న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎదురుదెబ్బ.. సెకండాఫ్ మ్యాచ్‌లకు ఆ స్టార్ పేసర్ దూరం!

Pat Cummins To Skip IPL 2021 When It Resumes In UAE
IPL 2021 : Pat Cummins నాట్ కమింగ్.. కారణం ఇదే ! | Kolkata Knight Riders || Oneindia Telugu

సిడ్నీ: ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్ కాకుండా ఆస్ట్రేలియా పర్యటనకు కూడా ఈ స్టార్ పేసర్ దూరంగా ఉండనున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేశాడు. ఇక కుటుంబంతో గడిపేందుకు డేవిడ్ వార్నర్ కూడా ఈ పర్యటన నుంచి తప్పుకున్నాడు.

కోట్ల కాంట్రాక్టు ఉన్నప్పటికీ..

కోట్ల కాంట్రాక్టు ఉన్నప్పటికీ..

అయితే ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌లకు దూరంగా ఉండాలనుకున్నట్లు కమిన్స్ ఇప్పటికే ప్రకటించాడు. 'డేవిడ్ వార్నర్​తో పాటు ప్యాట్​ కమిన్స్​.. వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉండాలనుకున్నారు. మిగిలిన వారు యథావిధిగా మ్యాచ్​ల్లో పాల్గొంటారు. ఐపీఎల్​ 2021 మిగతా లీగ్​లో పాల్గొనని విషయాన్ని కమిన్స్​ ఇప్పటికే వెల్లడించాడు. రూ.15 కోట్ల భారీ కాంట్రాక్టు ఉన్నప్పటికీ ఈ స్టార్ పేసర్.. క్యాచ్ రిచ్ లీగ్ ఆడేందుకు సుముఖంగా లేడు. అందుకు ప్రత్యేక కారణమేమీ లేదు.' అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్​ పత్రికా కథనం ప్రచురించింది.

ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం..

ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం..

అంతకుముందు ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్​ యాష్లే గైల్స్​ కూడా ఐపీఎల్​ కోసం తమ జట్టు ఆటగాళ్ల షెడ్యూళ్లలో మార్పులు చేయబోమని తెలిపారు. టీ20 ప్రపంచకప్​కు ముందు పలు సిరీస్​లు ఆడనుండటం ఇందుకు కారణమని చెప్పారు. సెప్టెంబర్​ నుంచి అక్టోబర్​ మధ్య 25 రోజుల పాటు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్​లను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

కరోనా కారణంగా వాయిదా పడిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

సెప్టెంబర్ 18 నుంచి..

సెప్టెంబర్ 18 నుంచి..

శనివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) అనంతరం బోర్డు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. అయితే సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 12 మధ్య లీగ్‌ జరగవచ్చని బోర్డు వర్గాల సమాచారం. 2021 ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌లు నిర్వహించిన అనంతరం అనూహ్యంగా ఆటగాళ్లకు కరోనా సోకడంతో తప్పనిసరి పరిస్థితుల్లో లీగ్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ప్లే ఆఫ్స్‌ సహా లీగ్‌లో మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.

వచ్చినా రాకున్నా..

వచ్చినా రాకున్నా..

ఎస్‌జీఎంలో విదేశీ ఆటగాళ్ల విషయంపై కూడా చర్చ జరిగింది. అయితే ఎవరు వచ్చినా రాకున్నా, ఏ బోర్డునూ బతిమాలబోమని, మిగిలిన మ్యాచ్‌లను పూర్తి చేయడమే లక్ష్యమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే విండీస్‌ ఆటగాళ్ల కోసం కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని బోర్డు కోరినట్లు అంతర్గత సమాచారం. ఆటగాళ్లు ఎవరైనా అందుబాటులో లేకపోతే వారి స్థానాల్లో మరొకరిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలను బోర్డు అనుమతిస్తుంది.

Story first published: Sunday, May 30, 2021, 17:44 [IST]
Other articles published on May 30, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X