10 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న భారత వికెట్ కీపర్!!

వైజాగ్: భారత వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ వివాహం బుధవారం రాత్రి ఓ స్టార్ హోటల్లో జరిగింది. విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన అంజలితో అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా జరిగింది. దాదాపు పదేళ్ల నుంచి అంజలితో డేటింగ్‌లో ఉన్న భరత్.. ఎట్టకేలకి మూడు ముళ్ల బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. ఈ విషయాన్ని భరత్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వెంటనే అందరూ అతనికి శుభాకాంక్షలు తెలిపారు.

శుభాకాంక్షలు తెలిపిన ఆటగాళ్లు:
26 ఏళ్ల కేఎస్ భరత్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, స్పిన్నర్ రవీంద్ర జడేజా, పేసర్ ఇషాంత్ శర్మ, ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ, టెస్ట్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్, టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సోషల్ మీడియా, ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గాజువాకకు చెందిన అంజలి.. భరత్‌కు దగ్గరి సన్నిహితులని సమాచారం. క్రికెట్ విషయాల్లో ఆమె భరత్‌కు అండగా ఉంటుందట.

అనూహ్యంగా జట్టులో చోటు:
కేఎస్ భరత్ గత ఏడాది నవంబరులో కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్ జరిగిన టెస్టు మ్యాచ్‌కు (డే/నైట్ టెస్టు) అనూహ్యంగా టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఉండడంతో అతనికి తుది జట్టులో మాత్రం అవకాశం దక్కలేదు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేకి కూడా భరత్‌కి పిలుపు వచ్చింది. అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. కేఎల్ రాహుల్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఈ రెండు మ్యాచ్‌లకి ఎంపికయి భారత సెలక్టర్ల ప్రణాళికల్లో మాత్రం అతడు ఉన్నాడు.

అరంగేట్రం కోసం ఎదురుచూపు:
ఆంధ్రా తరఫున దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న కేఎస్ భరత్.. ఇప్పటి వరకు 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడి 4,283 పరుగులు చేశాడు. రంజీ ట్రోఫీలో ఆంధ్ర తరపున తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇక 51 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 1,351 పరుగులు.. 43 టీ20ల్లో 615 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లోనూ ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) టీమ్‌లోకి భరత్ ఎంపికయ్యాడు. కానీ ఒక్క మ్యాచ్ ఆడలేదు. దాంతో టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ అరంగేట్రం కోసం అతడు వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు.
కీపర్ రేసులో నలుగురు:
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత ఏడాది కాలంగా భారత జట్టుకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. యువ వికెట్ కీపర్లని సిద్ధం చేసుకునే క్రమంలో భారత సెలక్టర్లు రిషబ్ పంత్‌కి వరుసగా అవకాశాలిచ్చారు. మొదట్లో పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత పేవల షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. కేఎస్ భరత్‌కి ఒక ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ గత ఏడాదికాలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కీపర్ రేసులో రిషబ్ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ ఉన్నారు. మరి ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి.
'షేన్‌వార్న్ శతాబ్దపు బంతి కన్నా.. నేను సచిన్‌కు వేసిన డెలివరీనే అత్యుత్తమైంది'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications