న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇప్పుడు 2021 వన్డే వరల్డ్‌కప్ టార్గెట్: పూనమ్ యాదవ్

Poonam Yadav Says Indian Players Are Mentally Strong

ముంబై: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై భారత లెగ్ స్పిన్ సెన్సేషన్ పూనమ్ యాదవ్ స్పందించింది. ప్రస్తుతం తమ టార్గెట్ 2021 ప్రపంచకప్ అని తెలిపింది. రెండు సార్లు త‌ృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నామని, 2021 ప్రపంచకప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని చెప్పుకొచ్చింది.

ఇక మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆద్యాంతం ఆకట్టుకున్న భారత మహిళల జట్టు టైటిల్ ఫైట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో ఓడినా భారత్ అక్కడి వరకు చేరిందంటే దానికి పూనమ్ యాదవ్, యువ సంచలనం షెఫాలీ వర్మనే కారణం అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అద్భుత బౌలింగ్‌‌తో పూనమ్ అదరగొట్టింది. అయితే ప్రపంచకప్‌ను తృటిలో చేజార్చుకోవడంపై పూనమ్ మాట్లాడుతూ.. 'మేం వెనుకంజలో నిలిచామని నేను చెప్పను.

టోర్నీ ఆద్యాంతం మేం అద్భతమైన క్రికెట్ ఆడాం. కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విఫలమయ్యాం. ఆ రోజు మా ప్రత్యర్థి మా కన్నా అద్భుతంగా ఆడింది. టీ20ల్లో ఒక్క ఓవర్, ఒక బ్యాట్స్‌‌మన్ మ్యాచ్ ఫలితాన్ని శాసించవచ్చు.'అని పూనమ్ యాదవ్ తెలిపింది.

టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు అవసరమా? పరిమిత ఓవర్ల పగ్గాలు రోహిత్‌కు ఇవ్వాలా?టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు అవసరమా? పరిమిత ఓవర్ల పగ్గాలు రోహిత్‌కు ఇవ్వాలా?

2017 వన్డే, 2020 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఓటములపై ప్రశ్నించగా.. భారత ఆటగాళ్లు మానసికంగా బలవంతులని చెప్పుకొచ్చింది. 'భారత ప్లేయర్లు మానసికంగా బలవంతులు. జీవితంలో ప్రతీ రోజు ఎన్నో కష్టాలు చూసిన వారే. ఆ రోజు అందరూ బాధ్యత తీసుకోవాల్సింది కానీ అలా చేయలేకపోయాం'అని ఈ సెన్సేషన్ స్పిన్నర్ చెప్పుకొచ్చింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో భారత్ గెలిచిందంటే దానికి కారణం పూనమ్ యాదవే. తన అద్భుత బౌలింగ్‌‌‌తోనే ప్రత్యర్థి బ్యాటర్స్ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో భారత్ 19 పరుగులతో గెలుపొందింది.

Story first published: Thursday, March 19, 2020, 17:44 [IST]
Other articles published on Mar 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X