న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెమీ ఫైనల్లో హైదరాబాద్, ముంబైను దాటితేనే ఫైనల్‌కి..

Vijay Hazare Trophy: Prithvi Shaw joins Ajinkya Rahane, Rohit Sharma in star-studded Mumbai batting line-up

న్యూ ఢిల్లీ: అఖిల భారత విజయ్‌ హజారే ట్రోఫీలో తొలిసారిగా సెమీఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించిన హైదరాబాద్‌.. సంచలన విజయంతో ఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించాలని తహతహలాడుతోంది. బుధవారం జరిగే తొలి సెమీస్‌లో టీమిండియా స్టార్లతో కూడిన హాట్‌ఫేవరెట్‌ ముంబైను అండర్‌డాగ్‌ హైదరాబాద్‌ ఢీకొననుంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన హైదరాబాద్‌ టోర్నీ ఆసాంతం ఆకట్టుకునే ప్రదర్శన చేసింది.

సిరాజ్‌ చేరికతో జట్టు బలం పెరిగి

సిరాజ్‌ చేరికతో జట్టు బలం పెరిగి

అంబటి రాయుడి అనుభవంతోపాటు టీమిండియా పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ చేరికతో జట్టు బలం పెరిగింది. క్వార్టర్స్‌లో ఆంధ్రతో మ్యాచ్‌లో సందీప్‌ బ్యాట్‌తో మెరిశాడు. తన్మయ్‌ అగర్వాల్‌ నుంచి కూడా జట్టు అదే తరహా ప్రదర్శనను ఆశిస్తోంది. బౌలింగ్‌ భారం సిరాజ్‌పైనే ఎక్కువగా ఉండనుంది. జట్టును సెమీస్‌ చేర్చడంలో సిరాజ్‌ కీలకపాత్ర పోషించాడు. మెహ్దీహసన్‌ జట్టుకు వి లువైన సేవలు అందిస్తున్నాడు.

రోహిత్‌శర్మ, శ్రేయస్‌‌లకు జతగా పృథ్వీ షా:

రోహిత్‌శర్మ, శ్రేయస్‌‌లకు జతగా పృథ్వీ షా:

ఐతే రోహిత్‌శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌లకు జతగా స్టార్‌ ఆటగాడు పృథ్వీ షా, ఆజింక్య రహానె జట్టులో చేరడంతో ముంబై బలం పెరిగింది. శ్రేయాస్‌ అయ్యర్‌ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు ప్లస్‌. రోహిత్‌తో కలసి పృథ్వీ ఓపెనింగ్‌ చేస్తే హర్వాడ్కర్‌ బెంచ్‌కే పరిమితం కానున్నా డు. సిద్దేశ్‌ లేదా సూర్యకుమార్‌ స్థానంలో రహానె జట్టులోకి రానున్నాడు. క్వార్టర్స్‌లో బిహార్‌ను చిత్తుచేసిన ముంబై మరోసారి అదే తరహా ప్రదర్శన చేయాలని భావిస్తోంది. బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే, ధవళ్‌ నిలకడగా రాణిస్తున్నారు.

ఎవరు నిలదొక్కుకున్నా హైదరాబాద్‌కు కష్టాలు తప్పవ్:

ఎవరు నిలదొక్కుకున్నా హైదరాబాద్‌కు కష్టాలు తప్పవ్:

ఈ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌ల్లో శ్రేయాస్ అయ్యర్(311 పరుగులు), పృథ్వీ(287), సూర్యకుమార్(237), రహానే(230) మంచి ఫామ్‌మీద కనిపిస్తున్నారు. బ్యాటింగ్ పరంగా హైదరాబాద్ కంటే దుర్బేద్యంగా కనిపిస్తున్న ముంబై సెమీస్‌లో భారీ స్కోరుపై కన్నేసింది. వీరిలో ఎవరు నిలదొక్కుకున్న హైదరాబాద్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ధవల్‌ కులకర్ణి (14 వికెట్లు), శామ్స్‌ ములాని (15 వికెట్లు) ముంబై తరఫున సత్తాచాటారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా ముంబై మెరుగ్గా కనిపిస్తోంది.

ముంబై ఫైనల్‌కు వెళితే.. రోహిత్

ముంబై ఫైనల్‌కు వెళితే.. రోహిత్

అంబటి రాయుడు సారథ్యంలోని హైదరాబాద్‌ నుంచి గట్టి పోటీ ఎదురవడం ఖాయం. కెప్టెన్‌ రాయుడు.. పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై హైదరాబాద్‌ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్‌లో సందీప్‌ (342), తన్మయ్‌ అగర్వాల్‌ (292).. బౌలింగ్‌లో సిరాజ్‌ (8), మెహదీ హసన్‌ (13) జోరు కొనసాగిస్తే హైదరాబాద్‌ సంచలనం సృష్టించొచ్చు. ఒకవేళ ముంబై ఫైనల్‌కు వెళితే..వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ అందుబాటులో ఉండకపోవచ్చు.

Story first published: Wednesday, October 17, 2018, 11:33 [IST]
Other articles published on Oct 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X