|
శిఖర్ ధావన్‌తో కలిసి..
ముఖ్యంగా జట్టులో కీలక ఆటగాడైన శిఖర్ ధావన్‌లో ఫుల్లు జోష్ నింపేందుకు ప్రీతి జింటా అతనికి జిమ్ పార్టనర్‌గా మారింది. ఈ వీడియోను అభిమానులతో పంచుకున్న పంజాబ్ కింగ్స్.. 'జిమ్‌లో కసరత్తులు చేయడానికి ఎవ్వరైనా ఇన్‌స్పిరేషన్ కావాలా? మేం మీ కోసం ఆ ఏర్పాటు కూడా చేశాం...'అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జిమ్ వర్కౌట్స్‌తో ప్రీతీ ఆటగాళ్లను రెచ్చగొడుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

టాప్ స్కోరర్‌గా..
ఇక శిఖర్ ధావన్ ఈ సీజన్‌లో అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నారు. గత ఆరు సీజన్లలోనూ 470+ పరుగులు చేసిన శిఖర్ ధావన్, ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున 11 మ్యాచుల్లో 42.33 సగటుతో 381 పరుగులు చేసి, ఫ్రాంఛైజీ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గత మూడు సీజన్లలోనూ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 3లో ముగించిన శిఖర్ ధావన్, ఈ సారి టాప్ 6లో ఉన్నాడు. మిగిలిన మూడు మ్యాచుల్లో శిఖర్ ధావన్ చేసే పరుగులు, పంజాబ్ కింగ్స్‌కి కీలకంగా మారనున్నాయి.

కెరీర్2తో పాటు...
టీ20ల్లో చోటు కోల్పోయిన శిఖర్ ధావన్, వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌లో గత రెండేళ్లలో ఊహించని మలుపులు జరిగాయి... టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడాలని ఆశపడిన శిఖర్ ధావన్‌కి, భారత జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో 500+ పరుగులు చేసిన స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉందనే కారణంగా ధావన్‌ని కాదని, ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చారు. ఈ నిర్ణయం భారత జట్టు వైఫల్యానికి కారణమైంది.

సతీమణితో విడాకులు..
అలాగే ప్రేమించి, పెళ్లి చేసుకున్న అయేషా ముఖర్జీతో గతేడాది శిఖర్ ధావన్ విడాకులు తీసుకున్నాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన అయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లాడాడు గబ్బర్. అప్పటికే అయేషా ముఖర్జీకి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న అయేషాను ఇష్టపడిన ధావన్, ఆమెను పెళ్లాడి 8 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. తనకంటే 10 ఏళ్లు పెద్దదైన అయేషా ముఖర్జీకి, శిఖర్ ధావన్‌కి ఎక్కడ చెడింది? ఎందుకు విడాకులు తీసుకున్నారనేది ఇప్పటివరకూ తెలియరాలేదు.