న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs ENG: టెస్ట్‌ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 112 ఏళ్ల రికార్డు బద్దలు!

 PAK vs ENG: England breaks 112-year-old cricket record after slam 506 runs on Day 1 in Rawalpindi

హైదరాబాద్: టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 112 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించింది. బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత బజ్ బాల్ కాన్సెప్ట్‌తో దుమ్మురేపుతోంది. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ తొలి అడుగును చాలా బలంగా వేసింది. పాకిస్థాన్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా రావల్సిండి వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు రెచ్చిపోయారు. ధనాధన్ ఫార్మాట్ తరహాలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు.

ఓపెనర్లు జాక్ క్రాలీ(111 బంతుల్లో 21 ఫోర్లతో 122), బెన్ డక్కెట్(110 బంతుల్లో 15 ఫోర్లతో 107) సెంచరీతో చెలరేగగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఓలీ పాప్(104 బంతుల్లో 14 ఫోర్లతో 108), హరీ బ్రూక్(81 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 బ్యాటింగ్) సైతం శతకాలు నమోదు చేశారు. టాప్-5 బ్యాటర్లలో నలుగురు సెంచరీలు నమోదు చేయడంతో ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 75 ఓవర్లలో 4 వికెట్లకు 506 పరుగుల భారీ స్కోర్ చేసి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు ఆటలో 500 ప్లస్ పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో ఇంగ్లండ్ 112 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 1910లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి రోజు ఆటలో 494 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉండగా.. ఇంగ్లండ్ తాజాగా అధిగమించింది.

తొలి రోజు ఆటలో నమోదైన టాప్ స్కోర్లు..

ఇంగ్లండ్ X పాకిస్థాన్ (2022) - 506 పరుగులు
ఆస్ట్రేలియా X సౌతాఫ్రికా (1910) - 494
ఆస్ట్రేలియా X సౌతాఫ్రికా (2012) - 482
ఇంగ్లండ్ X ఆస్ట్రేలియా (1934) - 475
ఇంగ్లండ్ X ఇండియా (1936) - 471

టాప్-5 బ్యాటర్లలో జోరూట్(23) ఒక్కడే విఫలమవ్వగా.. ఇంగ్లండ్ బ్యాటర్ల జోరు ముందు పాక్ బౌలర్లు తేలిపోయారు. ఏ సెషన్‌లోనూ ప్రభావం చూపలేకపోయారు. జాహిద్ మహమూద్ రెండు వికెట్లు తీయగా.. హారీస్ రౌఫ్, మహమ్మద్ అలీ తలో వికెట్ తీసారు. క్రీజులో సెంచరీ హీరో హారీ బ్రూక్‌తో పాటు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్(34 బ్యాటింగ్) ఉన్నాడు. రెండో రోజు ఫస్ట్ సెషన్‌లో వేగంగా ఆడి ఇంగ్లండ్ డిక్లెర్ చేసే అవకాశం ఉంది. పూర్తిగా బ్యాటింగ్‌కు సహకరిస్తున్న ఈ పిచ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిస్సారమైన పిచ్‌ను నిషేధించాలని, డీమెరిట్ పాయింట్లు కేటాయించాలని ఐసీసీకి ఫిర్యాదు చేస్తున్నారు.

Story first published: Thursday, December 1, 2022, 21:10 [IST]
Other articles published on Dec 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X