T20 World Cup 2022: అందుకే వాషింగ్టన్ సుందర్‌‌ను కాదని అశ్విన్‌ను ఎంపిక చేశారు!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌కు ట్రైలర్‌గా సాగనున్న ఆసియా కప్ టోర్నీతో టీమిండియా కాంబినేషన్ ఓ కొలిక్కి రానుంది. అయితే మెగా ఈవెంట్‌‌‌‌కు బలమైన టీమ్‌‌‌‌ను బరిలోకి దించాలని భావిస్తున్నా.. యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ నుంచి సెలెక్టర్లకు పెద్ద సవాలే ఎదురవుతున్నది. ఈ మధ్య కాలంలో సీనియర్లు లేకపోయినా.. యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌తో కూడిన టీమిండియా వరుసగా సిరీస్‌‌‌‌లు గెలిచింది. దీంతో ఆసీస్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌లో ఎవరికి బెర్త్‌‌‌‌ కేటాయించాలన్న దానిపై సెలెక్షన్‌‌‌‌ కమిటీ ఓ కొలిక్కి రాలేకపోతున్నది. తాజాగా ఆసియా కప్‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌తో దీనిపై తుది నిర్ణయానికి రావాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలెక్టర్ల నుంచి ఒకటి, రెండు స్పష్టమైన సంకేతాలు బయటకు వచ్చాయి.

సుందర్‌ను పక్కనపెట్టాం..

సుందర్‌ను పక్కనపెట్టాం..

ముఖ్యంగా స్పిన్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా జట్టులో కీలకంగా మారిని వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌ను.. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ టీమ్‌‌‌‌ ప్రణాళికల నుంచి తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వెటరన్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ అశ్విన్‌‌‌‌కు ఆసీస్‌‌‌‌ ఫ్లైట్‌‌‌‌లో చోటు కల్పించాలని భావిస్తున్నారని ఓ సెలెక్టర్ తెలిపాడు. ‘సుందర్‌‌‌‌ టీమిండియాకు చాలా గొప్ప ఆస్తి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ను మెరుగుపర్చుకోవాలి. అవకాశం కోసం వెయిట్‌‌‌‌ చేయాల్సిందే. ఈ విషయాన్ని సుందర్‌‌‌‌తో చర్చించాం. ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లకు అశ్విన్‌‌‌‌ సరిపోతాడని అనుకుంటున్నాం. ఒకవేళ ఎవరైనా గాయపడితే అప్పుడు సుందర్‌‌‌‌ బ్యాకప్‌‌‌‌గా వస్తాడు' అని సదరు సెలెక్టర్‌‌‌‌ వ్యాఖ్యానించాడు.

ఫిట్‌నెస్ లేకపోవడం..

ఫిట్‌నెస్ లేకపోవడం..

గాయం కారణంగా చాలా రోజులుగా అంతర్జాతీయ‌‌‌ క్రికెట్‌‌‌‌కు దూరంగా ఉన్న సుందర్‌‌‌‌.. ఇటీవలే ఇంగ్లండ్ కౌంటీల్లో సూపర్‌‌‌‌ ఎంట్రీ ఇచ్చాడు. లాంక్​షైర్‌‌‌‌ తరఫున రెండు ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో 8 వికెట్లు తీశాడు. మొత్తానికి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లేకపోవడం, ఐపీఎల్‌‌‌‌ తర్వాత ఇంటర్నేషనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు ఆడకపోవడం, టీమ్‌‌‌‌లో పోటీ పెరగడం, ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లు అతని బౌలింగ్‌‌‌‌కు సరిపోకపోవడం వంటి నాలుగు అంశాలతో సెలెక్టర్లు సుందర్‌‌‌‌ను పక్కనపెట్టేసినట్లు అర్థమవుతోంది

బుమ్రా,కోహ్లీ ఫామ్‌లో లేరు ఎలా మరి *Cricket | Telugu OneIndia India Will Win Asia Cup Without Bumrah
స్పిన్‌‌‌‌ వెరైటీ కోసమే..

స్పిన్‌‌‌‌ వెరైటీ కోసమే..

టీమిండియాలో స్పిన్నర్‌‌‌‌గా అశ్విన్‌‌‌‌కు చాలా అనుభవం ఉంది. ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లు ఎక్కువగా పేసర్లకు సహకరిస్తాయి. అదే సమయంలో అశ్విన్‌‌‌‌ స్పిన్‌‌‌‌ కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని సెలెక్టర్లు నమ్ముతున్నారు. జడేజా, చహల్‌‌‌‌ను తీసుకున్నా.. అశ్విన్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ఉండటం వల్ల స్పిన్​లో వైవిధ్యం ఉంటుందని భావిస్తున్నారు. అనుభవం పక్కనబెడితే మ్యాచ్‌‌‌‌ను అవగాహన చేసుకోవడంలో అశ్విన్​ దిట్ట. దీనికి తోడు డిఫరెంట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ వేయడంలో స్పెషలిస్ట్‌‌‌‌. ఆసీస్‌‌‌‌ పిచ్‌‌‌‌లపై బాల్‌‌‌‌ టర్నింగ్‌‌‌‌ లేకపోయినా.. మంచి వేరియేషన్స్‌‌‌‌తో బ్యాటర్లను ఇబ్బందిపెడతాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. అదే సమయంలో యంగ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ రవి బిష్ణోయ్‌‌‌‌ నుంచి అశ్విన్‌‌‌‌కు పోటీ ఎదురయ్యే చాన్స్‌‌‌‌ కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌‌‌‌లో ఈ ఇద్దరి ఆటను సెలెక్టర్లు నిశితంగా పరిశీలించనున్నారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, August 11, 2022, 11:55 [IST]
Other articles published on Aug 11, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X