న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND-W vs AUS-W: బ్లెజర్ కొనేందుకు డబ్బులు లేవా? మహిళా క్రికెటర్లపై ఎందుకీ వివక్ష! బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్!

Netizens miffed as Mithali Raj doesn’t sport blazer during toss against Australia

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ దేశాల్లోనే సంపన్నమైన బీసీసీఐ దగ్గర.. ఓ బ్లెజర్ కొనేందుకు డబ్బులు లేవా? అని ప్రశ్నిస్తున్నారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లతో జరుగుతున్న చారిత్రాత్మక డేనైట్ టెస్ట్‌లో భారత మహిళల జట్టు సారథి మిథాలీ రాజ్ బ్లెజర్ లేకుండానే టాస్‌కు హాజరైంది. సంప్రదాయం ప్రకారం టెస్ట్ క్రికెట్‌లో టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు బ్లెజర్లు ధరిస్తారు.

భారత పురుషల జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం బ్లెజర్‌తోనే టాస్‌కు హాజరవుతాడు. అయితే తాజా మహిళల డే/నైట్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లాన్నింగ్ టాస్ సందర్బంగా బ్లెజర్ ధరించగా.. మిథాలీ రాజ్ మాత్రం బ్లెజర్‌లేకుండా వచ్చింది. దాంతో మిథాలీ బ్లెజర్ ఎందుకు ధరించలేదు? అనే చర్చ ఊపందుకుంది.

క్రికెట్ పెద్దన్న..

సంపన్నమైన క్రికెట్ బోర్డు, పెద్దన్నగా పిలిచే బీసీసీఐ మహిళా క్రికెటర్లకు కనీసం బ్లెజర్ ఇవ్వడం లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభిమానులు అయితే బోర్డుపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మహిళా క్రికెటర్ల పట్ల ఎందుకీ వివక్ష? అని నిలదీస్తున్నారు. బ్లెజర్, టెస్ట్ క్యాప్ లేకుండా మిథాలీ టాస్‌కు రావడాన్ని వారు సహించలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌ టాస్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎందుకీ వివక్ష..?

ఎందుకీ వివక్ష..?

ఈ మ్యాచ్ విషయంలో బీసీసీఐ ఇంకొంచెం చురుకుగా ఉండాల్సిందని, చాలా రోజుల ముందే టెస్ట్ టీమ్ ప్రకటించినప్పటికీ..బ్లెజర్ ఏర్పాటు చేయలేకపోయిందని ఓ అభిమాని ఘాటుగా విమర్శించాడు. మహిళల క్రికెట్ పట్ల ఎందుకీ వివక్ష అంటూ నిలదీస్తున్నారు. ఈ చిన్న చిన్న విషయాలే మహిళల క్రికెట్‌ను బీసీసీఐ ఎలా చూస్తుందో తెలియజేస్తుందోని మరో అభిమాని కామెంట్ చేశాడు. టాస్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. మన కెప్టెన్ బ్లెజర్ ఎక్కడా? అని ప్రశ్నిస్తున్నారు.

చెలరేగిన స్మృతి మంధాన..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత మహిళలు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. స్మృతి మంధాన(216 బంతుల్లో 22 ఫోర్లు, సిక్స్‌తో 127) సెంచరీతో చెలరేగగా.. షెఫాలీ వర్మ(31), పూనమ్ రౌత్(36), మిథాలీ రాజ్(30) రాణించారు. ప్రస్తుతం క్రీజులో దీప్తి శర్మ(12 బ్యాటింగ్), తానియా భాటియా(0 బ్యాటింగ్) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా స్మృతి మంధాన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పింక్ టెస్ట్‌లో ఫస్ట్ సెంచరీ చేసిన భారత మహిళగా.. రెండో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. పురుషుల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ముందుగా ఈ ఘనతను అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన పింక్ ఫస్ట్ టెస్ట్‌లో విరాట్ సెంచరీ బాదాడు.

15 ఏళ్ల తర్వాత..

15 ఏళ్ల తర్వాత..

చివరిసారిగా 2006లో భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్లు టెస్టులో తలబడ్డాయి. మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు టెస్టు మ్యాచ్ ఆడుతున్నాయి. కెప్టెన్ మిథాలీ రాజ్, వెటరన్‌ పేసర్ జులన్‌ గోస్వామి అప్పటి మ్యాచ్‌ ఆడారు. ఇప్పుడు వీళ్లిద్దరితో ఆడుతున్న వాళ్లంతా కొత్తవాళ్లే. భారత్‌కు ఈ ఏడాది ఇది రెండో టెస్టు. ఇటీవల ఇంగ్లండ్‌ గడ్డపై జరిగిన ఏకైక టెస్టులో భారత్ చక్కని పోరాటస్ఫూర్తి కనబరిచింది.

ఇప్పుడు అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. మరోవైపు ఆస్ట్రేలియా 2019లో యాషెస్‌ సిరీస్‌ ఆడాక మళ్లీ టెస్టులే ఆడలేదు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇప్పటివరకు 9 టెస్టులు జరిగాయి. ఆస్ట్రేలియా 5 టెస్టుల్లో గెలుపొందగా.. నాలుగు డ్రాగా ముగిశాయి. భారత్‌ ఒక్క మ్యాచ్‌లోనూ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.

Story first published: Friday, October 1, 2021, 22:48 [IST]
Other articles published on Oct 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X