న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs NZ: బంతితో అంపైర్‌ను కొట్టిన పాక్ ఫీల్డర్.. ముసి ముసి నవ్విన బాబర్! (వీడియో)

 PAK vs NZ: Babar Azam Cant Stop Laughing after Mohammad Wasim Jr’s throw hits umpire Aleem Dar

కరాచీ: పాకిస్థాన్-న్యూజిలాండ్ రెండో వన్డేలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాకిస్థాన్ ఫీల్డర్ విసిరిన త్రో నేరుగా ప్రధాన అంపైర్ కాలికి తాకింది. నొప్పితో విలవిలలాడిన అంపైర్ తన చేతిలో ఉన్న ప్లేయర్ స్వెటర్‌ను నేలకు కొట్టి తన అసహనాన్ని వెల్లగక్కాడు. ఈ ఊహించని ఘటనతో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ముసి ముసి నవ్వగా.. కామెంటర్లు సైతం పగలబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 36వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హరీస్ రౌఫ్ వేసిన ఈ ఓవర్‌లో కివీస్ బ్యాటర్ గ్లేన్ ఫిలిప్స్ స్వ్కేర్ లెగ్ దిశగా ఆడాడు. ఇక బంతిని అందుకున్న పాక్ ఫీల్డర్ మహమ్మద్ వాసిమ్ జూనియర్ నాన్ స్ట్రైకర్ స్టంప్స్ వైపు బంతిని విసిరాడు. కానీ ఆ బంతి కాస్త నేరుగా ఫీల్డ్ అంపైర్ అలీందార్ యాంకిల్‌ను బలంగా తాకింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అలీందార్ చేతిలో ఉన్న బౌలర్ స్వెటర్‌ను నేలకు కొట్టాడు. పక్కనే ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ముసి ముసి నవ్వడం కెమెరాల్లో రికార్డు అయ్యింది. మరో పాక్ ప్లేయర్ అంపైర్ మడిమను గట్టిగా రాస్తూ.. నొప్పి నుంచి ఉపశమనం కలిగే ప్రయత్నం చేశాడు.

ఈ ఘటనపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. అంపైర్‌పై ఉన్న కోపాన్ని పాక్ ఆటగాళ్లు ఇలా తీర్చుకున్నారని ఒకరంటే.. ప్లాన్ ప్రకారమే అంపైర్‌ను గాయపర్చారని మరొకరు కామెంట్ చేశారు. అంపైర్ తలకు కొడితే మ్యాచే ఆగిపోయేదని మరొకరు సెటైర్లు పేల్చారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 49.5 ఓవర్లలో 261 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(92 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్(100 బంతుల్లో 10 ఫోర్లతో 85) శతకాన్ని అందుకోలేకపోయాడు. పాక్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్ నాలుగు వికెట్లు తీయగా.. నసీమ్ షా మూడు వికెట్లు పడగొట్టాడు. హరీస్ రౌఫ్, ఉస్మాన్ మిర్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 142 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులో కెప్టెన్ బాబర్ ఆజామ్(63 బ్యాటింగ్) టెయిలండర్లతో కలిసి పోరాడుతున్నాడు.

Story first published: Wednesday, January 11, 2023, 22:21 [IST]
Other articles published on Jan 11, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X