని చెప్పాడు. ఆ మ్యాచ్​లో ఓ బంతి ద్రవిడ్ ప్యాడ్​కు తగలగా.. ఔటివ్వాలని తాను అంపైర్​ను అడిగానని, అయినా ఔటివ్వలేదని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.

ఫ్రైడే నైట్‌ని ఎంజాయ్ చేయాలని:

ఫ్రైడే నైట్‌ని ఎంజాయ్ చేయాలని:

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో షోయబ్ అక్తర్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. '1999లో బెంగళూరులో ఫైనల్ జరిగింది. మేం త్వరగానే 3-4 వికెట్లు తీశాం. ఆ మ్యాచ్​లో సచిన్ టెండూల్కర్ ఆడలేదు. ఆ రోజు శుక్రవారం రాత్రి. ఆ రాత్రిని ఎంజాయ్ చేసేందుకు భారీ ఇన్నింగ్స్ ఆడే ద్రవిడ్​ను త్వరగా ఔట్ చేయాలని నేను, షాహిద్ అఫ్రిది కలిసి ప్రణాళిక వేశాం. ఏదో ఒకటి చేసి అతడిని ఔట్ చేయాలని అఫ్రిది నాతో పదేపదే చెప్పాడు' అని అక్తర్ తెలిపాడు.

 త్వరగా ఔటివ్వు అని అడిగా:

త్వరగా ఔటివ్వు అని అడిగా:

'మా ప్రణాళిక ప్రకారం రాహుల్ ద్రవిడ్​ బ్యాట్​, ప్యాడ్ల మధ్య బంతిని వేడయమే లక్ష్యంగా బౌలింగ్ చేశా. ఆ సమయంలో నేను వేసిన ఓ బంతి ద్రవిడ్ ప్యాడ్లకు నేరుగా తగిలింది. అయినా అంపైర్ ఔటివ్వలేదు. అప్పీల్ చేసే సమయంలో ఇది శుక్రవారం రాత్రి అని కూడా అంపైర్​తో అన్నా. అయినా ఔటివ్వలేదు. ద్రవిడ్‌ అలాగే బ్యాటింగ్‌ చేశాడు. అయినా చివరికి మేమే మ్యాచ్‌ గెలిచాం. ద్రవిడ్​కు బౌలింగ్ చేయడం చాలా కష్టం. అతడు ఎంతో అంకితభావంతో ఆడతాడు. నా బౌలింగ్​ను అతడు సునాయాసంగా ఎదుర్కుంటాడు' అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అక్తర్ పేర్కొన్నాడు. కాగా పాకిస్థాన్​ 123 పరుగుల తేడాతో గెలిచింది.

బుమ్రా అన్ని ఫార్మాట్లు ఆడడం కష్టం:

బుమ్రా అన్ని ఫార్మాట్లు ఆడడం కష్టం:

భారత స్పీడ్​స్టర్ జస్పీత్ బుమ్రా అన్ని ఫార్మాట్లు ఎక్కువ కాలం ఆడలేడని షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. బుమ్రాది చాలా క్లిష్టమైన బౌలింగ్ యాక్షన్ అని, దీంతో అతడు త్వరగా నడుము గాయానికి గురవుతాడన్నాడు. ' బుమ్రాది చాలా కష్టమైన బౌలింగ్ యాక్షన్​. అన్ని ఫార్మాట్లు అతడు ఎక్కువకాలం ఆడలేడు. అతడు టెస్టు క్రికెట్ ఆడడం సాహసోపేతమే. బుమ్రా చాలా కష్టపడుతూ ఏకాగ్రతగా ఉంటాడు. కానీ అతడి నడుము పరిస్థితి ఏంటి?. యాక్షన్ వల్ల అతడు బంతి వేసేటప్పుడు నడుముపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనివల్ల అతడిని నడుము గాయం తొందరగా వస్తుందనుకుంటున్నా' అని అక్తర్ అభిప్రాయపడ్డాడు.

షమీ తెలివైన బౌలర్‌:

షమీ తెలివైన బౌలర్‌:

టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తాడని, అతడు బౌలింగ్‌ యాక్షన్‌లో పెద్ద రిస్క్‌ ఉండదని అక్తర్‌ వివరించాడు. షమీ తెలివిగల బౌలర్‌ అని ప్రశంసించాడు. అక్తర్‌ పాక్‌ తరపున 46 టెస్టుల్లో 176 వికెట్లు, 163 వన్డేల్లో 247 వికెట్లు, 15 టీ20 ల్లో 19 వికెట్స్ పడగొట్టాడు. పాకిస్థాన్ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 224 మ్యాచ్‌లు ఆడిన అక్తర్.. 444 వికెట్లతో ప్రపంచంలో అత్యంత భయంకరమైన బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. 2003 వన్డే ప్రపంచకప్‌లో గంటకి 161.3కిమీ వేగంతో బంతిని విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

10 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న భారత వికెట్ కీపర్!!

Story first published: Saturday, August 8, 2020, 16:24 [IST]
Other articles published on Aug 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X