న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏడింతలు ఎక్కువ.. కరెంట్‌ బిల్‌ చూసి హర్భజన్‌ షాక్.. చుట్టుపక్కల వారి బిల్లు ఇచ్చారా అంటూ సెటైర్!!

Normal Bill Se 7 Time Jyada: Harbhajan Singh Shocked Over Inflated Electricity Bill
Harbhajan Singh Clarifies He's Not Eligible For Khel Ratna || Oneindia Telugu

ముంబై: తన ఇంటికొచ్చిన కరెంటు బిల్లు చూసి టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. సహజంగా తాను కట్టేదాని కన్నా ఏడింతలు ఎక్కువ వచ్చిందని చెప్పాడు. ముంబై ఆదాని ఎలక్ట్రిసిటీ సంస్థ నుంచి ఈ నెల కరెంటు బిల్లు రూ.33,900 వచ్చినట్లు తెలిపాడు. ఎలక్ట్రిసిటీ సంస్థ నుంచి ఇటీవల తనకు వచ్చిన కరెంట్‌ బిల్‌ మెసేజ్‌ను భజ్జీ శనివారం ట్విటర్‌లో పోస్టు చేశాడు.

ఏడింతలు ఎక్కువ

'ముంబై ఆదాని ఎలక్ట్రిసిటీ సంస్థ మా చుట్టుపక్కల వాళ్లందరి కరెంట్‌ బిల్‌ కూడా నాకే ఇచ్చినట్టుంది. ముంబై ఆదాని అలెర్ట్: 152857575 సర్వీస్ నంబర్ కరెంట్‌ బిల్‌ రూ. 33900.00 చెల్లించాల్సి ఉంది. సాధారణ బిల్ కంటే ఏడింతలు ఎక్కువ. వావ్' అని హర్భజన్‌ సింగ్‌ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టయిల్లో భజ్జీపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

హీరోయిన్ తాప్సీ సైతం

హీరోయిన్ తాప్సీ సైతం

ఇంతకుముందు బాలీవుడ్‌ హీరోయిన్ తాప్సీ సైతం తనకు రూ.36 వేలు కరెంటు బిల్లు వచ్చిందని తెలిపారు. అయితే ఇప్పుడా ఇంట్లో ఎవరూ ఉండరని ఆమె చెప్పడం గమనార్హం. కొందరు హీరోలు సైతం ఎక్కువ కరెంటు బిల్లులు వచ్చాయని తెలిపారు. ఇటీవలి కాలంలో ఇలా కరెంట్‌ బిల్లులు అధిక మొత్తంలో రావడం సాధారణం అయిపోయింది. లాక్‌డౌన్‌ వేళ ఇలాంటి ఘటనలు ఎన్నో బయటపడ్డాయి. సామాన్య జనాలకు సైతం దిమ్మతిరిగే కరెంట్‌ బిల్లులు వచ్చాయి. ప్రజలందరూ ఎలక్ట్రిసిటీ సంస్థపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే యూఏఈకి

త్వరలోనే యూఏఈకి

కరోనా వైరస్ లాక్‌డౌన్‌ కారణంగా ఇన్ని రోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ త్వరలోనే యూఏఈకి పయనమయ్యే అవకాశం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభమవుతుండగా.. అన్ని ఫ్రాంఛైజీల కన్నా వారం ముందే చెన్నై జట్టు‌ అక్కడికి చేరుకోనుంది. అక్కడి వాతావరణంకు అలవాటు పడడం, ప్రాక్టీస్ చేసేందుకే చెన్నై ఆగష్టు రెండో వారంలో యూఏఈకి వెళ్లనుంది. మార్చిలో సైతం చెన్నై అన్ని జట్ల కన్నా ముందే శిక్షణా శిబిరం నిర్వహించిన సంగతి తెలిసిందే.

 2016 నుంచి క్రికెట్‌కు దూరం

2016 నుంచి క్రికెట్‌కు దూరం

40 ఏళ్ల వయసున్న హర్బజన్ సింగ్.. 2016 నుంచి క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. భజ్జీ 2016లో చివరిసారి ఆసియా కప్‌లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి నుంచి సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌గా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. కెరీర్‌ మొత్తంలో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 ఆడిన హర్భజన్‌ వరుసగా 417, 269, 25 వికెట్లు తీశాడు.

ఈసీబీకి బీసీసీఐ పచ్చజెండా.. యూఏఈలోనే ఐపీఎల్ 2020!!

Story first published: Monday, July 27, 2020, 18:49 [IST]
Other articles published on Jul 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X