న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'యూనిస్‌ ఖాన్ జోక్‌ చేశాడు.. కోచ్‌పై కత్తితో బెదిరింపులకు దిగలేదు'

PCB decline comment on Grant Flower’s charge against Younis Khan
సలహా ఇచ్చినందుకు బ్యాటింగ్ కోచ్‌ గొంతుపై కత్తి పెట్టిన క్రికెటర్ !! || Oneindia Telugu

కరాచీ: పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌‌ యూనిస్‌ ఖాన్‌ గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడంటూ మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ), పాక్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఖండించాయి. గ్రాంట్‌ ఫ్లవర్‌ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం వాస్తవం కాదన్నాయి. యూనిస్‌ ఖాన్‌ ఏదో సరదాగా కత్తి తీసుకుని గ్రాంట్‌ ఫ్లవర్‌ను ఆటపట్టించాడని స్పష్టం చేశాయి. ఏదేమైనా గ్రాంట్‌ ఫ్లవర్‌ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌ క్రికెట్‌లో కలకలం రేపాయి.

ఫ్లవర్‌ను ఆటపట్టించాడు

ఫ్లవర్‌ను ఆటపట్టించాడు

'పాకిస్తాన్ మాజీ బ్యాటింగ్‌ కోచ్ గ్రాంట్‌ ఫ్లవర్‌ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం వాస్తవం కాదు. యూనిస్‌ ఖాన్‌ ఏదో సరదాగా కూరగాయాలు తరిగే కత్తి తీసుకుని గ్రాంట్‌ ఫ్లవర్‌ను ఆటపట్టించాడు. బ్రేక్‌ ఫాస్ట్‌ సమయంలో కూడా సలహాలు ఎందుకని యూనిస్‌ అలా చేసి ఉండవచ్చు. అంతేకానీ కావాలని బెదిరింపులకు దిగలేదు. ఇక ఫ్లవర్‌ చేసిన వ్యాఖ్యలపై యూనిస్ స్పందించే అవకాశం లేదు. యూనిస్ ఎప్పుడూ సరదాగా ఉంటాడు. ఇలాంటి ఘటనలు అతనితో మాకు ఎపుడూ ఎదురుకాలేదు. యూనిస్‌ జోక్‌ చేస్తే.. సీరియస్‌ వ్యాఖ్యలా' అని పీసీబీ వర్గాలు అన్నాయి.

గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇలా

గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇలా

‌పాకిస్తాన్ జట్టుతో పని చేసిన కోచ్‌లు కానీ, సపోర్టింగ్‌ స్టాఫ్‌ కానీ ఒకసారి తమ కాంట్రాక్ట్‌లు ముగిసిపోయిన తర్వాత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇలా బహిర్గతం చేయడాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తప్పుబట్టింది. ఇది వారికి ఏమాత్రం తగదంది. ఒక జట్టుకు కోచ్‌గా పని చేసి వెళ్లిపోయినప్పుడు ఎందుకు కొన్ని అంశాల్ని తెరపైకి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని పీసీబీలోని ఒక సీనియర్‌ అధికారి అన్నారు. యూనిస్ ఖాన్ పాక్ ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. అతడు ప్రస్తుతం పాక్ జట్టుతో పాటు ఇంగ్లండ్‌లో ఉన్నాడు.

కత్తి తీసుకుని నా గొంతుపై పెట్టాడు

కత్తి తీసుకుని నా గొంతుపై పెట్టాడు

'యూనిస్‌ ఖాన్‌ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బ్రిస్బేన్‌లో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. బ్రిస్బేన్ టెస్ట్ సమయంలో.. మ్యాచ్‌కి ముందు ఓరోజు ఉదయం అందరం బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. యూనిస్ ఖాన్ నా పక్కనే కూర్చున్నాడు. అప్పుడు బ్యాటింగ్‌పై ఓ చిన్న సలహా ఇచ్చా. కోపంతో ఒక్కసారిగా ఊగిపోయిన అతడు.. టేబుల్‌పై ఉన్న కత్తిని తీసుకుని నా గొంతుపై పెట్టాడు. నాకు బయమేసింది. ఆ పక్కనే ఉన్న చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్ అడ్డుపడటంతో ఆరోజు బతికి బయటపడ్డా. సలహా ఇవ్వడం కోచింగ్‌లో భాగం. కానీ యూనిస్ తీసుకోలేదు' అని గ్రాంట్ ఫ్లవర్ చెప్పారు.

ఫామ్‌హౌస్‌లో ప్రాక్టీస్ చేస్తున్న షమీ.. ఎవరితోనో తెలుసా?!! (వీడియో)

Story first published: Friday, July 3, 2020, 16:21 [IST]
Other articles published on Jul 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X