న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs ENG: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ అరంగేట్ర బౌలర్ రెహాన్ అహ్మద్!

PAK vs ENG: Record haul for 18-year-old Rehan Ahmed on Test debut in 3rd test against Pakistan

కరాచీ: ఇంగ్లండ్ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనతను అందుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో రెహాన్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెహాన్ అహ్మద్.. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 14.5 ఓవర్లలో 48 పరుగులిచ్చి 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. 18 ఏళ్ల 126 రోజుల వయసుతో ఈ ఫీట్ సాధించిన రెహాన్.. ఆస్ట్రేలియా టెస్ట్‌ కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ రికార్డును అధిగమించాడు.

కమిన్స్ రికార్డు బద్దలు..

కమిన్స్ రికార్డు బద్దలు..

కమిన్స్‌ 18 ఏళ్ల 196 రోజుల వయసులో టెస్ట్‌ల్లో (అరంగేట్రం మ్యాచ్‌) 5 వికెట్ల ఘనత సాధించాడు. తాజాగా రెహాన్‌.. చాలాకలంగా పదిలంగా ఉండిన కమిన్స్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఇదే మ్యాచ్‌లో రెహాన్‌ ఈ రికార్డుతో పాటు మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌ తరఫున అత్యంత పిన్న వయసులో టెస్ట్‌ అరంగేట్రం చేసిన ఆటగాడిగా రెహాన్‌ చరిత్ర సృష్టించాడు. రెహాన్‌కు ముందు ఈ రికార్డు బ్రియాన్‌ క్లోజ్‌ పేరిట ఉండేది. క్లోజ్‌.. 1949లో 18 ఏళ్ల 149 రోజుల వయసులో టెస్ట్‌ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెగ్‌ స్పిన్‌ బౌలర్‌ అయిన రెహాన్‌ పాకిస్థాన్‌ సంతతికి చెందిన వాడు.

సొంత దేశంపైనే..

సొంత దేశంపైనే..

రెహాన్‌ తండ్రి నయీమ్‌ అహ్మద్‌ పాకిస్థాన్‌లో జన్మించి, ఇంగ్లండ్‌కు వలస వెళ్లాడు. రెహాన్‌, అతని సోదరులు ఫర్హాన్‌, రహీమ్‌లు కూడా క్రికెటర్లే కావడం విశేషం. ఇంగ్లండ్‌ జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న రెహాన్‌.. తన తండ్రి పుట్టిన దేశంపైనే విశ్వరూపం ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జనవరిలోనే అండర్ 19 ప్రపంచకప్ ఆడిన రెహాన్ అహ్మద్.. 10 నెలల వ్యవధిలోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన పెర్ఫామెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

విజయం దిశగా ఇంగ్లండ్..

విజయం దిశగా ఇంగ్లండ్..

మూడు టెస్ట్‌ల సిరీస్‌ను ఇప్పటికే 2-0తో కైవసం చేసుకున్న ఇంగ్లండ్.. క్లీన్ స్వీప్‌కు 55 పరుగుల దూరంలో నిలిచింది. కరాచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లోనూ ఇంగ్లండ్.. విజయం దిశగా దూసుకెళ్తోంది. 167 పరుగుల స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన బ్రిటీష్ టీమ్.. మూడో రోజు ఆటముగిసే సమయానికి 17 ఓవర్లలో 112 పరుగులు చేసింది. టెస్ట్ ఫార్మాట్‌లో టీ20 తరహా బ్యాటింగ్‌తో చెలరేగుతోంది.

బెంబేలెత్తిస్తున్న బెన్ డక్కెట్

బెంబేలెత్తిస్తున్న బెన్ డక్కెట్

రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్లపై విరుచుకుపడిన ఇంగ్లండ్ బ్యాటర్లు కేవలం 5.4 ఓవర్లలోనే 50 పరుగులు .. 13.4 ఓవర్లలోనే సెంచరీ మార్క్ అందుకున్నారు. ఆ జట్టు ఓపెనర్ బెన్ డక్కెట్(38 బంతుల్లో 8 ఫోర్లతో 50 బ్యాటింగ్) అజేయ హాఫ్ సెంచరీ బాదగా.. జాక్ క్రాలీ(41 బంతుల్లో 7 ఫోర్లతో 41) ధాటిగా ఆడాడు. క్రీజులోకి నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన రెహాన్ అహ్మద్, జాక్‌క్రాలీలను అబ్రర్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులో బెన్ డక్కెట్‌తో పాటు కెప్టెన్ బెన్ స్టోక్స్(10 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Monday, December 19, 2022, 22:28 [IST]
Other articles published on Dec 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X