Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: క్రీడా స్ఫూర్తి అంటే ఇదే.. త‌న‌ను ఔట్ చేసిన హ‌ర్‌ప్రీత్‌ భుజం తట్టిన కోహ్లీ! నెటిజన్లు ఫిదా! (వీడియో

Virat Kohli appreciated Harpreet Brar after PBKS vs RCB match

అహ్మదాబాద్‌: ఒక్క మ్యాచ్‌తో హాట్‌టాపిక్‌గా మారిపోయాడు పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ‌ర్‌ప్రీత్‌ మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. తన స్పిన్ మాయాజాలంతో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(35), స్టార్‌ హిట్టర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ (0), ఏబీ డివిలియర్స్‌ (3)ను 7 బంతుల వ్యవధిలో ఔట్ చేసి పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 17 బంతుల్లో 25 రన్స్ కూడా చేశాడు.

హర్‌ప్రీత్ బ్రార్ వేసిన మొదటి ఓవర్ తొలి బంతినే విరాట్ కోహ్లీ సిక్స్‌గా బాదాడు. దాంతో మళ్లీ 10వ ఓవర్ వరకూ అతని చేతికి పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బంతినిచ్చే సాహసం చేయలేదు. 11వ ఓవర్‌లో హర్‌ప్రీత్ బౌలింగ్‌కి రాగా.. కోహ్లీ క్రీజు వెలుపలికి వెళ్లి మరో సిక్స్ కొట్టబోయాడు. బ్యాట్‌కి అందకుండా బంతిని హర్‌ప్రీత్ టర్న్ చేయడంతో కోహ్లీ క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత బంతికే మాక్స్‌వెల్ కూడా ఔట్ అయ్యాడు. ఈ ఔట్ నుంచి తేరుకోవడానికి మ్యాక్సీకి సమయం పట్టింది. 13వ ఓవర్ మొదటి బంతికే డివిలియర్స్‌ని కూడా ఔట్ చేశాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీయాల‌ని క‌ల‌లు క‌నే బౌల‌ర్ లేడంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటిది త‌న తొలి వికెటే కోహ్లీది అయితే ఆ బౌల‌ర్ ఆనందానికి అవ‌ధులు ఉండ‌వు. హ‌ర్‌ప్రీత్ బ్రార్ ఇప్పుడు అదే ఆనందంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో తొలి వికెట్‌గా కోహ్లీని అవుట్‌ చేయడం ద్వారా ఈ మ్యాచ్‌ను మరింత మెమరబుల్‌గా మార్చుకున్నాడు. అయితే కింగ్‌ను ఔట్ చేసిన ఆనందం నుంచి తేరుకోక ముందే సాక్షాత్తూ కోహ్లీయే త‌న‌ను మెచ్చుకోవ‌డం హ‌ర్‌ప్రీత్‌ను మ‌రింత ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత బౌండరీ లైన్‌కి వెలుపల మరో స్పిన్నర్ రవి బిష్ణోయ్‌తో హర్‌ప్రీత్‌ బ్రార్‌ మాట్లాడుతుండగా.. అక్కడికి వెళ్లిన విరాట్‌ కోహ్లీ అతడిని ప్రత్యేకంగా అభినందించాడు. నవ్వుతూ కరచాలనం చేసి హర్‌ప్రీత్‌ భుజం తట్టి ప్రోత్సహించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. కోహ్లీ గొప్ప క్రీడాస్ఫూర్తి చాటాడు అంటూ నెటిజన్లు ఫిదా అయ్యారు. బ్రార్‌కు ఇది కచ్చితంగా గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం అవుతుందని ట్వీట్లు చేస్తున్నారు.

Story first published: Saturday, May 1, 2021, 13:32 [IST]
Other articles published on May 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+