న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2022: ఊకో బాబర్.. మీరు ఫైనల్‌‌ చేరడమే ఎక్కువ! గ్రూప్-1లో ఉంటేనా..?

Pakistan wouldnt have qualified to semifinals in t20 world cup if it was in group 1

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్ రన్నరప్‌గా నిలిచింది.. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై సువర్ణవకాశాన్ని చేజార్చుకుంది. వాస్తవానికి ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ ఆడిన తీరు చూసిన తర్వాత ఆ జట్టు కనీసం సెమీఫైనల్ చేరుతుందని కూడా ఎవరూ ఊహించలేదు.

టీమిండియాతో తొలి మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఓడిన పాకిస్థాన్.. పసికూన జింబాబ్వేతో 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 1 పరుగు తేడాతో ఓటమిపాలైంది. దాంతో పాకిస్థాన్ కథ ముగిసిందని, గ్రూప్ స్టేజ్‌లోనే ఇంటిదారి పడుతుందని అంతా అనుకున్నారు. అద్భుతం జరిగితే తప్పా ఆ జట్టు నాకౌట్ చేరలేదని లెక్కలు గట్టారు.

లక్కీగా సెమీస్ చేరి..

లక్కీగా సెమీస్ చేరి..

పాకిస్థాన్ దురదృష్టమో.. లేక సౌతాఫ్రికా అదృష్టమో తెలియదు కానీ.. తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై గెలిచిన పాక్ అనూహ్యంగా సెమీస్ రేసులోకి వచ్చింది. నెదర్లాండ్స్ చేతుల్లో సౌతాఫ్రికా ఓడిపోవడంతో 6 పాయింట్లతో గ్రూప్-2 రన్నరప్‌గా నాకౌట్ చేరింది. నెదర్లాండ్స్‌పై సౌతాఫ్రికా గెలిస్తే 7 పాయింట్లతో ఆ జట్టు ముందడుగేసిది.

జింబాబ్వేతో వర్షం కారణంగా మ్యాచ్ రద్దవ్వడం సౌతాఫ్రికా పాలిట శాపంగా మారగా.. పాక్‌కు కలిసొచ్చింది. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో కూడా ఆ జట్టుకు లక్ కలిసొచ్చింది. ముందుగా ఫీల్డింగ్ చేయడం.. బౌలింగ్ బలంతో న్యూజిలాండ్‌ను దెబ్బతీసింది. ఆ తర్వాత ఒత్తిడిని పెంచి అద్భుత విజయంతో ఫైనల్ చేరింది.

మెల్ బోర్న్ బౌండరీలకు తగ్గట్లు..

మెల్ బోర్న్ బౌండరీలకు తగ్గట్లు..

దాంతో పాకిస్థాన్ టైటిల్ గెలవడం ఖాయమని ఆ జట్టు ఫ్యాన్స్ అనుకున్నారు. 1992 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా పాక్ ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొందని, హిస్టరీ రిపీట్ అవుతుందని పగటి కలలు కన్నారు. కానీ కీలక ఫైనల్లో ఆ జట్టును అదృష్టం వరించలేదు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్.. ఇంగ్లండ్ బౌలింగ్‌కు చేతులెత్తేసింది.

ముఖ్యంగా మెల్‌బోర్న్ బౌండరీ‌లకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయింది. పిచ్ కూడా సరిగ్గా రీడ్ చేయలేక మూల్యం చెల్లించుకుంది. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్లు తెలివిగా.. బిగ్గర్ బౌండరీల వైపు షాట్లు ఆడేలా బౌలింగ్ చేసి వికెట్లు సాధించారు. చివరి 5 ఓవర్లలో పాక్ రెండు బౌండరీలు మాత్రమే కొట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

స్టోక్స్ పోరాటంతో..

స్టోక్స్ పోరాటంతో..

ఆ తర్వాత బౌలింగ్‌తో గెలిచే ప్రయత్నం చేసినా.. ఇంగ్లండ్ కండిషన్స్‌కు తగ్గట్లు బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా బెన్ స్టోక్స్ పరిస్థితులకు తగ్గట్లు ఆడి జట్టుకు విజయాన్నందించాడు. దాంతో టైటిల్ గెలవాలనే పాక్ కల ఆవిరైంది. అయితే లక్కీగా ఫైనల్‌కు వస్తే ఇలానే ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఊకో బాబర్.. మీరు ఫైనల్ రావడమే గొప్ప అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. మరికొందరు అయితే గ్రూప్-1లో ఉంటే సెమీఫైనల్ కూడా వచ్చేవారు కాదని కామెంట్ చేస్తున్నారు. బౌలింగ్ బలంగా ఉన్నప్పటికీ.. బ్యాటింగ్ లేదని, అదే ఆ జట్టు కొంపముంచిందని అభిప్రాయపడుతున్నారు.

Story first published: Monday, November 14, 2022, 15:48 [IST]
Other articles published on Nov 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X