Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కరోనా నాకు మేలు చేసింది: దీపక్ చాహర్

Deepak Chahar Says Coronavirus has given me extra time to recover

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ తనకు పరోక్షంగా మేలు చేసిందని టీమిండియా యువ పేసర్ దీపక్ చాహర్ తెలిపాడు. కరోనా వైరస్ కారణంగానే బీసీసీఐ ఐపీఎల్ 2020 సీజన్‌ను ఏప్రిల్ 15కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ వాయిదా వేయడం వ్యక్తిగతంగా తనకు లాభించిందని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు.

గాయంతో దూరం..

గాయంతో దూరం..

వెన్ను గాయం కారణంగా భారత్ జట్టుకి దూరమైన చాహర్.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)‌లో గతవారం వరకు పునరావాసం తీసుకున్నాడు. ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. కానీ.. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఎన్‌సీఏను బీసీసీఐ మూసివేసింది. దీంతో ఈ పేసర్ ప్రస్తుతం ఇంటి వద్ద జిమ్‌లోనే ఫిట్‌నెస్ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

అందుకే మేలు జరిగిందంటున్నా...

అందుకే మేలు జరిగిందంటున్నా...

అయితే షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఐపీఎల్ ప్రారంభమై ఉంటే.. చాహర్ కొన్ని మ్యాచ్‌లకి దూరంగా ఉండాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే తనకు ఐపీఎల్ వాయిదా పడటం కలిసొచ్చిందన్నాడు.

‘వ్యక్తిగతంగా చెప్పాలంటే.. దేశంలో కరోనా వైరస్ కారణంగా నాకు ఫిట్‌నెస్ సాధించేందుకు అదనపు సమయం దొరికింది. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ మార్చి 29 నుంచి జరిగి ఉంటే కొన్ని మ్యాచ్‌లకు నేను దూరంగా ఉండాల్సి వచ్చేది'అని దీపక్ చాహర్ తెలిపాడు. ప్రస్తుతానికి గాయం నుంచి పూర్తిగా ఫిట్‌నెస్ సాధించలేకపోయినా.. ఏప్రిల్ 15నాటికి మాత్రం తాను ఫుల్ ఫిట్‌నెస్‌తో మైదానంలోకి అడుగుపెడతానని ధీమా వ్యక్తం చేశాడు.

రోహిత్ గాయమే కోహ్లీసేన కొంప ముంచింది: న్యూజిలాండ్ పేసర్

టర్నింగ్ పాయింట్ అదే..

టర్నింగ్ పాయింట్ అదే..

2019 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 మ్యాచ్‌లాడిన దీపక్ చాహర్ 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. ఇదే అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ధోనీ పర్యవేక్షణలో రాటుదేలిన చాహర్ అద్భుత బౌలింగ్‌తో సెలక్టర్ల దృష్టిపడ్డాడు.దీంతో భారత జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశాన్ని అందుకున్నాడు.

అంతేకాకుండా అటు కొత్త బంతితో.. ఇటు డెత్, స్లాగ్ ఓవర్లలో అద్భుతంగా రాణిస్తూ ప్రత్యేక గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా టీ20 స్పెషలిస్ట్ బౌలర్‌గా ఎదిగాడు. మొత్తం 10 అంతర్జాతీ టీ20లు ఆడిన ఈ యువ పేసర్ 7 ఎకనామితో 17 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్పే టార్గెట్‌గా సిద్దమవుతున్నాడు.

భేష్ వార్న్.. నువ్వు మా క్రికెటర్లలా కాదులే!!

Story first published: Sunday, March 22, 2020, 14:29 [IST]
Other articles published on Mar 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+