న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండోసారి రిటైర్మెంట్‌.. ప్రవీణ్‌ తాంబేకు లైన్‌క్లియర్‌!!

Pravin Tambe retires yet again to become first Indian player to play in CPL

ముంబై: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌)లో ఆడడానికి భారత వెటరన్‌ ‌స్పిన్నర్‌ ప్రవీణ్‌ తాంబేకు లైన్‌ క్లియర్‌ అయింది. తాజాగా తాంబే అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో.. సీపీఎల్‌లో ఆడకుండా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడిని అడ్డుకొనే అవకాశాలు లేవు. సీపీఎల్‌ 2020 ప్లేయర్ల డ్రాఫ్ట్‌లో 48 ఏళ్ల తాంబేను ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టు ఎంపిక చేసుకొంది. ఇక సీపీఎల్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా తాంబే నిలవనున్నాడు.

‌తాంబేకు లైన్‌క్లియర్

‌తాంబేకు లైన్‌క్లియర్

తాజాగా జరిగిన సీపీఎల్‌ 2020 ప్లేయర్ల డ్రాఫ్ట్‌లో ప్రవీణ్‌ తాంబేను ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఎంపిక చేసుకొంది. కానీ అతడికి బీసీసీఐ బోర్డు ఎన్‌వోసీ ఇస్తుందా? లేదా? అనే అనుమానం సర్వత్రా వ్యక్తమైంది. ఎందుకంటే తొలుత రిటైర్మెంట్‌ ప్రకటించిన తాంబే.. దాన్ని వెనక్కుతీసుకున్నాడు. అయితే తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)‌కు తాంబే ఈ-మెయిల్‌ పంపాడు. అంటే తాంబే రెండోసారి రిటైర్మెంట్ ఇచ్చాడన్నమాట. దీంతో సీపీఎల్‌ ఆడడానికి అతనికి మార్గం సుగమం అయింది.

రిటైర్డ్‌ ప్లేయర్

రిటైర్డ్‌ ప్లేయర్

ప్రవీణ్‌ తాంబే రిటైర్డ్‌ ప్లేయర్‌ అని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారి ఒకరు చెప్పారు. తొలుత క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తాంబే తర్వాత వెనక్కి తీసుకున్నాడని.. తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్లు ఇ-మెయిల్‌ పంపాడని ఎంసీఏ అధికారి ధ్రువీకరించారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం అన్ని ఫార్మాట్ల నుంచి అతడు రిటైర్‌ కావడంతో ఇకపై విదేశీ లీగ్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్న ఆటగాళ్లు విదేశాల్లో ప్రైవేట్‌ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు అన్న విషయం తెలిసిందే.

తొలి భారత క్రికెటర్‌గా రికార్డు

తొలి భారత క్రికెటర్‌గా రికార్డు

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా 48 ఏళ్ల ప్రవీణ్ తాంబే రికార్డు సృష్టించనున్నాడు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరోన్ పొలార్డ్ నేతృత్వంలోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌‌ జట్టు తరఫున తాంబే ఆడనున్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యజమాని షారుఖ్‌ ఖాన్‌.. టిన్‌బాగో జట్టుకు కూడా కో ఓనర్‌గా ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ సీపీఎల్‌ కొత్త సీజన్‌.. ఆగస్టు 18 నుంచి సెప్టెంబరు 10 వరకు షెడ్యూల్‌ చేశారు. సీపీఎల్‌-2020 సీజ‌న్‌లో ఆరు జట్లు పాల్గొంటున్నాయి.

క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో:

క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో:

ప్రవీణ్ తాంబే క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో ఇంకా ఆడుతున్నాడు. 2013 సీజన్‌లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పుడు రాజస్థాన్ రాయల్స్ కనుగోలు చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. 2016లో ఆడకపోయినప్పటికీ.. 2017 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కనుగోలు చేసింది. క్రికెట్ ఆటలో 40 ఏళ్ల చివరలో కూడా ఆటను కొనసాగించడం చాలా అరుదు. కానీ తాంబే మాత్రం 48 సంవత్సరాల వయసులో కూడా ఇంకా క్రికెట్ ఆడుతున్నాడు. 2013-16 మధ్య కాలంలో 33 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన తాంబే.. 28 వికెట్లు పడగొట్టాడు. 2014లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరపున బరిలోకి దిగి 15 వికెట్లు దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్‌ లయన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టీమ్‌ తరపున కూడా ఆడాడు.

భారత్ తెగింపుని క్రికెట్ ప్రపంచానికి చాటిన కెప్టెన్.. హ్యాపీ బ‌ర్త్‌డే దాదా!!

Story first published: Wednesday, July 8, 2020, 14:07 [IST]
Other articles published on Jul 8, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X