న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మ వికెట్ తీయడం నా కల: పాక్ యువ పేసర్

Pakistan pacer Naseem Shah Says Picking Rohit Sharma’s wicket would be a dream come true

లండన్: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ తీయడం తన కలని పాకిస్థాన్ యువ పేసర్ నసీమ్ షా తెలిపాడు. 16 ఏళ్ల వయసులోనే టెస్ట్‌ల్లో 5 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించిన నసీమ్.. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ వికెట్ సాధించాడు. ఇక రోహిత్‌ శర్మతో పాటు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్‌లను వరుస బంతుల్లో ఔట్ చేయడం తన డ్రీమ్ హ్యాట్రిక్ అని తెలిపాడు.

ఇక హిట్‌మ్యాన్ రోహిత్ టెస్ట్‌బుక్‌లో ఉన్న షాట్లన్నీ ఆడుతాడని ప్రశంసించిన నసీమ్.. అతని వికెట్ తీస్తే తన కల నేరవేరినట్లేనని చెప్పాడు. 'షార్ట్, గుడ్ లెంగ్త్ అని తేడా లేకుండా అన్ని రకాల బంతులను హిట్ చేయగల సామర్థ్యం రోహిత్‌కు ఉంది. అతని రికార్డులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. అలాంటి బ్యాట్స్‌మన్ ఔట్ చేస్తే నా కల నేరవేరుతుంది.' అని 17 ఏళ్ల నసీమ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Pakistan pacer Naseem Shah Says Picking Rohit Sharma’s wicket would be a dream come true

ఇక నిలకడకు మారుపేరైనా స్టీవ్ స్మిత్ వికెట్ తీయడం తనకు సంతోషాన్నిస్తుందని ఈ టీనేజ్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. స్మిత్ బ్యాటింగ్ చాలా యూనిక్‌గా ఉంటుందన్నాడు.'స్టీవ్ స్మిత్ అసాధారణమైన ఆటగాడు. అతని బ్యాటింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్మిత్ వికెట్ తీయడం చాలా సంతోషాన్నిస్తుంది. గతంలో అతనికి బౌలింగ్ చేసే అవకాశం దక్కింది. స్మిత్ వికెట్ తీస్తే మంచి అనుభవం దక్కుతుంది.'అని నసీమ్ చెప్పుకొచ్చాడు.

ఇక రోహిత్, స్మిత్ వికెట్ తీయాలని నసీమ్ అనుకుంటున్నా ఇప్పట్లో భారత్-పాక్, ఆస్ట్రేలియా-పాక్ టెస్ట్ సిరీస్‌ల్లేవు. కానీ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అతను ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే మూడు టెస్ట్‌ల సిరీస్‌లో జో రూట్‌ను ఔట్ చేసే అవకాశం ఉంది. పాకిస్థాన్ తరఫున 4 టెస్టులు ఆడిన నసీమ్.. 13 వికెట్లు తీసాడు. అతని బెస్ట్ బౌలింగ్ 5/31 ఉండటం విశేషం.

ఆ కారణంతోనే ఆర్చర్‌పై వేటు.. మతిలేని పనంటూ ఈసీబీ ఫైర్!ఆ కారణంతోనే ఆర్చర్‌పై వేటు.. మతిలేని పనంటూ ఈసీబీ ఫైర్!

Story first published: Friday, July 17, 2020, 14:52 [IST]
Other articles published on Jul 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X