న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా ఫేవరేట్ ఓపెనింగ్ పార్ట్‌నర్ అతనే: పృథ్వీ షా

 Prithvi Shaw reveals his favourite opening partner

ముంబై: తన ఫేవరేట్ ఓపెనింగ్ భాగస్వామి శిఖర్ ధావన్ అని భారత యువ క్రికెటర్ పృథ్వీషా తెలిపాడు. కరోనా కారణంగా ఇంటికే పరిమితైన ఈ ముంబై సెన్సేషన్ తన ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగి పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.ఈ లైవ్ సెషన్‌లో ఫేవరేట్ ఓపెనింగ్ భాగస్వామి ఎవరని ప్రశ్నించగా.. పృథ్వీ ఏమాత్రం ఆలోచించకుండా శిఖర్ ధావన్ పేరు చెప్పాడు. ఎక్కువ సార్లు అతనితోనే ఓపెనింగ్ చేశానని, అందుకే అతనే తన ఫేవరేట్ పార్టనర్‌ అని ఈ ముంబై క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

నా ఫేవరేట్ హీరో ప్రభాస్: స్టార్ క్రికెటర్నా ఫేవరేట్ హీరో ప్రభాస్: స్టార్ క్రికెటర్

సచిన్‌లా ఆడటం ఇష్టం..

సచిన్‌లా ఆడటం ఇష్టం..

ఇక తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌లా ఆడటం తనకు ఇష్టమని, అలా ఆడటానికి ప్రయత్నిస్తానని ఈ యువ ప్లేయర్ చెప్పుకొచ్చాడు.‘సచిన్‌ ప్రభావం నాపై ఎంతో ఉంది. ఎనిమిదేళ్ల వయసులో తొలిసారి ఆయనను కలిశాను. పరిస్థితులని బట్టి నా సాధారణ శైలిలోనే ఆడమని ఎప్పుడూ సలహా ఇచ్చేవారు. మైదానం బయట కూడా ప్రశాంతగా ఉండమని చెప్పేవారు. నేను బాటమ్-హ్యాండ్‌ ప్లేయర్‌ని. అంతకుముందు నా కోచ్‌ల సలహాల మేరకు నా గ్రిప్‌ను మార్చేవాడిని. కానీ, సచిన్‌ సర్‌ నా గ్రిప్‌ను మార్చవద్దని సూచించారు. ఆ తర్వాత నుంచి మార్చలేదు'అని తెలిపాడు.

సచిన్‌తో పోల్చొద్దు..

సచిన్‌తో పోల్చొద్దు..

తనను సచిన్‌తో పోలిస్తే ఒత్తిడికి గురవుతుంటానని, అయితే అది ఛాలెంజ్‌గా అనిపిస్తుంటుందని పృథ్వీ తెలిపాడు. సచిన్ క్రికెట్ దేవుడు అని కొనియాడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గంగూలీ గురించి స్పందిస్తూ.. దాదా ఎంతో సాయం చేశాడని, జట్టులో యువకులను ఎంతో ప్రోత్సహించాడని తెలిపాడు.

గోల్ప్, టీటీ, స్విమ్మింగ్ ఇష్టం..

గోల్ప్, టీటీ, స్విమ్మింగ్ ఇష్టం..

క్రికెట్‌తో పాటు గోల్ఫ్‌, టేబుల్ టెన్నిస్‌, స్విమ్మింగ్‌ ఇష్టమని ఈ యువ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. భారత్ తరఫున ఇప్పటి వరకు నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడిన పృథ్వీ.. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు.‌ ఇక అంతకు ముందు అవగాహన లేక దగ్గు మందు కోసం బహిష్కృత డ్రగ్ 'టర్బులిన్' వాడి 8 నెలల సస్పెన్షన్‌‌కు గురయ్యాడు. నిషేధానంతరం రంజీల్లో రాణించి న్యూజిలాండ్ టూర్‌కు ఎంపికయ్యాడు. కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

Story first published: Wednesday, April 22, 2020, 12:10 [IST]
Other articles published on Apr 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X