Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్‌ జట్టులో టెండూల్కర్.. :వీరేందర్ సెహ్వాగ్

Virender Sehwag Points Out Sachin Tendulkar Of Pakistan Cricket Team

న్యూ ఢిల్లీ: భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పాకిస్తాన్ జట్టులో సచిన్ టెండూల్కర్ గురించి చెప్పుకొస్తున్నాడు. ఇటీవల ఓ ప్రముఖ ఉర్దూ మీడియా అయిన ఖలీజ్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఒక ఆటగాడిగా షాహిద్ అఫ్రీది అంటే తమకెంత ఇష్టమో చెప్పుకొచ్చాడు. తను పాకిస్తాన్ జట్టులో సచిన్ టెండూల్కర్ లాంటి వాడని చెప్పుకొచ్చాడు.

షాహిద్ అఫ్రీదిను టెండూల్కర్‌తో పోల్చి

షాహిద్ అఫ్రీదిను టెండూల్కర్‌తో పోల్చి

'పాకిస్తాన్‌తో నా తొలి టెస్టు మొదలుకాకముందు జట్టులో అందరూ షాహిద్ అఫ్రీదిను టెండూల్కర్‌తో పోల్చి మాట్లాడేవారు. ఎందుకంటే ఒక ఆటగాడిగా అఫ్రీది.. టెండూల్కర్ లాంటి వాడని మా ఉద్దేశ్యం.' అని సెహ్వాగ్ వివరించాడు. దాంతో పాటు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ప్రాముఖ్యత గురించి చర్చించాడు.

భారత్-పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ను

భారత్-పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ను

'ప్రతి భారతీయుడితో పాటు పాకిస్తానీ ప్రజలకు భారత్-పాక్‌ల మధ్య జరిగే మ్యాచ్‌ను చూడాలనుంటుంది. క్రికెటర్‌గానైతే మాకే ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది. కొద్ది కాలంగా జరిగే మార్పులను బట్టి చూస్తుంటే కొంతకాలంలో ఉభయ దేశాల ప్రభుత్వాలు ఈ విషయం పట్ల రాజీకొచ్చేలా కనిపిస్తోంది. దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ సిరీస్‌లకు తెరతీస్తే బాగుంటుంది. నాకు పాకిస్తాన్ గడ్డపై ఆడిన మ్యాచ్‌లలో గుర్తుండిపోయే ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. లాహోర్ వేదికగా ముల్తాన్ టెస్టులో డబుల్ సెంచరీ చేయగలిగాను' అని గుర్తు చేసుకున్నాడు.

సెహ్వాగ్.. టెండూల్కర్‌లు ఓపెనర్లుగా

సెహ్వాగ్.. టెండూల్కర్‌లు ఓపెనర్లుగా

సెహ్వాగ్.. టెండూల్కర్‌లు ఓపెనర్లుగా 93 వన్డేల్లో ఆడారు. 42.13 సగటుతో ఆడి వీరిద్దరి భాగస్వామ్యంలో 3,919పరుగులు రాబట్టారు. ఇంకా శతక భాగస్వామ్యాలు 12, అర్థ శతక భాగస్వామ్యాలు 12వీరి ఖాతాలో ఉన్నాయి. ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగో ఓపెనింగ్ పెయిర్ స్థానాన్ని దక్కించుకున్నారు.

క్రికెట్ ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదించా

క్రికెట్ ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదించా

ఖలీజ్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో షాహిద్‌ అఫ్రిది మాట్లాడుతూ "ప్రస‍్తుత కాలంలో టెస్టు క్రికెట్‌కు చోటు లేదనేది నా అభిప్రాయం. నా కెరీర్‌లో కూడా టెస్టు క్రికెట్‌పై ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. వన్డే క్రికెట్ ఆడటాన్ని ఎంతగానో ఆస్వాదించా. టెస్టు ఫార్మాట్‌లో ఎక్కువ ఎంజాయ్‌మెంట్‌ అనేది ఉండదని, కాకపోతే నేటి శకంలో ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ను బలవంతంగా ఆడతున్నారనే నేను భావిస్తున్నా" అని అన్నాడు.

Story first published: Monday, October 8, 2018, 14:25 [IST]
Other articles published on Oct 8, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+