న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs RCB: విరాట్ బాదినా బాధపడలేదు.. తొలి వికెట్‌ కోహ్లీదే కావడం ఎంతో ప్రత్యేకం: హర్‌ప్రీత్‌ బ్రార్‌

PBKS vs RCB: Harpreet Brar says I wasnt overwhelmed when Virat Kohli hit me

అహ్మదాబాద్‌: తన బౌలింగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సిక్స్ బాదినా బాధపడలేదని పంజాబ్‌ కింగ్స్‌ యువ స్పిన్ బౌలర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో తన తొలి వికెట్‌ కోహ్లీదే కావడం ఎంతో ప్రత్యేకం అని పేర్కొన్నాడు. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శుక్రవారం బ్యాంగలురుతో జరిగిన మ్యాచ్‌లో హ‌ర్‌ప్రీత్‌ మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో స్టార్ బ్యాట్స్‌మన్‌లు విరాట్‌ కోహ్లీ (35), గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (0), ఏబీ డివిలియర్స్‌ (3)లను పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు 17 బంతుల్లో 25 రన్స్ కూడా చేసి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కించుకున్నాడు.

కోహ్లీ క్రీజు వెలుపలికి రాగా

కోహ్లీ క్రీజు వెలుపలికి రాగా

హర్‌ప్రీత్ బ్రార్ వేసిన 7వ ఓవర్ తొలి బంతినే బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సిక్స్‌గా బాదాడు. ఆ ఓవర్లో 10 రన్స్ ఇచ్చాడు. 9వ ఓవర్ మొదటి బంతికి కూడా కోహ్లీ ఫోర్ బాదాడు. ఆ ఓవర్లో 9 పరుగులు ఇచ్చాడు. అయినా కూడా పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అతడికి బంతినిచ్చి సాహసం చేశాడు. 11వ ఓవర్‌లో హర్‌ప్రీత్ బౌలింగ్‌కి రాగా.. కోహ్లీ క్రీజు వెలుపలికి వెళ్లి మరో సిక్స్ కొట్టబోయాడు. బ్యాట్‌కి అందకుండా బంతిని హర్‌ప్రీత్ టర్న్ చేయడంతో కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత బంతికే మాక్స్‌వెల్ కూడా ఔట్ అయ్యాడు. ఇక 13వ ఓవర్ మొదటి బంతికే డివిలియర్స్‌ని కూడా అతడు ఔట్ చేశాడు. 4 ఓవర్లలో 19 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

 విరాట్ బాదినా ఆందోళన చెందలేదు

విరాట్ బాదినా ఆందోళన చెందలేదు

మ్యాచ్ అనంతరం హర్‌ప్రీత్ బ్రార్ మాట్లాడుతూ... 'నాది మోగా జిల్లా. అక్కడి ప్రజలు నాకు అండగా నిలుస్తారని, నా ప్రదర్శనకు గర్విస్తారని తెలుసు. విరాట్ కోహ్లీ నా బౌలింగ్‌లో బాదేసినప్పుడు నేను ఆందోళన చెందలేదు. ఎందుకంటే పుంజుకొనేందుకు బౌలర్‌కు రెండో అవకాశం వస్తుంది. ఐపీఎల్‌లో నా తొలి వికెట్‌ కోహ్లీదే కావడం నాకెంతో ప్రత్యేకం. మొదట్లో పరుగులిచ్చినా.. కోహ్లీ భాయ్ వికెట్‌ పడటంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు రెండు ఓవర్లు ఆగాను. రాహుల్‌ భాయ్‌ పరిస్థితుల గురించి వివరిస్తూ ఎలాంటి షాట్లు ఆడొచ్చో సూచించాడు. అలానే షాట్లు ఆడాను. నా ప్రదర్శనపై సంతోషంగా ఉన్నా' అని తెలిపాడు.

IPL 2021: క్రీడా స్ఫూర్తి అంటే ఇదే.. త‌న‌ను ఔట్ చేసిన హ‌ర్‌ప్రీత్‌ భుజం తట్టిన కోహ్లీ! నెటిజన్లు ఫిదా!

భుజం తట్టి ప్రోత్సహించిన కోహ్లీ

భుజం తట్టి ప్రోత్సహించిన కోహ్లీ

ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీయాల‌ని క‌ల‌లు క‌నే బౌల‌ర్ లేడంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటిది త‌న తొలి వికెటే కోహ్లీది అయితే ఆ బౌల‌ర్ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. హ‌ర్‌ప్రీత్ బ్రార్ ఇప్పుడు అదే ఆనందంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో తొలి వికెట్‌గా కోహ్లీని అవుట్‌ చేయడం ద్వారా ఈ మ్యాచ్‌ను మరింత మెమరబుల్‌గా మార్చుకున్నాడు. అయితే కింగ్‌ను ఔట్ చేసిన ఆనందం నుంచి తేరుకోక ముందే సాక్షాత్తూ కోహ్లీయే త‌న‌ను మెచ్చుకోవ‌డం హ‌ర్‌ప్రీత్‌ను మ‌రింత ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత బౌండరీ లైన్‌కి వెలుపల మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో హర్‌ప్రీత్‌ మాట్లాడుతుండగా.. అక్కడికి వెళ్లిన కోహ్లీ అతడిని ప్రత్యేకంగా అభినందించాడు. నవ్వుతూ కరచాలనం చేసి హర్‌ప్రీత్‌ భుజం తట్టి ప్రోత్సహించాడు.

బ్రార్‌ను కొన్నాళ్లుగా సిద్ధం చేస్తున్నాం

బ్రార్‌ను కొన్నాళ్లుగా సిద్ధం చేస్తున్నాం

'మేం హర్‌ప్రీత్‌ బ్రార్‌ను కొన్నాళ్లుగా సిద్ధం చేస్తున్నాం. ఇలాంటి పిచ్‌పై కచ్చితమైన లెంగ్తుల్లో బంతులు విసిరే ఫింగర్‌ స్పిన్నర్‌ మాకు అవసరం. అతడదే పని చేశాడు. బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. నేనూ యువకుడినే. నాకున్న ఐపీఎల్‌, అంతర్జాతీయ అనుభవాన్ని కుర్రాళ్లతో పంచుకుంటాను. వారికెంతో ప్రతిభవుంది. కఠిన పరిస్థితుల్లో, ఒత్తిడిలో ఆడగలుగుతున్నారు. ఆర్‌సీబీపై నాకెలాంటి ఉద్దేశం లేదు. వారితో తలపడినప్పుడల్లా మేం కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితులే ఉంటున్నాయి. జట్టును ముందుండి నడిపించడం నా బాధ్యత. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెట్టాల్సినప్పుడు, వ్యూహాలు చెదరగొట్టేందుకు నేను దూకుడుగా ఆడాల్సి ఉంటుంది' అని పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, May 1, 2021, 14:09 [IST]
Other articles published on May 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X