న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: మొత్తం నాశనం చేశావు కదరా వరుణూ.! కేకేఆర్‌‌ను నిషేధించాలి.. ఫ్యాన్స్ ఫైర్!

Netizens Brutally Trolled Varun Chakravarthy and KKR after IPL 2021 suspension
IPL 2021 Game Changer ఎవరో తెలుసా? ఎంజాయ్ చేస్తుంటే నాశనం చేశావు Varun Chakravarthy| Oneindia Telugu

హైదరాబాద్: లెక్కకుమించిన జాగ్రత్తలు తీసుకున్నా.. అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించినా.. ఐపీఎల్‌లోకి కరోనా ఎలా ప్రవేశించిందనేది మాత్రం అంతుపట్టడం లేదు. కానీ ఇందులో బయటి వారి ప్రమేయం కన్నా లోపలి వ్యక్తుల అలసత్వమే ఎక్కువగా ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కోల్‌కతా నైటరైడర్స్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి నుంచి సందీప్ వారియర్.. అక్కడి నుంచి అమిత్ మిశ్రాకు వైరస్ సోకడం వెనుక నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తున్నది. జీపీఎస్‌లు, గ్రౌండ్ స్టాఫ్‌కు ఎస్‌వోపీ లేకపోవడం వలే ఇలా జరిగిందని నిందలు వేస్తున్నా.. అసలు వైరస్ బబుల్‌లోకి ఎలా ప్రవేశించిందనే దానిపై కొన్ని ఫ్రాంచైజీలు మాన్యువల్ ట్రేసింగ్ చేశాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వచ్చాయి.

వరుణ్‌తో మొదలై..

ఓ మ్యాచ్‌లో గాయపడిన వరుణ్ చక్రవర్తిని.. గత వారం గ్రీన్ చానెల్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. భుజం గాయానికి స్కానింగ్ నిర్వహించినట్లు అందరికి చెప్పారు. కానీ అతనికి భుజ గాయం కాలేదని, కడుపులో మంటతో బాధపడుతుండటంతో దానికి చికిత్స అందించారని తెలుస్తోంది. అక్కడి నుంచి హోటల్ రూమ్‌కు తిరిగి వచ్చిన తర్వాత వరుణ్ నిబంధనల ప్రకారం వారం రోజులు క్వారంటైన్‌లోకి వెళ్లకుండా సందీప్‌తో కలిసి భోజనం చేశాడు. ఈ సంఘటన ఈ నెల 1న జరిగింది. భోజనం తర్వాత ఇద్దరు ప్లేయర్లు.. మిగతా టీమ్‌తో కలిసి ప్రాక్టీస్‌కు వెళ్లారు. అక్కడే తనకు హెల్త్ బాగాలేదని వరుణ్ చెప్పాడు. వెంటనే అతన్ని ఐసోలేట్ చేసి టెస్ట్‌లు నిర్వహించారు. కానీ అప్పటి వరకు వరుణ్‌తో కలిసి తిరిగిన సందీప్ ఇతర ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేశాడు. ఆ క్రమంలోనే ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రాతో మాట్లాడాడు. ఇలా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెంది లీగ్ వాయిదాకు కారణమైంది.

గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్..

ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాకు కారణమైన వరుణ్ చక్రవర్తిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, కామెంట్స్ ట్రెండ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ వరుణ్ చక్రవర్తీ అని ఒకరంటే.. డ్రీమ్ 11 సీజన్ క్యాన్స్‌లర్ అవార్డు అతనికేనని మరొకరు సెటైరిక్‌గా ట్వీట్ చేస్తున్నారు. తమ ఫొటో ఎడిటింగ్ నైపుణ్యానికి పని పెట్టి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బబుల్‌లోకి వైరస్ తీసుకెళ్లిన మహనీయుడు వరుణ్ చక్రవర్తీ అని, ఈ ఒక్క తప్పిదంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్..

ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాకు కారణమైన వరుణ్ చక్రవర్తిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, కామెంట్స్ ట్రెండ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ వరుణ్ చక్రవర్తీ అని ఒకరంటే.. డ్రీమ్ 11 సీజన్ క్యాన్స్‌లర్ అవార్డు అతనికేనని మరొకరు సెటైరిక్‌గా ట్వీట్ చేస్తున్నారు. తమ ఫొటో ఎడిటింగ్ నైపుణ్యానికి పని పెట్టి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బబుల్‌లోకి వైరస్ తీసుకెళ్లిన మహనీయుడు వరుణ్ చక్రవర్తీ అని, ఈ ఒక్క తప్పిదంతో ప్రపంచ దృష్టిని ఆకర్షించాడని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

కేకేఆర్, వరుణ్‌ను నిషేధించాలి..

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ లీగ్ వాయిదాకు కారణమైన వరుణ్ చక్రవర్తీ, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీపై నిషేధం విధించాలని మరికొంతమంది అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తమ పాటి తాము ఐపీఎల్ 2021 సీజన్ చూసి ఎంజాయ్ చేస్తుంటే నాశనం చేశావు కదరా వరుణూ.. అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. తొలిసారి కరోనా బారిన ఆటగాడిపై సానుభూతి కలగడంలేదని మరొకరు కామెంట్ చేశారు. వరుణ్ చక్రవర్తీ, కేకేఆర్ నిబంధనలు పాటించి ఉంటే ఐపీఎల్ సజావుగా సాగేదని కామెంట్ చేస్తున్నారు. బీసీసీఐ కూడా నిబంధనల పట్ల చూసి చూడనట్లు వ్యవహరించిందని విమర్శిస్తున్నారు.

Story first published: Thursday, May 6, 2021, 15:09 [IST]
Other articles published on May 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X