న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs AUS: కేక్ పెట్టలేదు.. అందుకే క్యాచ్ పట్టలేదు! జాతిరత్నాలు డైలాగ్‌‌తో హసన్ అలీపై పేలుతున్న సెటైర్లు!

PAK vs AUS: Jathi Ratnalu Reference For Hasan Ali, Check Out The Hilarious Trolls And Memes Here

దుబాయ్: ఆస్ట్రేలియా అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని.. పాకిస్థాన్ మైండ్ బ్లాంక్ చేస్తూ టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గెలుపు ఖాయం అనుకున్న సమయంలో పట్టు విడిచి మాథ్యూ వేడ్ ఇచ్చిన కీలక క్యాచ్ చేజార్చిన పాక్ ఇంటిదారిపట్టింది. అచ్చం న్యూజిలాండ్-ఇంగ్లండ్ సెమీస్‌ను తలపిస్తూ సాగిన పోరులో కివీస్ మాదిరిగానే ఆసీస్ మయా చేసింది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) విరోచిత బ్యాటింగ్‌తో ఆసీస్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. అయితే వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసిన హసన్ అలీపై తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా భారత అభిమానులు వేడ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

జాతిరత్నాలు డైలాగ్‌తో..

సెమీఫైనల్‌కు ముందు గ్రూప్-1లో స్కాట్లాండ్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో పాకిస్థాన్ 72 పరుగుల భారీ తేడాతో విజయాన్నందుకుంది. ఈ గెలుపును పాక్ ఆటగాళ్లంతా హోటల్లో సెలెబ్రేట్ చేసుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికొకరికి తినిపించుకున్నారు. ఈ వీడియో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ట్విటర్ వేదికగా అభిమానులతో కూడా పంచుకుంది. అయితే ఈ సెలెబ్రేషన్‌లో హసన్ అలీకి షాదాబ్ ఖాన్ కేక్ తినిపిస్తుండగా.. షాహిన్ అఫ్రిది అతనికి రుద్దుతున్నాడు. దాంతో హసన్ అలీ నోటికాడికి వచ్చిన కేక్ కిందపడిపోయింది. ఈ సీన్స్‌ను ఎడిట్ చేసిన ఫ్యాన్స్.. జాతి రత్నాలు సినిమాల్లో డైలాగ్‌తో పోల్చుతూ సెటైర్లు పేల్చుతున్నారు. 'కేక్ పెట్టలేదు.. అందుకే క్యాచ్ పట్టలేదు'అని హసన్ అలీ చెబుతున్నట్లు ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

గేమ్ చేంజర్ అంటూ..

వాస్తవానికి ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో 17వ ఓవర్‌ వరకు పాకిస్థాన్ ఆధిపత్యం చెలాయించింది. కానీ 18వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన హసన్ అలీ మూమెంటమ్‌ను ఆస్ట్రేలియా వైపు మళ్లించాడు. ఇక్క బాబర్ అతనికి బంతినిచ్చి తప్పు చేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చివరి మూడు ఓవర్లలో ఆసీస్ విజయానికి 37 పరుగులు అవసరం. బంతికి రెండు పరుగులు చేయాలి. భీకరమైన పాక్ పేస్‌ బౌలింగ్‌లో ఆసీస్ ఈ పరుగులు చేయడం కష్టమని భావించారంతా. కానీ హసన్ అలీ వారి పనిని సులువు చేశాడు. అతను వేసిన 18వ ఓవర్‌లో తొలి బంతి సింగిల్ తీయగా.. ఆ మరుసటి బంతికి వేడ్ క్విక్ డబుల్ తీసాడు. అనంతరం వేడ్ ఓ భారీ సిక్సర్ బాది టచ్‌లోకి రాగా.. ఆఖరి బంతికి బౌండరీ బాది జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. ఇక షాహిన్ అఫ్రిది వేసిన 19వ ఓవర్‌లో మూడో బంతికి వేడి ఇచ్చిన క్యాచ్ నేలపాలు చేసి జట్టుకు తీరని నష్టం చేశాడు. ఆ తర్వాతి మూడు బంతులను సిక్సర్లుగా మలిచిన వేడ్ ఘన విజయాన్నందించాడు. దాంతో గేమ్ చేంజర్ హసన్ అలీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

చేతికాడికి వచ్చిన కప్‌ను..

అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు బాది విజయాన్నందించిన హసన్ అలీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కానీ కీలక సెమీఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమై జీరోగా మిగిలాడు. పాకిస్థాన్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. చేతులకు వచ్చిన టీ20 ప్రపంచకప్‌ను నేలపాలు చేశాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. తన చెత్త ప్రదర్శనతో పాకిస్థాన్ కొంపముంచాడని, సునాయసంగా గెలిచే మ్యాచ్‌లో హసన్ అలీ చేసిన ఘోర తప్పిదం టీమ్ పతనాన్ని శాసించిందని మండిపడుతున్నారు.

ఆసీస్ అద్భుత విజయం..

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్‌లకు అండగా డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.

Story first published: Friday, November 12, 2021, 13:40 [IST]
Other articles published on Nov 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X