IND vs SL: మనీశ్ మామ.. నీ ఇంటర్నేషనల్ కెరీర్ ఖేల్ ఖతమ్, దుక్నం బంద్!

హైదరాబాద్: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అప్పుడెప్పుడో 6 ఏళ్ల కిందట 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మనీశ్ పాండే.. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు. వరుసగా అవకాశాలు రాకపోవడం ఒక కారణమైతే.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకపోవడం మరో కారణం. జట్టులో విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో శ్రీలంక పర్యటన ద్వారా ఈ కర్ణాటక బ్యాట్స్‌మెన్‌కు బంగారం లాంటి అవకాశం వచ్చింది. వరుసగా మూడు వన్డేల్లోనూ అతనికి చోటు దక్కింది. కానీ మనీశ్ పాండే మాత్రం మూడింటిలోనూ విఫలమయ్యాడు. దాంతో మనీష్ పాండే అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మూడింటిలోనూ విఫలం..

తొలి మ్యాచ్‌లో 263 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు కడవరకు నిలిచి విజయాన్నందించాల్సిన పాండే.. 40 బంతుల్లో కేవలం 26 పరుగులే చేసి ఔటయ్యాడు. ఇక రెండో వన్డేలో మంచి టచ్‌లో కనిపించిన ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్ దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 37 రన్స్ చేశాడు. తాజాగా జరుగుతున్న చివరి వన్డేలో మరో అవకాశం ఇవ్వగా.. నిర్లక్ష్యపు షాట్ ఆడబోయి వికెట్ కీపర్‌‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 19 బంతుల్లో కేవలం 11 రన్స్ మాత్రమే చేశాడు. మనీశ్ పాండే వైఫల్యం టీమ్ పెర్ఫామెన్స్‌పై కూడా ప్రభావం చూపింది.

టీ20ల్లో చోటు కష్టమే..

మూడు వన్డేల్లో దారుణంగా విఫలమైన మనీశ్ పాండేకు దాదాపు అంతర్జాతీయ క్రికెట్ దారులు మూసుకుపోయినట్లే. యువ ఆటగాళ్లు సత్తా చాటుతుండటం, జట్టులో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో అతను మళ్లీ టీమిండియాకు ఆడటం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. కామెంటేటర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత జట్టులో ఒక్కో ప్లేస్‌కు ముగ్గురేసి ప్లేయర్లు సిద్దంగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. శ్రీలంకతో జరిగే అప్‌కమింగ్ మూడు టీ20ల సిరీస్‌లో కూడా మనీశ్ పాండే చోటు దక్కడం కష్టమేనని చెబుతున్నారు. రాహుల్ ద్రవిడ్.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వవచ్చని అభిప్రాయపడుతున్నారు.

బై..బై పాండే..

ఇక అభిమానులు సైతం మనీశ్ పాండే వైఫల్యంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడని విమర్శిస్తున్నారు. తన కెరీర్‌లో ఇదే చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ అని చెబతున్నారు. అంతర్జాతీయ క్రికెటర్‌‌గా మనీశ్ పాండే చచ్చిపోయాడని కూడా ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్న నేపథ్యంలో మళ్లీ మనీశ్ పాండేకు చోటు దక్కడం కష్టేమనంటున్నారు. పాండే అంతర్జాతీయ క్రికెట్‌కు ధన్యవాదాలు సైతం చెబుతున్నారు.

కుప్పకూలిన గబ్బర్ సేన..

మూడో వన్డేలో స్పిన్నర్లు అకిలా ధనుంజయ(3/44), ప్రవీణ్ జయవిక్రమార్క(3/59) చెలరేగడంతో భారత్ 43.1 ఓవర్లలో 225 పరుగులకు కుప్పకూలింది. జట్టులో 6 మార్పులు చేసిన గబ్బర్ సేన మూల్యం చెల్లించుకుంది. పృథ్వీ షా(49 బంతుల్లో 8 ఫోర్లు 49), సంజూ శాంసన్(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 46), సూర్యకుమార్ యాదవ్(37 బంతుల్లో 7 ఫోర్లతో 40) మినహా అంతా విఫలమయ్యారు. స్పిన్నర్లుకు అండగా పేసర్లు చమీరా(2/55), కరుణరత్నే(1/25) రాణించడంతో గబ్బర్ సేన చేతులెత్తేసింది. కెప్టెన్ డసన్ షనకకు ఓ వికెట్ దక్కింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, July 23, 2021, 21:39 [IST]
Other articles published on Jul 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X