న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsSL : మూడో వన్డేకు ముందు టీమిండియాకు షాక్.. ద్రావిడ్‌కు అనారోగ్యం..!

Rahul Dravid got sick just before third INDvsSL ODI

శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ తన ఖాతాలో వేసుకుంది. అయితే తిరువనంతపురంలో జరిగే మూడో వన్డేకు భారత్ సిద్ధం అవుతుండగా ఊహించని షాక్ తగిలింది. రెండో వన్డే ముందు రోజే టీం హోటల్‌లో తన 50వ జన్మదిన వేడుకలు జరుపుకున్న హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌ అనారోగ్యం పాలయ్యాడు. బీపీ విపరీతంగా పెరిగిపోవడంతో ట్యాబ్లెట్లు వేసుకున్న ద్రావిడ్.. మ్యాచ్ సమయంలో ఆరోగ్యం సరిగా లేకున్నా జట్టుతోనే ఉన్నాడు.

అయితే తిరువనంతపురంలో మ్యాచ్‌కు ముందు కోల్‌కతా నుంచి ద్రావిడ్ ఇంటికి వెళ్లిపోయాడు. ఆరోగ్యం బాగలేకపోవడంతో తను బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో జరిగే మ్యాచ్‌కు ద్రావిడ్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. ఈ మ్యాచ్‌లో ద్రావిడ్ అందుబాటులో లేకున్నా పెద్దగా సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వన్డే సిరీస్ భారత్ వశమైంది. ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేసి చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. దీంతో ఆ జట్టు కేవలం 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్‌లో టీమిండియా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. అయితే కేఎల్ రాహుల్ (64 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

లక్ష్యం చిన్నదే కావడంతో ఎక్కడా రిస్క్ తీసుకోకుండా నిదానంగా ఆడుతూ అతను జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అయితే అతను మూడో వన్డేలో ఆడటం అనుమానంగా మారింది. ఈ మ్యాచ్‌లో భుజం గాయంతో బాధ పడుతున్న యుజ్వేంద్ర చాహల్ స్థానంలో కుల్దీప్‌ను తీసుకున్నారు. ఇక మూడో వన్డే సమయానికి చాహల్ కోలుకుంటే అతన్ని తీసుకొని, మళ్లీ కుల్దీప్‌ను పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది.

Story first published: Friday, January 13, 2023, 14:50 [IST]
Other articles published on Jan 13, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X