న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020 ప్రిపరేషన్ పూర్తయింది.. ఇక బరిలోకి దిగడమే: రోహిత్ శర్మ

Preperation work done, time for execution: Mumbai captain Rohit Sharma all set for IPL 2020 opener vs Chennai

దుబాయ్: బ్యాట్స్‌మెన్‌ హిట్టింగ్‌, బుల్లెట్లలా దూసుకొచ్చే బౌలర్ల బంతులు, మెరుపు ఫీల్డింగ్‌.. అన్నింటికీ మించి మైదానంలో ఉత్కంఠ పోరాటాలు వీటిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేచిచూస్తున్న క్రికెట్‌ అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం రానే వచ్చింది. యూఏఈ వేదికగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ శనివారం ప్రారంభం కానుంది. కరోనా వైరస్‌ ప్రభావంతో విసిగిపోయిన కోట్లాది మందిలో ఈ పొట్టి ఫార్మాట్ జోష్ నింపనుంది. అబుదాబి వేదికగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనున్నాయి.

సమయం ఆసన్నమైంది:

సమయం ఆసన్నమైంది:

ముంబై ఇండియన్స్‌ ప్రిపరేషన్ పూర్తయిందని, ఇక బరిలోకి దిగడమే తరువాయి అని ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్ ‌శర్మ తెలిపాడు. చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌కు ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు హిట్‌మ్యాన్ చెప్పాడు. తాజాగా రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు పోస్టుచేసి ఇదే విషయాన్ని తెలిపాడు. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకొని తమ ప్రాక్టీస్‌ ముగిసిందని, ఇక తొలి మ్యాచ్‌లో తలపడేందుకు సమయం ఆసన్నమైందని రోహిత్ పేర్కొన్నాడు.

వినోదం అందించేందుకు సిద్ధం:

వినోదం అందించేందుకు సిద్ధం:

'కెప్టెన్స్‌ కార్నర్'‌ అనే పేరుతో ముంబై ఇండియన్స్‌ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో విడుదల చేసింది. అందులోనూ హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'ఈ సీజన్‌ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నా. క్రికెట్‌ అభిమానులకు వినోదం అందించేందుకు సిద్ధంగా ఉన్నా. కొన్ని నెలలుగా ఆటగాళ్లెవ్వరూ క్రికెట్‌ ఆడలేదు. దీంతోదుబాయ్ వచ్చాక కొద్ది రోజులు గాడిలో పడేందుకు ప్రయత్నించాం. ఈ క్రమంలోనే ప్రాక్టీస్‌ మ్యాచ్‌లతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాం. ప్రిపరేషన్ పూర్తయింది పూర్తయింది' అని ముంబై కెప్టెన్‌ రోహిత్ ‌శర్మ చెప్పాడు.

ఓపెనర్‌గా బరిలోకిదిగుతా:

ఓపెనర్‌గా బరిలోకిదిగుతా:

ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు అందరూ బయో బుడగలో ఉండాల్సిన అవసరం రావడంతో తమ జట్టు యాజమాన్యం అత్యుత్తమ సౌకర్యాలు ఏర్పాటు చేసిందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. గతేడాదిలాగే ఈసారి కూడా తాను ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా దిగుతానని, అలాగే జట్టు అవసరాలను బట్టి ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే టాప్ ‌ఆర్డర్‌లో ఆడటం అనేది తనకు ఇష్టమని రోహిత్ తెలిపాడు. గత ఏడాది టోర్నమెంట్‌లో రోహిత్ 15 మ్యాచ్‌ల్లో 28.93 సగటుతో 405 పరుగులు చేసాడు.

నాలుగుసార్లు విజేతగా:

నాలుగుసార్లు విజేతగా:

అనంతరం తమ జట్టు విజయానికి కారణమైన తెర వెనుక వ్యక్తులను ముంబై కెప్టెన్‌ రోహిత్ శర్మ పరిచయం చేశాడు. కాగా రోహిత్‌ ఇప్పటికే ఆ జట్టును నాలుగుసార్లు విజేతగా నిలిపాడు. ఇప్పుడు యూఏఈలోనూ మరోసారి టైటిల్‌ విన్నర్‌గా నిలబెట్టాలని చూస్తున్నాడు. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి మరి!

చైనా కంపెనీ ‘ఒప్పో'తో ధోనీ ఒప్పందం.. మండిపడుతున్న ఫ్యాన్స్!

Story first published: Saturday, September 19, 2020, 13:50 [IST]
Other articles published on Sep 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X