న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతని వల్లే బ్యాటింగ్‌లో లయ అందుకున్నా: అశ్విన్

 R Ashwin says Vikram Rathour has been helpful in getting back my flow with the bat

జోహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాట్‌తో మెరిసాడు. బ్యాట్స్‌మన్ అంతా విఫలమైన వేళ సూపర్ బ్యాటింగ్‌తో అశ్విన్(50 బంతుల్లో 6 ఫోర్లతో 46) విలువైన పరుగులు చేశాడు. దాంతో భారత్ 200 పరుగుల మార్క్‌ను ధాటి గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఇక మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన అశ్విన్‌.. ఈ గేమ్‌లో తాను ఇంత మంచి స్ట్రైక్‌రేట్‌‌తో ఆడటానికి ప్రత్యేకంగా ప్రయత్నం ఏమీ చేయలేదని చెప్పాడు. తాను లయ అందుకోవడంలో బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ సాయం చేశాడన్నాడు.

'నేను గత కొన్నేళ్లుగా బ్యాటింగ్‌ టెక్నిక్‌పై దృష్టిసారించాను. జట్టుకు భారీ పరుగులు అందించి నా వంతు తోడ్పాటు అందించాలనుకున్నాను. అంతకుముందు కూడా బాగా ఆడిన సందర్భాలు ఉండటంతో ఈ మ్యాచ్‌లో మంచి స్ట్రైక్‌రేట్‌తో అలాంటి మెరుగైన షాట్లు ఆడేందుకు ప్రత్యేకంగా శ్రమ పడలేదు. ఇక మా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ కూడా నాకు విలువైన సూచనలు చేస్తూ నాలోని లోపాలను సరిద్దిద్దాడు. దీంతో నేను ఇలా బాగా బ్యాటింగ్‌ చేయగల లయ అందుకున్నానని అనుకుంటున్నా' అని అశ్విన్‌ వివరించాడు.

సౌతాఫ్రికా పిచ్‌లు భిన్నంగా ఉంటాయన్న అశ్విన్.. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 260 పరుగులు చేసినా గెలుస్తుందన్నాడు. గతంలో సౌతాఫ్రికా ఎప్పుడూ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250 పరుగులు చేసేదన్నాడు. ఈ లెక్కన తాము కొన్ని పరుగులు తక్కువగానే చేశామన్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంకా తమకు విజయవకాశాలున్నాయన్నాడు. ఇక పిచ్ టిపికల్‌గా ఉందని, మాములుగా అయితే వాండరర్స్ పిచ్ నెమ్మదిగా ఉంటుందన్నాడు. ఆడుతున్న కొద్ది బ్యాటింగ్‌కు అనుకూలించేదన్నాడు. కానీ ప్రస్తుత పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలన్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్‌ వైఫల్యంతో మన ఇన్నింగ్స్‌ 63.1 ఓవర్లకే ముగిసింది. తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (133 బంతుల్లో 50; 9 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... అశ్విన్‌ (50 బంతుల్లో 46; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. సఫారీ బౌలర్లలో మార్కో జాన్సెన్‌ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టడం విశేషం. ఒలీవియర్, రబడ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టపోయి 35 పరుగులు చేసింది.

35/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా 42 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 100 పరుగులు చేసింది. పీటర్సన్(61 బ్యాటింగ్) హాఫ్ సెంచరీతో రాణించగా.. డస్సెన్(0 బ్యాటింగ్) సహకరిస్తున్నాడు. బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచిన డీన్ ఎల్గర్(28)‌ను లార్డ్ శార్డూల్ ఠాకూర్ ఔట్ చేశాడు.

Story first published: Tuesday, January 4, 2022, 15:30 [IST]
Other articles published on Jan 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X