న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs ENG: బజ్‌బాల్ లేదు.. గిజ్‌బాల్‌ లేదు.. అదరగొట్టిన అబ్రర్.. ఇంగ్లండ్ బేజార్!

 PAK vs ENG: Abrar Ahmed removes Ben Stokes & Will Jacks to get 7-Wicket haul on debut

ముల్తాన్: బజ్‌బాల్ కాన్సెప్ట్‌తో టెస్ట్ క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ఇంగ్లండ్‌కు పాకిస్థాన్ యువ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ కళ్లెం వేసాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనతను అందుకున్న అబ్రర్.. ఇంగ్లండ్ బ్యాటింగ్ నడ్డి విరిచాడు. మూడు టెస్ట్‌ల సిరీ‌లో భాగంగా ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్.. అబ్రర్(7/114) ధాాటికి తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు కుప్పకూలింది. కనీసం రెండు సెషన్లు పూర్తిగా ఆడలేకపోయింది. అబ్రర్‌కు తోడుగా జాహిద్ మహమూద్ మూడు వికెట్లు తీసాడు.

శుక్రవారమే ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ తొలి సెషన్‌లోనే ఐదు వికెట్లు కోల్పోయింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఫ్లాట్ వికెట్‌పై దుమ్మురేపిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. బౌలింగ్‌కు అనుకూలించే ముల్లాన్ వికెట్‌పై చేతులెత్తేసారు. ఔటాఫ్ సిలబస్‌గా వచ్చిన యువ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ బౌలింగ్‌ను ఆడలేక వరుసగా పెవిలియన్ చేరారు.


గత మ్యాచ్‌లో సెంచరీలు బాదిన జాక్ క్రాలీ(19), హారీ బ్రూక్(9) దారుణంగా విఫలమవగా.. బెన్ డక్కెట్(63), ఓలీ పోప్(60) హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే అబ్రర్ ధాటికి వీళ్లు కూడా క్రీజులో నిలవలేకపోయారు. జోరూట్(8) కూడా తన వైఫల్యాన్ని కొనసాగించడంతో ఇంగ్లండ్.. 33 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగుల వద్ద లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రెండో సెషన్‌లో కూడా అబ్రర్ అదరగొట్టడంతో కెప్టెన్ బెన్ స్టోక్స్(30), విల్ జాక్స్(31) పెవిలియన్ బాట పట్టారు. అనంతరం జాహిద్ మహమూద్.. ఓలీ రాబిన్సన్(5), జాక్ లీచ్(0), జేమ్స్ అండర్సన్(7)లను పెవిలియన్ చేర్చి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. మార్క్ వుడ్(36 నాటౌట్) పోరాడినా మరో ఎండ్‌లో అతనికి సహకారం లభించలేదు.

రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో మొదటి రోజే 506 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నమోదు చేసిన ఇంగ్లండ్.. 74 పరుగులతో ఘన విజయాన్నందుకుంది. అయితే రెండో టెస్ట్‌లో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది. అబ్రర్‌ను ఆడలేక తెగ ఇబ్బంది పడుతోంది. ఇక ఇంగ్లండ్ జట్టుపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. అసలు సిసలు పిచ్, బౌలర్లు ఉంటే బజ్ బాల్.. గిజ్ బాల్ పనికిరావని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Friday, December 9, 2022, 15:43 [IST]
Other articles published on Dec 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X