న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PSL 2021: గాయం నుంచి కోలుకుంటున్నా.. కానీ జ‌రిగిందేంటో మ‌ర‌చిపోయా: స్టార్ క్రికెట‌ర్‌

PSL 2021: Faf Du Plessis said Have concussion with some memory loss but I will be fine now
Quetta Gladiators' Faf du Plessis concussed during collision while fielding | Oneindia Telugu

అబుదాబి: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌) 2021లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ కంకషన్‌కు గురైన విషయం తెలిసిందే. శనివారం రాత్రి పెషావర్‌ జాల్మీ జట్టుతో మ్యాచ్‌ ఆడుతుండగా సహచర ఆటగాడు మహ్మద్‌ హస్నేన్‌ను బలంగా ఢీకొని కిందపడిపోయాడు. కంక‌ష‌న్‌కు గురైన అత‌న్ని వెంట‌నే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లి స్కాన్‌లు నిర్వ‌హించారు. అయితే ఈ గాయం నుంచి తాను కోలుకుంటున్న‌ట్లు డుప్లెసిస్‌ ట్విట‌ర్‌లో వెల్ల‌డించాడు. తాను కోలుకోవాల‌ని కోరుకుంటూ పంపిన సందేశాలకు కృత‌జ్ఞ‌తలు తెలిపాడు.

జ‌రిగిందేంటో మ‌ర‌చిపోయా

'నేను త్వరగా కోలుకోవాల‌ని కోరుకుంటూ పంపిన సందేశాలకు అందరికి నా కృత‌జ్ఞ‌తలు. నేను తిరిగి కోలుకుంటున్నాను. ప్రస్తుతం హోటల్​కు తిరిగి వచ్చాను. కంక‌ష‌న్ వ‌ల్ల జ‌రిగిందేంటో మ‌ర‌చిపోయాను. కానీ ఇప్పుడు బాగానే ఉన్నాయి. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ ఆడతా' అని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ ట్వీట్ చేశాడు. ఫాఫ్ దక్షిణాఫ్రికా తరఫున 69 టెస్టులు, 143 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఇక 91 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) మ్యాచులు కూడా ఆడాడు. టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఫాఫ్ ఆడుతున్న విషయం తెలిసిందే.

హస్నేన్‌ను బలంగా ఢీకొని

హస్నేన్‌ను బలంగా ఢీకొని

శనివారం రాత్రి పెషావర్‌ జాల్మీ జట్టుతో మ్యాచ్‌ ఆడుతుండగా సహచర ఆటగాడు మహ్మద్‌ హస్నేన్‌ను బలంగా ఢీకొని ఫాఫ్ డుప్లెసిస్‌ కిందపడిపోయాడు. దాంతో వెంటనే పరీక్షించిన అక్కడి ఫిజియోలు అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఫాఫ్ కోలుకుంటున్నాడు. గ్లాడియేటర్స్‌ జట్టులో ఇలా రెండు రోజుల వ్యవధిలో ఆటగాళ్లు కంకషన్‌కు గురవ్వడం ఇది రెండోసారి. అంతకుముందు ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ బ్యాటింగ్‌ చేస్తూ కంకషన్‌కు గురయ్యాడు. ప్రత్యర్థి బౌలర్‌ మహ్మద్‌ ముసా వేసిన ఓ బౌన్సర్‌ అతడి హెల్మెట్‌కు తగలడంతో తలకు దెబ్బ తగిలింది.

ఐసీసీ 'ప్లేయర్స్ ఆఫ్ ద మంత్' విజేతలు వీరే! మహిళ క్రికెటర్‌గా కాథ‌రిన్ బ్రైస్‌ రికార్డు!

ఐపీఎల్ 2021ల అదరగొట్టిన ఫాఫ్

ఐపీఎల్ 2021ల అదరగొట్టిన ఫాఫ్

కరోనా కారణంగా మార్చిలో వాయిదాపడిన పీఎస్‌ఎల్‌ 2021 నాలుగు రోజుల క్రితమే తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఫాఫ్ డుప్లెసిస్‌ యూఏకి చేరుకొని గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఇస్లామాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 5 పరుగులు చేసిన ఫాఫ్.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. అంతకుముందు ఫాఫ్ ఐపీఎల్‌ 2021లో చెన్నై తరఫున ఆడి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ శతకాలు సాధించి మొత్తం 320 పరుగులు చేశాడు. టోర్నీ నిలిచిపోయేసరికి చెన్నై పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మే 4న ఐపీఎల్ టోర్నీని నిరవధికంగా వాయిదా వేయగా.. మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

Story first published: Monday, June 14, 2021, 17:22 [IST]
Other articles published on Jun 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X