న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిగతా బౌలర్లు పచ్చళ్లు అమ్మడానికి వచ్చారా? పాక్ పేలవ బౌలింగ్‌పై మాజీ క్రికెటర్ ఫైర్!

 PAK vs ENG: Danish Kaneria says Babar Azam Should Learn From Ben Stokes’ Captaincy

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)పై ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో పాక్ మేనేజ్‌మెంట్ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టాడు. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్ట్‌ల సిరీస్‌ను పాకిస్థాన్ ఓటమితో ప్రారంభించిన విషయం తెలిసిందే. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో బాబర్ సేన 74 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. అయితే గాయంతో జట్టుకు దూరమైన షాహిన్ షా అఫ్రిది ఈ మ్యాచ్‌లో ఉంటే ఫలితం మరోలా ఉండేదని, పాక్ క్రికెట్ పెద్దలు చేసిన వ్యాఖ్యలను డానిష్ కనేరియా తప్పుబట్టాడు. మిగతా బౌలర్లు పచ్చల అమ్మడానికి జట్టులో ఉన్నారా? అని ప్రశ్నించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా పీసీబీపై విమర్శలు గుప్పించాడు.

 పచ్చళ్లు అమ్ముకుంటారా?

పచ్చళ్లు అమ్ముకుంటారా?

'ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఓడిన తర్వాత పాక్ మేనేజ్‌మెంట్ నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయో అందరికీ తెలుసు. ఇంగ్లండ్ బాగా ఆడింది. వాళ్ల నుంచి నేర్చుకుంటాం. తప్పులను సరిదిద్దుకుంటామని చెబుతారు. అయితే చేతల్లో మాత్రం అది కనిపించదు. చాలా ఏళ్లుగా ఇదే చెబుతున్నారు. కానీ నేర్చుకోవడం పాక్ జట్టుకు చేతకాదు. షాహీన్ ఆఫ్రిదీ ఉండి ఉంటే గెలిచేవాళ్లమని అంటారు. అవును, అతను అందుబాటులో లేడు. మరి మిగిలిన బౌలర్లు ఏం చేస్తున్నారు. వాళ్లు పచ్చళ్లు అమ్ముకోవడానికి టీమ్‌లోకి వచ్చారా?

ఇంగ్లండ్ సూపర్ ప్లాన్‌తో..

ఇంగ్లండ్ సూపర్ ప్లాన్‌తో..

ఇంగ్లండ్ జట్టు పక్కా ప్రణాళికతో గెలవడానికి ఏం చేయాలో బాగా తెలుసుకుని వచ్చింది. ప్రణాళిక తగ్గట్లు ఆడి గెలిచింది. కానీ పాక్‌ అలా కాదు. ఓడిపోతామనే భయంతో ఇలాంటి చెత్త పిచ్ తయారుచేశారు. సొంత పిచ్‌పై వికెట్లు తీయలేకపోయారు. ఓ ప్లానింగ్ లేదు, ఓ స్ట్రాటెజీ కనిపించలేదు. ఏ టైమ్‌లో ఏ బౌలర్‌ని వాడాలో కూడా తెలీదు. రివర్స్ స్వింగ్ బౌలర్లు ఎక్కడా? పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు మళ్లీ ప్రాణం వచ్చిందనే విషయం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఎన్ని రోజులని ఈ మాటలు చెబుతూ అసలు ఆటను పక్కనబెడతారు.

బాబార్ ఆజామ్ నేర్చుకోవాలి..

బాబార్ ఆజామ్ నేర్చుకోవాలి..

బెన్ స్టోక్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత బాబర్ ఆజమ్ షాక్ తగిలినట్టు చూస్తూ ఉండిపోయాడు. ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు. బెన్ స్టోక్స్ కెప్టెన్సీ నుంచి బాబర్ ఎంతో నేర్చుకోవాలి. బ్రెండన్ మెక్‌కల్లమ్ జట్టును నడుపుతున్న విధానం నుంచి పాక్ కోచ్‌లు చాలా తెలుసుకోవాలి. మన మేనేజ్‌మెంట్‌కు భయం ఎక్కువ. అందుకే ఇలాంటి చెత్త పిచ్‌లు తయారుచేశారు. పిచ్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తున్నప్పుడు ఏ బ్యాటర్ అయినా సెంచరీలు కొడతారు. కానీ పాక్ పెద్దలు మాత్రం మనవాళ్లు బాగా ఆడారని భుజాలు చరుచుకుంటున్నారు. మనం నెం.1 టీమ్‌గా ఉన్నామా?

 పాక్ ఆడకపోతే ఆసియా కప్ ఆగుతుందా?

పాక్ ఆడకపోతే ఆసియా కప్ ఆగుతుందా?

మన దేశ క్రికెట్ ఎటువైపు వెళ్తుందో కూడా వాళ్లకి అర్థం కావడం లేదు. పాక్‌లో నిర్వహించకపోతే ఆసియా కప్ 2023 ఆడబోమని రమీజ్ రాజా చెప్పాడు. మనం లేకపోతే ఆసియా కప్ ఆగిపోతుందా? వరల్డ్ కప్‌ను జనాలు చూడడం మానేస్తారా? ఇలాంటి పిచ్‌లు తయారుచేస్తే, ఎవరు మాత్రం పాక్‌లో ఆడడానికి ఇష్టపడతారు?'అని కనేరియా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, December 7, 2022, 18:42 [IST]
Other articles published on Dec 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X