న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సన్‌రైజర్స్ విజయాల వెనుక విలియమ్సన్: కోచ్ ప్రశంసల వర్షం

By Nageshwara Rao
 New Zealand coach terms Kane Williamson as an all round cricketer

హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంతో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 11వ సీజన్‌కు దూరం కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్సీ పగ్గాలను యాజమాన్యం న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్‌కు అప్పగించింది. ఏ ముహుర్తాన కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడేమో గానీ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లాడి ఎనిమిదింట విజయం సాధించి 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా కేన్ విలియమ్సన్ కెప్టెన్సీపై న్యూజిలాండ్ జట్టు కోచ్ హెస్సన్ మాట్లాడుతూ 'క్వాలిటీ బ్యాట్స్‌మన్, స్కిల్స్‌ను కలిగి ఉంటే ఏ ఫార్మాట్‌నైనా ఇట్టే అర్ధం చేసుకోగలుగుతాడు. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ ఎవరైనా వెంటనే పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గ ప్రదర్శన చేస్తాడు. దీనికి కేన్‌ విలియమ్సన్‌ ఎలాంటి మినహాయింపు కాదు' అని అన్నాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్

'కేన్ ఎంతో తెలివైన ఆటగాడు. బంతి రాగానే దాన్ని ఎలాగైనా కొట్టాలి అనుకోడు. బంతి టైమింగ్‌ను బట్టి ఆచితూచి ఆడతాడు. సరిగ్గా ఫీల్డర్లు లేని వైపుకు షాట్లు ఆడతాడు. అతడు ఆల్‌రౌండ్ ప్లేయర్' అని కొనియాడాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో వెలుగులోకి వచ్చిన అత్యుత్తమ ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ ఒకడు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా ఆడుతూ కివీస్‌కు అద్భుత విజయాలను కట్టబెడుతున్నాడు.

కేన్ విలియమ్సన్ అత్యుత్తమ క్రికెటరా? అన్న ప్రశ్నకు గాను 'ప్రపంచం మెచ్చిన అగ్రశ్రేణి ఆటగాళ్లలో విలియమ్సన్‌ ఒకడు. నాలుగు నుంచి ఐదుగురు అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. భారత్ నుంచి విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ నుంచి జోరూట్, ఆస్ట్రేలియా నుంచి స్టీవ్ స్మిత్, న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్. ప్రస్తుతం ఈ నలుగురు క్రికెట్‌లో అద్భుతాలు చేస్తున్నారు. ఇక, ఏబీ డివిలియర్స్ ప్రత్యేకం' అని చెప్పుకొచ్చాడు.

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆటగాళ్లలో కేన్ విలియమ్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 51.25 యావరేజితో 410 పరుగులు నమోదు చేసిన ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, కేన్ స్ట్రైక్ రేట్ 131.83గా ఉంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలను సాధించడం వెనుక కేన్ విలియమ్సన్ కూడా ఒక కారణం.

Story first published: Thursday, May 10, 2018, 16:38 [IST]
Other articles published on May 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X