న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: శార్దూల్.. నువ్వు నిజంగా దేవుడు సామీ! రాహుల్ ఇదేం కెప్టెన్సీ!

Netizens reacts as Shardul Thakur runs through South Africa’s batting order in Johannesburg Test

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పేసర్ శార్దూల్ ఠాకూర్ దుమ్మురేపుతున్నాడు. సూపర్ బౌలింగ్‌తో ప్రత్యర్థి పతనాన్ని శాసిస్తున్నాడు. ఎప్పటిలానే క్లిష్టపరిస్థితుల్లో దేవుడిలా వచ్చి సౌతాఫ్రికా టీమ్ భాగస్వామ్యాన్ని విడదీసాడు. తద్వారా టీమిండియాకు మంచి బ్రేక్ త్రూ అందించి మ్యాచ్‌పై పట్టు బిగించేలా చేశాడు. దాంతో శార్దూల్ ఠాకూర్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. నెటిజన్లు అతని బౌలింగ్‌కు ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే తాత్కలిక సారథి కేఎల్ రాహుల్‌ కెప్టెన్సీ తీరును తప్పుబడుతున్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన శార్దూల్‌కు సరైన సమయంలో బంతినివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శార్దూల్ ఠాకూర్ పేరు ట్రెండ్ అవుతోంది.

మూడు వికెట్లతో..

35/1 ఓవర్‌నైట్ స్కోర్ రెండో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా నిలకడగా ఆడింది. ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ పీటర్సన్(118 బంతుల్లో 9 ఫోర్లతో 62), డీన్ ఎల్గర్(120 బంతుల్లో 4 ఫోర్లతో 28) భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ వారి సహనానికి పరీక్షగా నిలిచారు. పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమైన ఈ జోడీ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ఓవైపు ఎల్గర్ నిదానంగా ఆడినా.. మరోవైపు పీటర్సన్ తనదైన శైలిలో ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడీని విడదీయడానికి భారత స్టార్ పేసర్లు మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా విఫలమవ్వగా.. రాహుల్ మహ్మద్ సిరాజ్‌తో పాటు రవిచంద్రన్ అశ్విన్‌ను రంగంలోకి దింపాడు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు.

చివరి ఆప్షన్‌గా..

ఇక లంచ్ బ్రేక్‌కు ముందు శార్దూల్‌కు బంతినివ్వడంతో అతను సత్తా చాటాడు. కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చి టీమిండియాకు మంచి బ్రేక్ త్రూ అందించాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కొద్దిసేపటికే పీటర్సన్‌ను ఔట్ చేసిన శార్దూల్.. లంచ్ బ్రేక్‌కు ముందు డస్సెన్(1) కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో 12 పరుగుల వ్యవధిలోనే సఫారీ టీమ్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అయితే తొడ కండరాల గాయంతో బాధపడుతున్న సిరాజ్‌కు బంతినిచ్చే బదులు.. శార్దూల్‌కు ముందు బాల్ ఇవ్వాల్సిందని మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనుబడుతుందని కామెంట్ చేస్తున్నారు.

ఔటాఫ్ సిలబస్..

ఇక శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌ను కొనియాడుతూ నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ ప్రిపర్ అయ్యారని, కానీ శార్దూల్ ఠాకూర్ ఔటాఫ్ సిలబస్‌లా వచ్చి చెలరేగాడని కామెంట్ చేస్తున్నారు. ఇక రాహుల్.. శార్దూల్ ఠాకూర్‌కు ముందే బంతినివ్వాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కీలక సమయంలో వికెట్లు తీయడం శార్దూల్‌కు అలవాటేనని, అందుకే అతన్ని లార్డ్ శార్దూల్ అంటారని కొనియాడుతున్నారు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం రాహుల్ కెప్టెన్సీ తీరును తప్పుబట్టాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న సిరాజ్‌కు బదులు శార్దూల్ ఠాకూర్‌తోనే ముందు బౌలింగ్ చేయాల్సిందని ట్వీట్ చేశాడు.

సౌతాఫ్రికా 133/4

35/1 ఓవర్‌నైట్ స్కోర్ రెండో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా 54 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. క్రీజులో టెంబా బవుమా(15 బ్యాటింగ్), కైల్ వెరీన్(15 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు ఓవర్ నైట్ బ్యాట్స్‌మన్ పీటర్సన్(118 బంతుల్లో 9 ఫోర్లతో 62), డీన్ ఎల్గర్(120 బంతుల్లో 4 ఫోర్లతో 28) నిలకడగా ఆడి 74 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ముందుగా డీన్ ఎల్గర్‌ను ఔట్ చేసిన శార్దూల్.. ఆ తర్వాత పీటర్సన్, డస్సెన్(1)లను పెవిలియన్ చేర్చాడు.

Story first published: Tuesday, January 4, 2022, 17:17 [IST]
Other articles published on Jan 4, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X