న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇలా కామెంట్ చేయడం తొలిసారిగా వింటున్నా'

Players complaining about SG ball is strange: Azharuddin

ముంబై: ప్రస్తుత క్రికెటర్లు ఎస్‌జీ బంతులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాటితో ఆడేందుకు వీలుగా ఉండట్లేదని వాపోతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీతో పాటు అశ్విన్ సైతం విముఖత వ్యక్తం చేయడం గమనార్హ్ం. భారత క్రికెట్‌కు సాన్స్‌పరెలీస్ గ్రీన్‌ల్యాండ్స్(ఎస్‌జీ) బంతులకు విడదీయరాని సంబంధం. 1993లో ఎస్‌జీ బంతులను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో అటు దేశవాళీకి తోడు అంతర్జాతీయ క్రికెట్‌లో మనం ఎన్నో చిరస్మరణీయ విజయాలనందుకున్నాం.

ఆకారం మారడంతో బౌలింగ్ కష్టంగా

ఆకారం మారడంతో బౌలింగ్ కష్టంగా

కానీ ఇప్పుడు ఇవే బంతులపై టీమిండియా క్రికెటర్లు ఫిర్యాదులు చేయడం ఈ మధ్యనే చూస్తున్నాం. బంతి సీమ్‌ను కోల్పోవడంతో పాటు ఆకారం మారడంతో బౌలింగ్ చేయడం కష్టంగా మారుతుందని కెప్టెన్ కోహ్లీతో పాటు ఉమేశ్‌యాదవ్, కుల్దీప్ యాదవ్, అశ్విన్ తమ అసంతృప్తిని వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్..టీమ్‌ఇండియా క్రికెటర్ల వైఖరిని తప్పుబట్టాడు.

సెమీ ఫైనల్లో హైదరాబాద్, ముంబైను దాటితేనే ఫైనల్‌కి..

ఇంగ్లండ్ కౌంటీల్లో 52 వికెట్లు

ఇంగ్లండ్ కౌంటీల్లో 52 వికెట్లు

దేశ క్రికెట్‌లో 1993లో ఎస్‌జీ బంతులను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాము. వేర్వేరు బంతులతో ఆడే వివిధ దేశాల క్రికెట్ టోర్నీల్లో ఒక్కసారి బౌలింగ్ సగటు పరిశీలిస్తే అర్థమవుతుంది. 2017-18 రంజీ సీజన్‌లో 23.45 సగటుతో 58 వికెట్లు నేలకూలాయి. అదే ఇంగ్లండ్ కౌంటీల్లో 23.45 సగటుతో 52 వికెట్లు, షెఫీల్డ్ షీల్డ్(ఆస్ట్రేలియా) టోర్నీలో 23.69 సగుటుతో 25 వికెట్లు పడ్డాయి.

బంతులు సరిగ్గా లేవనడం తొలిసారి

బంతులు సరిగ్గా లేవనడం తొలిసారి

ఇక్కడే తెలిసిపోతుంది ఎక్కడి పరిస్థితులకు తగ్గట్లు అక్కడ వేర్వేరు రకాల బంతులు ప్రభావం చూపిస్తున్నాయో. వెస్టిండీస్‌పై రాజ్‌కోట్, హైదరాబాద్ టెస్ట్‌ల్లో కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్ కూడా బంతులపై ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కల్గిస్తోంది. ఉపఖండ క్రికెటర్లు ఇలా బంతులు సరిగ్గా లేవనడం తొలిసారిగా వింటున్నా. ఎవరైనా పరిస్థితులకు తగ్గట్లు బంతులను వాడేందుకు మొగ్గుచూపుతారు.

 సమస్యకు పరిష్కారం వెతుక్కొవాలి గానీ..

సమస్యకు పరిష్కారం వెతుక్కొవాలి గానీ..

ఇంగ్లండ్‌లో డ్యూక్‌కు బదులు ఎస్‌జీ బంతులను వాడితే ఎలా ఉంటుంది. ఐదు, పది వికెట్లు తీస్తూ బౌలర్లు బంతులు సరిగ్గా లేవనడం, సెంచరీ కొట్టిన బ్యాట్స్‌మన్..పిచ్‌పై ఫిర్యాదు చేయడం లాగా ఉంది. బంతులు సరిగ్గా లేనప్పుడు సదరు కంపెనీని సంప్రదించి సమస్యకు పరిష్కారం వెతుక్కొవాలి గానీ ఇలా చేయకూడదని అజారుద్దీన్ అన్నాడు.

Story first published: Wednesday, October 17, 2018, 10:03 [IST]
Other articles published on Oct 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X