న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తండ్రి కాబోతున్న కేన్ మామ

 NZ vs WI: Kane Williamson set to become father for the first time

హమిల్టన్: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలోనే తాను తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం గర్భవతి అయిన తన సతీమణి సారా రహీమ్ ఈ నెలలో తమ తొలి సంతానానికి జన్మనివ్వనుందని ప్రకటించాడు. ఇన్నాళ్లు ఈ విషయం చెప్పకుండా దాచిన విలియమ్సన్.. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌లో డబుల్ సెంచరీ సాధించిన ఆనందంలో ఈ గుడ్‌న్యూస్‌ను పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న విలియమ్సన్ (251) సంప్రదాయక ఫార్మాట్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు.

సిగ్గుపడుతూ..

సిగ్గుపడుతూ..

ఇక విలిమయ్సన్ డబుల్ సెంచరీ క్షణాలను అతని సతీమణి సారా రహీమ్ స్టాండ్స్‌లో నిలబడి ఆస్వాదించింది. ఇక తన ఇన్నింగ్స్‌పై మాట్లాడుతూ విలియమ్సన్ ఈ గుడ్ న్యూస్‌ను పంచుకున్నాడు. ‘ప్రతీ ఒక్కరి జీవితంలో ఉత్సాహానికి గురయ్యే సందర్భం ఇది. నాక్కూడా అలానే ఉంది'అని సిగ్గుపడుతూ కేన్ ఈ శుభవార్తను పంచుకున్నాడు. ఇక తన సతీమణి ప్రసవ సమయంలో తోడుగా ఉండేందుకు పెటర్నిటీ లీవ్ తీసుకుంటావా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి కేన్ నిరాకరించాడు. ఇక వెస్టిండీస్‌తో మరో టెస్ట్‌తో పాటు మూడు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్ ఆడనుంది.

కేన్ డబుల్.. విండీస్ ట్రబుల్

కేన్ డబుల్.. విండీస్ ట్రబుల్

97 పరుగుల వ్యక్తిగత స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన విలియమ్సన్.. 369 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 251 పరుగులు చేసిన కేన్‌కు టెస్టుల్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. విలియమ్సన్ ద్విశతకం నమోదు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 517 పరుగుల వద్ద కివీస్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ద్విశతకం పూర్తయ్యాక దూకుడు పెంచిన కేన్.. కెమర్ రోచ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు ఓ సిక్స్ బాది తర్వాతి బంతికి ఔటయ్యాడు. కానీ రోచ్ క్రీజ్ అవతల పాదం మోపి బాల్ విసరడంతో.. అంపైర్ నో బాల్‌గా ప్రకటించారు. టీ బ్రేక్ తర్వాత అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్స్ బాదిన విలియమ్సన్ 251 పరుగుల వద్ద తర్వాతి బంతికి రోస్టన్ ఛేజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. చివరి 50 పరుగులను కేన్ 41 బంతుల్లోనే చేయడం విశేషం. జెమీసన్ హాఫ్ సెంచరీ చేయగానే న్యూజిలాండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

మరో ఫోర్ కొట్టుంటే..

మరో ఫోర్ కొట్టుంటే..

కేన్ విలియమ్సన్‌కు టెస్టుల్లో ఇది మూడో డబుల్ సెంచరీ కాగా.. చివరిసారిగా 2019లో హమిల్టన్‌లోనే ద్విశతకం నమోదు చేయడం విశేషం. న్యూజిలాండ్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రెండన్ మెక్‌కల్లమ్ (4) తొలి స్థానంలో ఉండగా.. 3 ద్విశతకాలతో విలియమ్సన్, ఫ్లెమింగ్, టేలర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత తరం క్రికెటర్లలో కోహ్లీ, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్‌లను ఫ్యాబ్-4గా పిలుస్తారు. వీరిలో కోహ్లీ, రూట్‌లకు టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 254 పరుగులు కాగా.. విండీస్‌పై 251 రన్స్ చేసిన విలియమ్సన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 239 పరుగులతో స్మిత్ ఈ నలుగురిలో చివరి స్థానంలో ఉన్నాడు.

కంగ్రాట్స్ కేన్ మామ..

కంగ్రాట్స్ కేన్ మామ..

ఇక తండ్రి కాబోతున్న కేన్ విలియమ్సన్‌‌‌కు యావత్ క్రికెట్ ప్రపంచం అభినందనలు తెలుపుతుంది. ప్రస్తుత, మాజీ క్రికెటర్లందరూ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెబుతున్నారు. అభిమానులు కూడా కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన కేన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దాంతో తెలుగు అభిమానులంతా కంగ్రాట్స్ కేన్ మామ అంటూ విషెస్ చెబుతున్నారు.

Story first published: Friday, December 4, 2020, 14:12 [IST]
Other articles published on Dec 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X