న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చైనా కంపెనీ ‘ఒప్పో’తో ధోనీ ఒప్పందం.. మండిపడుతున్న ఫ్యాన్స్!

How fans reacted ofter MS Dhoni signs deal with Chinese mobile-maker Oppo ahead of IPL 2020

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా చైనాకి చెందిన మొబైల్ కంపెనీ 'వివో'ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పించిన విషయం తెలిసిందే. తొలుత కొనసాగించాలని ప్రయత్నించినా దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగడంతో పర్పస్పర అంగీకారంతో బీసీసీఐ-వివో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకొన్నాయి.

అలాంటిది భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చైనాకే చెందిన మొబైల్ కంపెనీ 'ఒప్పో'తో ఒప్పందం కుదుర్చోకోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. సైన్యంలో పారాచూట్ రెజిమెంట్‌లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ చైనా కంపెనీతో జతకట్టడంపై అభిమానులు పెదవి విరుస్తున్నారు.

సంతోషంగా ఉందన్న ధోనీ..

సంతోషంగా ఉందన్న ధోనీ..

'బి ది ఇన్ఫనైట్' క్యాంపెయిన్‌లో భాగంగా ధోనీతో చేసుకున్న డీల్‌ వివరాలను ఒప్పో యాజమాన్యం తమ అధికారిక ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. దీనిపై స్పందించిన ధోనీ... 'ఈ ప్రాజెక్టులో నేనూ ఓ భాగమయ్యేందుకు ఎంతో కుతుహలంతో ఉన్నాను. సరికొత్త ఆవిష్కరణలు,టెక్నాలజీలో ముందు వరుసలో ఉన్న ఒప్పోతో జతకట్టడం చాలా సంతోషంగా ఉంది.' అని పేర్కొన్నాడు. అయితే దీనిపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సరిహద్దుల్లో భారత జవాన్లను పొట్టన పెట్టుకుంటున్న డ్రాగన్ కంట్రీ కంపెనీతో డీల్ ఎలా కుదుర్చుకుంటావని ధోనీని ప్రశ్నిస్తున్నారు.

ఫ్యాన్స్ ఫైర్..

ఫ్యాన్స్ ఫైర్..

‘ఓవైపు సరిహద్దుల్లో చైనాతో భారత జవాన్లు పోరాడుతుంటే.. మరోవైపు ఆర్మీ లెఫ్టెనెంట్ కల్నల్ హోదా కలిగిన ధోనీ ఆ దేశ కంపెనీ ఒప్పోను ప్రమోట్ చేస్తుండటం విచిత్రం'అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఏడీజీపీఐతో పాటు నార్తర్న్ కమాండ్ ఇదంతా గమనిస్తుందనే భావిస్తున్నానని పేర్కొన్నాడు. మరికొందరు మాత్రం ధోనీని వెనకేసుకొస్తున్నారు.

'ధోనీ ఒప్పోని ప్రమోట్ చేస్తున్నాడా..? న్యూస్ పేపర్స్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. త్వరలోనే క్లారిటీ వస్తుంది' అని మరో నెటిజెన్ పేర్కొన్నాడు. కొంతమంది నెటిజెన్స్ మాత్రం ధోనీ ఒప్పోకి అంబాసిడర్‌గా వ్యవహరించడంలో తప్పేమీ లేదనట్లుగా కామెంట్ చేశారు. చైనా కంపెనీకి ధోనీ డబ్బులు ఇవ్వట్లేదని... వాళ్లే ధోనీకి డబ్బులు ఇస్తున్నారని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

సరిహద్దు ఘర్షణలతో..

సరిహద్దు ఘర్షణలతో..

జూన్ 15న లదాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైనాకు బుద్ది చెప్పేందుకు భారత్ దాదాపు 224 చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించింది. జాతీయ భద్రతకు ఆ యాప్స్ నుంచి ముప్పు పొంచి ఉందన్న కారణంతో నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా చైనా వస్తు బహిష్కరణ నినాదం బాగా వినిపించింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఒప్పో,వివో లాంటి చైనా బ్రాండ్లపై ఎలాంటి నిషేధం విధించలేదు.

440 కోట్లు వదులుకున్న బీసీసీఐ..

440 కోట్లు వదులుకున్న బీసీసీఐ..

ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది కూడా వివోనే టైటిల్ స్ఫాన్సర్‌గా కొనసాగుతుందని.. తొలుతు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కానీ సరిహద్దు వివాదం కారణంగా బీసీసీఐ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రాగా.. 'బాయ్‌కాట్ ఐపీఎల్'‌ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దాంతో వెనక్కి తగ్గిన బీసీసీఐ.. వివోతో తమ ఒప్పందాన్ని ఈ ఏడాదికి రద్దు చేసుకుంది. వివో స్థానంలో డ్రీమ్ 11కు రూ.220 కోట్లకే స్పాన్సర్‌షిప్ హక్కులు కట్టబెట్టింది. చైనా వస్తు బహిష్కరణ సెగతో బీసీసీఐనే రూ.440 కోట్ల ఒప్పందాన్ని రద్దు చేసుకోగా.. ధోనీ మాత్రం ఇలా ఎందుకు చేశాడని అతని అభిమానులు మదనపడుతున్నారు.

నేను మాట్లాడకపోవడమే మంచిది.. కామెంట్రీ ప్యానెల్‌లో చోటు దక్కకపోవడంపై సంజయ్ మంజ్రేకర్

Story first published: Friday, September 18, 2020, 19:18 [IST]
Other articles published on Sep 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X