న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు కొట్టాలంటే స్పెషల్ టాలెంట్ ఉండాలి.. అది అతడికి దేవుడే ఇచ్చాడు'

Pravin Amre says Prithvi Shaws talent is natural, We gave him the right direction only

ముంబై: ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే ఆ జట్టు యువ ఓపెనర్ పృథ్వీ షాపై ప్రశంసలు కురిపించాడు. ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు కొట్టాలంటే బ్యాట్స్‌మెన్‌కి స్పెషల్ టాలెంట్ కావాలని, అది షాలో సహజ సిద్ధంగా ఉందన్నాడు. ఐపీఎల్ 2021లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షా ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు బాదిన విషయం తెలిసిందే. షా 41 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 82 పరుగులు చేసి జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు

ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు

కోల్‌కతా యువ పేసర్‌ శివమ్‌ మావీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే పృథ్వీ షా వీరవిహారం చేశాడు. ఓవర్లో ఆరు ఫోర్లు (Wd, 4, 4, 4, 4, 4, 4) కొట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) చరిత్రలో భారత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌, ప్రస్తుతం ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అజింక్య రహానే తర్వాత ఒకే ఓవర్లో 6 ఫోర్లు కొట్టిన రెండో క్రికెటర్‌ షానే కావడం విశేషం. 2012లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడిన రహానే.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఈ ఫీట్‌ సాధించాడు.

7 మ్యాచుల్లో 308 పరుగులు

7 మ్యాచుల్లో 308 పరుగులు

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన ఓపెనర్ పృథ్వీ షా.. అంచనాలకి మించి రాణించాడు. తాజాగా సీజన్‌లో మూడు హాఫ్ సెంచరీలు బాదిన షా.. 166.48 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 308 పరుగులు చేశాడు. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియా టూర్‌లో విఫలమైన షాపై భారత సెలెక్టర్లు వరుసగా వేటు వేస్తున్న విషయం తెలిసిందే. ఆసీస్ టూర్ అనంతరం ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికచేయలేదు. ఇక జూన్ 2న టెస్ట్ ఛాంపియన్ షిప్, ఇంగ్లండ్ టెస్టుల కోసం యూకేకి టీమిండియా వెళ్లనుండగా.. ఈ టూర్‌కి పృథ్వీ షాని బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. రోహిత్ శర్మకు జతగా అగర్వాల్, గిల్ ఆడనున్నారు.

'అన్ని టెస్టులూ ఆడాలనుంది.. కోచ్ అవకాశం ఇస్తాడో లేదో'

 షా అదే చేశాడు

షా అదే చేశాడు

క్రికెట్ నెక్స్ట్‌ ఇంటర్వ్యూలో ప్రవీణ్ ఆమ్రే మాట్లాడుతూ... 'పృథ్వీ షాలో చాలా ప్రతిభ ఉందని మీకు తెలుసు. అతనికి లేనిది పరుగుచేయాలనే తపన మాత్రమే. అతన్ని సరైన మార్గంలో తీసుకెళ్లడం చాలా కీలకం. కోచ్‌లుగా మా పాత్రలు కష్టపడటం. ఈ ఏడాది ఆరంభంలో భారత జట్టు నుంచి తప్పించిన ఎక్కడ లోపం ఉందో తెలుసుకున్నాడు. ఐపీఎల్ 2020లో పేలవ ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ 2021లో తిరిగి బౌన్స్ అయ్యాడు. షాకు ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే.. అతడికి ఎంతో ప్రతిభ ఉంది అలానే వయస్సు కూడా చాలా చిన్నది. కానీ అవి విజయవంతం కావడానికి ప్రమాణం కాదు. విజయవంతం కావడానికి కష్టపడాలి. షా అదే చేశాడు' అని అన్నాడు.

ఆ టాలెంట్ సహజ సిద్ధంగా వచ్చింది

ఆ టాలెంట్ సహజ సిద్ధంగా వచ్చింది

'పీఎల్‌ 2021లో ఓ రెండు మ్యాచ్‌ల్లో పృథ్వీ షా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు ఫోర్లు కొట్టాలంటే బ్యాట్స్‌మెన్‌కి స్పెషల్ టాలెంట్ కావాలి. అదీ ఫస్ట్ ఓవర్‌లో అంత సులువు కాదు. ఆ టాలెంట్ అతనికి సహజ సిద్ధంగా వచ్చింది. దేవుడు అతనికిచ్చిన టాలెంట్‌కి న్యాయం చేస్తున్నాడు' అని ప్రవీణ్ ఆమ్రే పేర్కొన్నాడు. షా భారత్ తరఫున 5 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్, ఇంగ్లండ్ టెస్టుల కోసం షా ఎంపిక కాకున్నా.. జూలై మధ్యలో జరిగే శ్రీలంక పర్యటనలో అతడు పాల్గొనే అవకాశం ఉంది.

Story first published: Tuesday, May 18, 2021, 14:54 [IST]
Other articles published on May 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X