న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంచు దుప్పటిలో ఒవల్ మైదానం.. కనువిందు చేస్తున్న ప్రకృతి సోయగం! ( వీడియో వైరల్)

Oval cricket stadium turns snow white goes viral

లండన్: ఇంగ్లండ్‌లోని ఒవల్ క్రికెట్ మైదానాన్ని మంచు కప్పేసింది. మంచు దుప్పటిలో ఒవల్ మైదానం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ పకృతి సోయగం అందర్నీ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లకు వేదికైన ఓవల్ మైదానం ఇలా మంచు దుప్పటిలో సేద తీరుతుండటంపై అభిమానులు సరాదాగా స్పందిస్తున్నారు. ఓవల్ మైదానం హిమాలయాలను తలపిస్తుందని, అసలు ఇది క్రికెట్ గ్రౌండ్ ఎవ్వరూ అనరని కామెంట్ చేస్తున్నారు.


1845లో నిర్మించిన ఈ స్టేడియం‌ కెపాసిటీ 23,500. అత్యంత అందమైన క్రికెట్ స్టేడియంగా దీనికి పేరుంది. అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన రెండో మైదానంగా ఓవల్ గుర్తింపు పొందింది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ ఓవల్ మైదానం వేదికగా ఓ టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్ ఆడనుంది.

ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్.. మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే గెలుచుకుంది. దాంతో 22 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన జట్టుగా స్టోక్స్ సేన గుర్తింపు పొందింది. సోమవారం ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై గెలుపొందింది.


355 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్థాన్ 328 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్(4/65) నాలుగు వికెట్లతో చెలరేగడంతో పాకిస్థాన్ లక్ష్యానికి 27 పరుగుల దూరంలో నిలిచిపోయింది. మహమ్మద్ నవాజ్(62 బంతుల్లో 7 ఫోర్లతో 45)‌తో కలిసి సౌద్ షకీల్ చేసిన పోరాటం వృథా అయ్యింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 21 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయాన్నందుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 281 పరుగులకు ఆలౌటవ్వగా.. పాకిస్థాన్ 202 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 275 పరుగులు చేసిన ఇంగ్లండ్.. పాకిస్థాన్‌ను 328 పరుగులకు ఆలౌట్ చేసి విజయాన్నందుకుంది.

క్రిస్‌మస్‌కు ముందే యూకేలో వాతావరణం చల్లగా మారింది. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో మైదానాలు, రోడ్లన్నీ మంచు దుప్పటిలో సేద తీరుతున్నాయి. ముఖ్యంగా సోమవారం మంచు వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లను మూసివేసారు. రోడ్లపైకి ఎవరూ రావద్దని కూడా హెచ్చరించారు. ఈ మంచు వర్షం కారణంగా ముగ్గురు చిన్నారులు మరణించారని బ్రిటన్ మీడియా పేర్కొంది. లండన్‌లోని వాతావరణం -15 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోయింది. ఈ ఏడాదిలో అత్యంత చల్లని రాత్రి ఇదేనని అక్కడి వాతావరణ శాఖ ప్రకటించింది.

Story first published: Tuesday, December 13, 2022, 9:02 [IST]
Other articles published on Dec 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X