న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అన్ని టెస్టులూ ఆడాలనుంది.. కోచ్ అవకాశం ఇస్తాడో లేదో'

Stuart Broad says I Want to Play All Seven Tests against New Zealand and India

లండన్: ఇంగ్లండ్ గడ్డపై త్వరలో జరగనున్న అన్ని టెస్టుల్లోనూ తనకి ఆడాలని ఉందని ఆ జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ వేసవిలో న్యూజిలాండ్, భారత్ జట్లతో ఇంగ్లండ్ మొత్తంగా ఏడు టెస్టులు ఆడనుంది. జూన్ 2న లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరగనుండగా.. జూన్ 10న బర్మింగ్‌హామ్‌‌ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత భారత్‌తో ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 10 వరకూ ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లీష్ జట్టు తలపడనుంది.

క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణ హాస్యాస్పదమైంది..వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కేసు గెలిచేవారు:వార్నర్‌క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టిన విచారణ హాస్యాస్పదమైంది..వారు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కేసు గెలిచేవారు:వార్నర్‌

ఉత్తమ జట్టులో నేను లేను:

ఉత్తమ జట్టులో నేను లేను:

స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఓ బ్రిటిష్ మీడియాతో మాట్లాడుతూ... 'గత సంవత్సరం నేను తీవ్ర అసంతృప్తి చెందాను ఎందుకంటే వేసవిలో మొదటి టెస్ట్ టీమ్.. మా ఉత్తమ జట్టు అని సెలెక్టర్లు చెప్పారు. యాషెస్, దక్షిణాఫ్రికా పర్యటలను విజయవంతంగా ముగించా. నేను ఉత్తమ జట్టులో ఉన్నానని భావించాను. కానీ సెలెక్టర్లు చెప్పిన ఉత్తమ జట్టులో నేను లేను. ఇంగ్లండ్‌లో నా రికార్డులు బాగున్నాయి. అదే నన్ను కలవరపెట్టింది' అని అన్నాడు. గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు తుది జట్టులో బ్రాడ్ లేడు. ఇదే మా అత్యుత్తమ జట్టు అని ఈసీబీ సెలెక్టర్ ఎడ్ స్మిత్ పేర్కొన్నాడు.

ఏడు టెస్టులు ఆడతా:

ఏడు టెస్టులు ఆడతా:

'ఈ వేసవిలో ఏడు టెస్టు మ్యాచ్‌లు ఆడే అవకాశం దొరికితే.. కచ్చితంగా ఆడతాను. ఎందుకంటే నేను వన్డే, టీ20ల్లో ఆడటం లేదు. టెస్టుల కోసం ఫిట్‌నెస్‌ని మెరుగు పర్చుకుని సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ కోచ్ సిల్వర్‌వుడ్ టీమ్‌లో అనుభవం ఉన్న బౌలర్లు కావాలనుకుంటే.. అప్పుడు నాకు అవకాశం దక్కనుంది. ఒకవేళ భిన్నమైన జట్టుని ఎంపిక చేసినా.. నేను అర్థం చేసుకుంటా. ఏదేమైనా అందుబాటులో ఉంటా' అని స్టువర్ట్ బ్రాడ్ తెలిపాడు. వేరే ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కుతుందంటే.. మనలో ఎదో ఒక లోపం వారిలో కనబడినట్టే, దాన్ని సరిదిద్దుకోవాలి అని పేర్కొన్నాడు.

146 టెస్టుల్లో 517 వికెట్లు:

146 టెస్టుల్లో 517 వికెట్లు:

స్టువర్ట్ బ్రాడ్ ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకూ 146 టెస్టులు, 121 వన్డేలు, 56 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో కన్నా.. టెస్టుల్లోనే బ్రాడ్ రాణించాడు. 146 టెస్ట్ మ్యాచ్‌లాడిన బ్రాడ్ 517 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు 10 వికెట్ల మార్క్‌ని అందుకున్న ఈ వెటరన్ బౌలర్.. ఏకంగా 18 సార్లు ఐదు వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో బ్యాట్‌తో కూడా రాణించాడు. ఒక సెంచరీ, 13 అర్ధ సెంచరీలు చేశాడు. ఇక వన్డేల్లో 121, టీ20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు.

ఆర్చర్‌ ఔట్:

ఆర్చర్‌ ఔట్:

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. 26 ఏళ్ల ఆర్చర్‌ కౌంటీ క్రికెట్‌లో ససెక్స్‌ తరఫున కెంట్‌తో మ్యాచ్‌లో ఆడాడు. కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్‌ చేసిన వెంటనే మైదానాన్ని వీడాడు. దీంతో స్టువర్ట్ బ్రాడ్ ఆడడం లాంఛనంగానే మారింది.

Story first published: Tuesday, May 18, 2021, 13:48 [IST]
Other articles published on May 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X