న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పోలికలు వద్దు.. నీ ఆట మాత్రమే ఆడుకో: అజారుద్దీన్

India vs West Indies 2018 : Play Your Natural Game Don’t Bother About Comparisons Azharuddin Says
Play your natural game, dont bother about comparisons: Azharuddin to Shaw

న్యూ ఢిల్లీ: అరంగేట్రంలోనే అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు పృథ్వీ షా. వెస్టిండీస్‌తో టీమిండియా తలపడుతోన్న టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో ఆడి విధ్వంసం సృష్టించాడు. అయితే ఇలా సెంచరీ బాది రికార్డుల మోత మోగించిన భారత యువ ఓపెనర్ పృథ్వీ షా‌ని సచిన్, సెహ్వాగ్‌తో పోల్చడం సరికాదని మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ సూచించాడు.

స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించిన పృథ్వీ షా

స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించిన పృథ్వీ షా

రాజ్‌కోట్ వేదికగా గత శనివారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో పృథ్వీ షా (134) మెరుపు సెంచరీ చేశాడు. సీనియర్ బ్యాట్స్‌మెన్‌ సైతం ఆ పిచ్‌పై పరుగులు రాబట్టేందుకు శ్రమిస్తున్న తరుణంలో పృథ్వీ షా స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. ఒకానొక దశలో అరంగేట్రం మ్యాచేనా..? అనే సంశయాన్ని అందరిలోనూ రేకెత్తించాడు.

దిగ్గజ క్రికెటర్లతో పోలిక కరెక్ట్ కాదు

దిగ్గజ క్రికెటర్లతో పోలిక కరెక్ట్ కాదు

ఈ నేపథ్యంలో.. తాజాగా అజహరుద్దీన్ మాట్లాడుతూ ‘పృథ్వీ షా కేవలం ఒక్క సెంచరీ మాత్రమే చేశాడు. నిజమే.. 18 ఏళ్ల వయసులో అతను ఆ సెంచరీ మైలురాయిని అందుకోవడం గొప్ప విషయం. అంతమాత్రానా.. దిగ్గజ క్రికెటర్లతో పోలిక తేవడం కరెక్ట్ కాదు. పృథ్వీ షా ఈ పోలికలను పట్టించుకోకుండా తన సహజమైన ఆటని ఆడుకుంటూ ముందుకు వెళ్లాలి' అని అజహరుద్దీన్ సూచించాడు.

పాకిస్తాన్‌ జట్టులో టెండూల్కర్.. :వీరేందర్ సెహ్వాగ్

అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన టీనేజర్‌గా

అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన టీనేజర్‌గా

కేవలం 99 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకున్న 18 ఏళ్ల పృథ్వీ షా.. భారత్ తరఫున అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన పిన్న వయస్కుడిగా రికార్డుల్లో నిలిచాడు. పృథ్వీ షా బ్యాటింగ్ టెక్నిక్, దూకుడు చూసిన మాజీ క్రికెటర్లు అతడ్ని సచిన్, సెహ్వాగ్‌‌తో పోల్చుతూ ప్రశంసల వర్షం కురిపించారు. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 272 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ జట్టు.. శుక్రవారం హైదరాబాద్‌ వేదికగా రెండో టెస్టులో వెస్టిండీస్‌‌తో తలపడనుంది.

జీనియస్ సెహ్వాగ్‌తో పోల్చొద్దు:

జీనియస్ సెహ్వాగ్‌తో పోల్చొద్దు:

'అతని పాజిటివ్ కోణం, బ్యాటింగ్ చేసే శైలి అమోఘం. అండర్ 19 వరల్డ్ కప్.. టెస్టు మ్యాచ్ ఫార్మాట్‌లు వేర్వేరు. కానీ షా దానికి ధీటుగా రాణించి సత్తా చాటాడు. మరి కొద్ది రోజుల్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన చేయనుంది. ఆ పర్యటనలో పృథ్వీకి చోటు లభిస్తుంది. ' టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

Story first published: Monday, October 8, 2018, 14:35 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X