న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫామ్‌హౌస్‌లో ప్రాక్టీస్ చేస్తున్న షమీ.. ఎవరితోనో తెలుసా?!! (వీడియో)

Indian bowler Mohammed Shami returns to net practice session at farmhouse with his brothers

లక్నో: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దాదాపు నాలుగు నెలలు ఇంటికే పరిమితమైన టీమిండియా పేసర్‌ మొహమ్మద్ షమీ ఇటీవలే అవుట్‌ ఫీల్డ్‌లో ప్రాక్టీస్‌ సెషన్ ఆరంభించాడు. పేస్‌, స్వింగ్‌ వేసే షమీ.. తన బౌలింగ్‌కు పదునుపెట్టే పనిలో పడ్డాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన స్వస్థలంలో ఉన్న ఫామ్‌హౌజ్‌లో షమీ ప్రాక్టీస్‌ చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత కూడా ప్రాక్టీస్ చేసినా.. అతి త్వరలోనే అతడు ట్రాక్‌లోకి వచ్చేశాడు.

ఫామ్‌హౌజ్‌లో బౌలింగ్ ప్రాక్టీస్‌

తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన ఫామ్‌హౌజ్‌లో మొహమ్మద్ షమీ ప్రాక్టీస్‌ చేశాడు. తన సోదరులతో కలిసి అక్కడ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఒకరు బ్యాటింగ్ చేస్తుండగా.. షమీ బౌలింగ్ వేశాడు. షమీ వేసే బంతులను అతని సోదరుడు ఎదుర్కోలేకపోయాడు. ఒక్కోసారి డిఫెన్స్ ఆడాడు. షమీతో పాటు అతని సోదరులు కూడా బౌలింగ్ చేశారు. ఇక షమీ ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ చిన్న అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడు. భారత పేసర్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా సాధన చేశాడు.

 ఫామ్‌హౌజ్‌లో క్వాలిటీ ప్రాక్టీస్‌ సెషన్

ఫామ్‌హౌజ్‌లో క్వాలిటీ ప్రాక్టీస్‌ సెషన్

ఫామ్‌హౌజ్‌లో తన సాధనకు సంబందించిన వీడియోను గురువారం మొహమ్మద్ షమీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'నా ఫామ్‌హౌజ్‌లో క్వాలిటీ ప్రాక్టీస్‌ సెషన్‌. నా సోదరులతో కలిసి బౌలింగ్ సాధన చేశాను' అని వీడియోకు కాప్షన్ రాసుకొచ్చాడు. గతంలో ఇంట్లో షమీ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన సంగతి తెలిసిందే. సోదరుడు బౌలింగ్‌ చేస్తుండగా షమీ బ్యాటింగ్‌ చేశాడు. షమీ భారత్ తరఫున 49 టెస్టులు, 77 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 180, వన్డేల్లో 144, టీ20ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.

శునకంతో పరుగెత్తుతూ

శునకంతో పరుగెత్తుతూ

ఇటీవల మొహమ్మద్ షమీ అందరికంటే కాస్త భిన్నంగా ఫిట్​నెస్ కసరత్తులు చేశాడు. షమీ మునుపటి పరుగు వేగాన్ని అందుకునేందుకు తన పెంపుడు శునకంతో పొలాల్లో పరుగెత్తాడు. శునకంతో పరుగెత్తుతూ.. మునుపటి తన పరుగు వేగాన్ని అందుకునేందుకు తీవ్రంగా కృషి చేశాడు. ఈ పరుగులో ఎక్కువ భాగం షమీనే ఆధిపత్యం ప్రదర్శించినా.. చివరలో శునకం అతణ్ని దాటేసింది. టీమిండియా అన్ని ఫార్మాట్​లలో కీలక బౌలర్​గా షమీ ఉన్నాడు. జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్‌ శర్మలతో కలిసి సీమ్‌ బౌలింగ్‌ విభాగాన్ని పంచుకుంటున్నాడు.

క్లీన్ చీట్

క్లీన్ చీట్

రెండేళ్ల క్రితం మహమ్మద్ షమీ భార్య హాసిన్ జహాన్ అతనిపై సంచలన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షమీ స్త్రీలోలుడని, అతని కుటుంబం ఆమెను అనేక ఇబ్బందులు గురిచేసిందని, లైంగికంగా కూడా వేదించారిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలు సమర్పించి క్రికెట్‌లో వచ్చాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు షమీ, అతని సోదరుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. హాసిన్ ఆరోపణలతో విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతను ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చింది.

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. రిజర్వ్‌ ఆటగాడికి చోటు.. విండీస్‌ జట్టు ఇదే!!

Story first published: Friday, July 3, 2020, 15:30 [IST]
Other articles published on Jul 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X