న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ వ్యూహం.. పాండ్యా సూపర్ బౌలింగ్.. ఆ ఒక్క పరుగు విజయం గుర్తుందా?

On This Day Hardik Pandya, MS Dhoni Give India Last-ball Win Over Bangladesh

హైదరాబాద్: సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు(మార్చి 23, 2016) భారత క్రికెట్ చరిత్రలోనే మహాద్భుతం జరిగింది. ఉత్కంఠకే ఊపిరి అందని క్షణాన... దాదాపు ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడిన భారత్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. చివరి బంతి వరకు మునివేళ్లపై నిలబెట్టిన ఈ మ్యాచ్‌లో ధోనీసేన ఒక్క పరుగుతో విజయం సాధించింది. ధోనీ వ్యూహం.. పాండ్యా సూపర్ బౌలింగ్‌తో ఫ్యాన్స్‌కు కావాల్సిన మజా లభించింది.

ఇంతకీ ఆ మ్యాచ్ ఏంటంటే..

ఇంతకీ ఆ మ్యాచ్ ఏంటంటే..

2016 టీ20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో తప్పక గెలవాల్సిన చావోరేవో మ్యాచ్. భారత్ వేదికగా జరిగిన ఈ మెగాటోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లోనే భారత్ ఓడింది. దీంతో కప్ రేసులో నిలవడానికి మిగతా మూడు లీగ్ మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. అనంతరం రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్‌‌ను చిత్తు చేసి బంగ్లాతో మ్యాచ్‌కు సిద్ధమైంది. 2007 వన్డే ప్రపంచకప్‌లోనే బంగ్లాను తక్కువ అంచనా వేసి చేతులు కాల్చుకున్న భారత్.. మరోసారి ఆ తప్పిదం చేయకుండా జాగ్రత్తగా ఆడి అద్భుత విజయాన్నందుకుంది.

ఆ వివాదం మా స్నేహాన్నే పాడు చేసింది: మెక్‌కలమ్‌

బ్యాట్స్‌మన్ వైఫల్యం..

బ్యాట్స్‌మన్ వైఫల్యం..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సురేశ్‌ రైనా(30) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో భారత్‌.. బంగ్లాదేశ్‌ చేతిలో మరో ఘోర పరాభావం తప్పదని అందరూ భావించారు. కానీ,భారత బౌలర్లు అద్బుతంగా రాణించారు.

కరోనా నాకు మేలు చేసింది: దీపక్ చాహర్

సూపర్ బౌలింగ్

సూపర్ బౌలింగ్

ఛేదనలో బంగ్లా ఓపెనర్‌ తమిమ్‌ ఇక్బాల్‌(35) రాణించినా అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ కరువయ్యారు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో షబ్బిర్‌ రహ్మాన్‌(26), షకిబ్‌ అల్‌ హసన్‌(22) భారీ స్కోర్లు చేయలేకపోయారు. ఇక చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 11 పరుగులు అవసరం కాగా... కెప్టెన్‌ ధోని.. బంతిని యువ బౌలర్ హార్దిక్‌ పాండ్యా చేతికి ఇచ్చాడు. తొలి బంతికి సింగిల్‌ ఇచ్చిన పాండ్యా.. తర్వాతి రెండు బంతులకు వరుస బౌండరీలిచ్చి మూల్యం చెల్లించుకున్నాడు. రహీమ్‌ రెండు ఫోర్లతో ధాటిగా ఆడటంతోతో సమీకరణం 3 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఆ సమయంలోనూ ధోనీ ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయాడు.

ధోనీ వ్యూహం..

ధోనీ వ్యూహం..

పాండ్యా‌కు కొన్ని సూచనలు చేస్తూ.. ఓ వ్యూహాన్ని రచించాడు. అంతకంటే ఎక్కువగా ఒత్తిడికి గురవ్వకుండా అతనిలో ఆత్మవిశ్వసాన్ని పెంచాడు. తర్వాత చెలరేగిపోయిన పాండ్యా రెండు వరుస బంతుల్లో రహీమ్‌, మహ్మదుల్లాను ఔట్‌ చేశాడు. ఓటమి ముంగిట పేలవ షాట్లతో పెవిలియన్ చేరిన బంగ్లా బ్యాట్స్‌మన్ మూల్యం చెల్లించుకున్నారు.

ఇక చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే బంగ్లా బ్యాట్స్‌మన్‌ శువగత ఆఖరి బంతిని కనీసం బ్యాట్‌కు తగిలించలేకపోయాడు. అయినా పరుగు తీసి సూపర్ ఓవర్‌కు దారితీద్దామనుకున్న బంగ్లా ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. బంతిని అందుకున్న ధోనీ నేరుగా వచ్చి వికెట్లను కొట్టేయడంతో ముస్తాఫిజుర్ ఔటయ్యాడు. దీంతో భారత్ ఒక్క పరుగుతో చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఇక ఈ మెగా టోర్నీలో భారత్ జోరు సెమీస్‌కే పరిమితమైంది. వెస్టిండీస్ చేతిలో ఓడి వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది.

Story first published: Monday, March 23, 2020, 14:55 [IST]
Other articles published on Mar 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X