న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

NZ vs WI: చిత్తయిన వెస్టిండీస్.. న్యూజిలాండ్ ఘన విజయం

New Zealand’s register massive win against the West Indies in 1st test

హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై వెస్టిండీస్ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ని 0-2తో చేజార్చుకున్న కరీబియన్లు.. హామిల్టన్ వేదికగా తాజాగా ముగిసిన తొలి టెస్టులోనూ చిత్తయ్యారు. 196/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్టిండీస్.. 58.5 ఓవర్లలో 247 పరుగులకే కుప్పకూలడంతో ఇన్నింగ్స్ 134 పరుగుల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్ ఘనవిజయాన్నందుకుంది.

జాక్ బ్లాక్ వుడ్(104), అల్జారీ జోసెఫ్ పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 155 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ నాలుగు వికెట్లు తీయగా.. జేమీసన్ రెండు, సౌథీ, బోల్ట్, మిచెల్ తలో వికెట్ పడగొట్టారు.

ఈ గెలుపుతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో కివీస్ 1-0తో లీడ్ సాధించింది. డబుల్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ( 412 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లతో 251)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక చివరి టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది.

గత గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. విలియమ్సన్ జోరుతో మొదటి ఇన్నింగ్స్‌ను 519/7 వద్ద డిక్లేర్ చేసింది. విలియమ్సన్‌తో పాటు ఆ జట్టులో ఓపెనర్ టామ్ లాథమ్ ( 184 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 86), జమీషన్ 64 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో (51 నాటౌట్) రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, గాబ్రైల్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. అల్జారీ జోసఫ్‌కి ఒక వికెట్ దక్కింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ లవ బ్యాటింగ్‌తో 138 పరుగులకే ఆలౌటైంది. కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ (4/35) సంచలన ప్రదర్శన కనబర్చగా.. జెమీషన్, వాగ్నర్ చెరో రెండు, బౌల్ట్‌కి ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో 381 పరుగులు వెనకబడిన వెస్టిండీస్.. ఫాలో ఆన్ ఆడిచిత్తుగా ఓడింది.

సంక్షిప్త స్కోర్లు:

న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: 518/9

వెస్టిండీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ : 138 ఆలౌట్, సెకండ్ ఇన్నింగ్స్ 247 ఆలౌట్

Story first published: Sunday, December 6, 2020, 14:58 [IST]
Other articles published on Dec 6, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X