న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖ తీరానా ధోనీ సృష్టించిన ఆ విధ్వంసం గుర్తుందా?

On this day MS Dhoni’s maiden international hundred

హైదరాబాద్: సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే రోజు (2005, ఏప్రిల్ 5) విశాఖ తీరానా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ విధ్వంసం సృష్టించాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ క్షణమే ధోనీ అనే పేరు యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలిసింది.

పొడువాటి జుంపాలతో వినూత్నంగా కనిపించిన ధోనీ.. ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలితో తన సత్తా చాటాడు. అప్పటికే మూడుసార్లు వచ్చిన అవకాశాలను చేజార్చుకున్న మహీ.. తప్పక ఆడాల్సిన మ్యాచ్‌లో చెలరేగాడు.

పాకిస్థాన్‌పై విధ్వంసం..

పాకిస్థాన్‌పై విధ్వంసం..

అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేసిన ధోనీ.. ఆ మ్యాచ్‌లో అనవసర పరుగుకు ప్రయత్నించి డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం జరిగిన మూడు వన్డేల్లో 12, 7 నాటౌట్, 3 పరుగులే చేశాడు. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోనీ.. విశాఖ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం అనూహ్యంగా ఫస్ట్ డౌన్‌లో వచ్చాడు.

అనూహ్యంగా ఫస్ట్ డౌన్‌లో..

అనూహ్యంగా ఫస్ట్ డౌన్‌లో..

ఈ మ్యాచ్ నాలుగో ఓవర్లోనే లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఔటవ్వడంతో... క్రీజులోకి వచ్చిన ధోనీ.. సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆసాధారణ రీతిలో బ్యాటింగ్‌ చేసిన ఈ జార్ఖండ్ డైనమైట్.. నాటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో నాలుగో వికెట్‌కు 96 పరుగులు.. రాహుల్ ద్రవిడ్‌తో 149 రన్స్ జోడించాడు.

123 బంతులు ఆడిన ధోనీ.. 15 ఫోర్లు 4 సిక్స్‌లతో 148 పరుగుల చేశాడు. నాటి పాక్ దిగ్గజ బౌలర్లు మహ్మద్ సమీ, నవీద్ ఉల్ హసన్, షాహిద్ అఫ్రిదీ, మహ్మద్ హఫీజ్ బౌలింగ్‌ను చీల్చి చిండాడాడు. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 356 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 298 పరుగులకు ఆలౌటైంది. నెహ్రా 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ సెంచరీతో ధోనీ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.

వామ్మో ఈ పిల్ల వల్ల.. నా ఉద్యోగానికే ఎసరొచ్చేలా ఉంది!!

శ్రీలంకపై సూపర్ సెంచరీ..

శ్రీలంకపై సూపర్ సెంచరీ..

ఈ అద్భత సెంచరీతో ఆస్ట్రేలియా దిగ్గజ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 172,154 తర్వాత ధోనీ నిలిచాడు. అయితే ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ 183 నాటౌట్‌తో గిల్ క్రిస్ట్‌ను అధిగమించాడు. మొత్తం తన వన్డే కెరీర్‌లో మొత్తం 9 సార్లు మూడంకెల స్కోర్ చేసిన ధోనీ.. 50.57 సగటుతో 73 హాఫ్ సెంచరీలతో 10773 పరుగులు చేశాడు. శ్రీలంకపై చేసిన 183 నాటౌట్ తన వ్యక్తిగత అత్యధిక స్కోర్.

Story first published: Sunday, April 5, 2020, 16:26 [IST]
Other articles published on Apr 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X