2011 ప్రపంచకప్ ఫిక్సింగ్ కేసు: సంగక్కరను 10 గంటలు విచారించిన పోలీసులు.. రొడ్డెక్కిన అభిమానులు

కొలంబో: 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సింగ్ వ్యవహారం శ్రీలంకలో రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. భారత్‌తో జరిగిన నాటి ఫైనల్లో శ్రీలంక అమ్ముడుపోయిందని ఆ దేశ మాజీ క్రీడాశాఖమంత్రి అలుత్గమాగే మహిందానంద చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న లంక ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసింది.

రెండు సార్లు టాస్ వేయడంపైనే..
ఇక ఈ దర్యాప్తు విభాగం గురువారం నాటి శ్రీలంక జట్టు కెప్టెన్ కుమార సంగక్కరను సుమారు 10 గంటల పాటు విచారించింది. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో రెండు సార్లు టాస్ వేయడంపై గల కారణాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన సంగక్కర.. నిజనిజాలు త్వరలోనే వెలుగు చూస్తాయని చెప్పి వెళ్లిపోయాడు.
అభిమానుల ఆందోళన..
ఇక నిరాధారమైన ఆరోపణలతో విచారణ పేరిట క్రికెటర్లను వేధించడంపై శ్రీలంకలో నిరసనలు మొదలయ్యాయి. సంగక్కరను విచారించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూత్ స్పోర్ట్స్ మినిస్ట్రీ కార్యలయం ముందు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. ఇక శ్రీలంక ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమ్ దాసా క్రికెటర్ల పట్ల ప్రభుత్వం ప్రవర్తిస్తు తీరును తప్పుబట్టాడు. ట్విటర్ వేదికగా 2011 ప్రపంచకప్ ఆటగాళ్లకు మద్దతు తెలిపాడు. ‘మన 2011 ప్రపంచకప్ హీరోలను విచారణ పేరిట వేధించడాన్ని వ్యతిరేకించాలి. ప్రభుత్వ చర్యలు దారుణమైనవి'అని ట్వీట్ చేశాడు.

ఫ్లేట్ ఫిరాయించిన మాజీ మంత్రి
ఇక అంతకు ముందు మహిందానందను విచారించిన దర్యాప్తు విభాగం.. అతని స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయగా.. తన వద్ద ఫిక్సింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని.. తాను కేవలం అనుమానంతో మాత్రమే ఆ వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత 2011 వరల్డ్‌కప్‌కి టీమ్‌ను ఎంపిక చేసిన చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వాను.. ఆ మ్యాచ్‌లో ఆడిన ఓపెనర్ ఉపుల్ తరంగాలను కూడా విచారించింది.

భారత్ సూపర్ విక్టరీ..
నాటి ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 274/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. స్టార్ బ్యాట్స్‌మెన్ సెహ్వాగ్ (0), సచిన్ (18)ల వికెట్లను త్వరగా కోల్పోయింది. ఆ క్లిష్ట స్థితిలో గౌతమ్ గంభీర్(97) అద్భుత పోరాటానికి.. ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఆరు వికెట్లతో టీమిండియా విజయం సాధించింది. ఇక మూడేళ్ల క్రితం శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కూడా ఈ మ్యాచ్ ఫలితంపై సందేహం వ్యక్తం చేశాడు.
సచిన్ చేసిన ఆ సెంచరీకి విలువ ఉండదా? అని సెలెక్టర్ దుమ్ము దులిపా: మాజీ స్పిన్నర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications