న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వామ్మో ఈ పిల్ల వల్ల.. నా ఉద్యోగానికే ఎసరొచ్చేలా ఉంది!!

Ziva turns makeup artist for MS Dhoni

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గారాల పట్టి జీవా ధోనీ చేసిన పనికి అతని మేకప్ ఆర్టిస్ట్ గారాల పట్టీ తెగ భయపడిపోతుంది. తన ఉద్యోగం ఎక్కడ పోతుందోనని కలవరపడుతుంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేసింది

ఇంతకీ సంగతేంటంటే.. ధోనీ తనయ జీవా తన తండ్రికి మేకప్ చేసింది. తన చిట్టిపొట్టి చేతులతో తండ్రికి మెరుగులు దిద్దింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను సప్న భవ్నానీ షేర్ చేస్తూ.. 'అందరికీ ముద్దొచ్చే మేకప్‌ ఇది. దీంతో నా ఉద్యోగానికి (మేకప్‌ ఆర్టిస్ట్‌) త్వరలోనే ఎసరొచ్చేలా ఉంది! మహీ... మిస్‌ యూ దోస్త్‌'అని క్యాప్షన్‌గా పేర్కొంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాకున్నా.. అభిమానులను అలరిస్తోంది.

ఇక ధోనీ ఆటకోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న అతని అభిమానులకు ఈ తరహా వీడియోలు కొంచెం ఊరటనిస్తున్నాయి. ఇక క్రికెట్‌కు దూరమైన ధోనీ అతని గారాల తనయ జీవాతో తను తీర్చుకునే అచ్చట, ముచ్చట సామాజిక మాధ్య మాల్లో ఎప్పటికప్పుడు పంచుకుంటాడు. అతను షేర్ చేయకపోయినా.. ఈ జార్ఖండ్ డైనమైట్ సతీమణి సాక్షిసింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

గత ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌ తర్వాత మాజీ కెప్టెన్‌ మహి మళ్లీ బరిలోకి దిగలేదు. సుమారు 8 నెలల పాటు ఆటకు దూరమైన ఈ జార్ఖండ్ డైనమైట్ ఐపీఎల్ రీఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. తద్వారా భారత జట్టులో చోటుదక్కించుకోవాలని భావించాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌ను బీసీసీఐ ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో టోర్నీ నిర్వహణపై ఎటుతేల్చుకోలేకపోతుంది. దీంతో ధోనీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

మరోవైపు భారత జట్టులో రీ ఎంట్రీ కోసం ధోనీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని అతని సన్నిహితుడొకరు మీడియాకు తెలిపారు. ఇప్పటికే తానే అత్యత్తమ, వేగవంతమైన కీపర్‌నని ధోనీ పీలవుతున్నాడని తెలిపాడు. ఎన్నడూ లేని విధంగా శ్రమిస్తున్నాడని పేర్కొన్నాడు.

ఏదో ఒక రోజు టీమిండియా కెప్టెన్ అవుతా : శ్రేయస్ఏదో ఒక రోజు టీమిండియా కెప్టెన్ అవుతా : శ్రేయస్

Story first published: Sunday, April 5, 2020, 11:22 [IST]
Other articles published on Apr 5, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X