న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాంచీలో ధోనీ ఏదో చేశాడు.. లేకుంటే నెట్స్‌లో అలా ఎలా ఆడుతాడు: సీఎస్‌కే స్పిన్నర్

Piyush Chawla Says MS Dhoni must have done something in Ranchi


న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ గతేడాది జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి అనంతరం మైదానానికి దూరమైన విషయం తెలిసిందే. తొలుత ఆర్మీలో సేవ చేసేందుకు విరామాన్ని ప్రకటించిన మహీ.. ఆ ఆర్వాత ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఈక్రమంలోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. దీంతో ఈ జార్ఖండ్ డైనమైట్ కెరీర్ ముగిసిందనే మాటలు వినిపించాయి. ఇక అతని భవితవ్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌తో తేలనుందని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి వంటి ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు.
 చెన్నై క్యాంప్‌లో..

చెన్నై క్యాంప్‌లో..

ధోనీ కూడా తన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఏర్పాటు చేసిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. కానీ కరోనా పుణ్యమా ఈ లీగ్ నిరవధికంగా వాయిదాపడటంతో ధోనీ భవితవ్యం మరోసారి హాట్‌టాపిక్ అయింది. అయితే ఎవరూ ఎన్ని అన్నా.. చెన్నై ఆటగాళ్లు మాత్రం ప్రాక్టీస్ సెషన్‌లో ఓ కొత్త ధోనీని చూశామని తెలిపారు. ఈ లాక్‌డౌన్ పిరీయడ్‌లో ప్రతీ ఆటగాడు తమ ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని తెలియజేశారు. ఐపీఎల్‌లో రాణించాలనే కసి మహీలో కనిపించిందని, తద్వారా భారత జట్టుకు ఎంపికై 2011 ప్రపంచకప్ ఆడాలనే ధోనీ తాపత్రాయం అర్ధమైందన్నారు. ఎన్నడూ లేని విధంగా ధోనీ కీపింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడన్నారు.

అలా అనిపించలేదు..

అలా అనిపించలేదు..

ఇక తాజాగా ఆ జట్టు స్పిన్నర్ పీయూష్ చావ్లా కూడా ఇదే విషయాన్ని తెలియజేశాడు. నెట్స్‌లో ధోనీ బ్యాటింగ్, షాట్స్ చూస్తే.. అతను ఇన్నాళ్లు మైదానానికి దూరంగా ఉన్నట్లు అనిపించలేదని, రాంచీలో ఏదో చేశాడనే అనుమానం కలిగిందన్నాడు. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్ ‘ఆకాశ్ వాణీ'లో మాట్లాడుతూ మహీ ప్రాక్టీస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

తడబాటు లేదు..

తడబాటు లేదు..

‘నిజాయితీగా చెప్పాలంటే ఏ ఆటగాడైన లాంగ్ బ్రేక్ తర్వాత మైదానంలో అడుగుపెడితే ఇబ్బందిగా ఫీలవుతాడు. కానీ మహీ బాయ్‌ ఆటకు అంతకాలం దూరంగా ఉన్నా అతనిలో ఎలాంటి తడబాటు కనిపించలేదు. ధోనీ బాయ్ రాంచీలో ఏదో చేశాడు. సీఎస్‌కే బ్యాటింగ్ సెషెన్స్‌లో ఓ 5-6 బంతులు చూసేవాడు. ఆ తర్వాత భారీ షాట్లు ఆడేవాడు.

నిర్విరామంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. ఇక ఆ క్యాంప్‌లో బ్యాట్స్‌మన్ చాలా తక్కువగా పాల్గొనగా.. బౌలర్లే ఎక్కువగా ఉన్నారు. ప్రతీ బ్యాట్స్‌మన్(రైనా, రాయుడు, మహీ బాయ్) రెండు నుంచి రెండున్నర గంటలపాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవారు. ఒక్కొక్కరు 200-250 బంతులను ఎదుర్కొనేవారు.'అని చావ్లా తెలిపాడు.

నా బెస్ట్ కెప్టెన్ ధోనీనే..

నా బెస్ట్ కెప్టెన్ ధోనీనే..

ఇక తాను ఆడిన కెప్టెన్లలో ధోనీనే అత్యుత్తమ సారథని చావ్లా స్పష్టం చేశాడు. ‘ఇప్పటికీ నా అత్యుత్తమ సారథి ధోనీనే అని చెబుతా. ఇక సారథ్య విషయంలో గంభీర్, ధోనీని పోల్చలేం. నిజాయితీగా చెప్పాలంటే ఇద్దరు ఇద్దరే. బౌలర్లకు పూర్తి స్వేచ్చ ఇస్తారు. ఇద్దరిలో కొన్ని లక్షణాలు ఒకేలా ఉంటాయి. బౌలర్లను పూర్తిగా నమ్ముతారు. అది కుదరకపోతే మరో వ్యూహంతో ముందుకెళ్తారు. కాబట్టి ఇద్దరిని పోల్చలేం'అని చావ్లా చెప్పుకొచ్చాడు.

2011 ప్రపంచకప్ ఫిక్సింగ్ కేసు: సంగక్కరను 10 గంటలు విచారించిన పోలీసులు.. రొడ్డెక్కిన అభిమానులు

Story first published: Friday, July 3, 2020, 10:32 [IST]
Other articles published on Jul 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X