న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డేవిడ్ మలాన్ భారీ సిక్సరా? మజాకా? బాల్ కోసం తుప్పల్లో దూరిన నెదర్లాండ్స్ ఆటగాళ్లు (వీడియో)!

 Netherlands players search for the ball in bushes after Dawid Malans massive six

న్యూఢిల్లీ: మూడు సెంచరీలు.. 26 సిక్సర్లు, 36 ఫోర్లు.. 50 ఓవర్లలో 498 రన్స్.. పసికూన నెదర్లాండ్స్‌పై వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్ సృష్టించిన పరుగుల విధ్వంసమిది. ఈ దెబ్బకు అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఇంగ్లండ్ తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. వన్డేల్లో అసాధ్యం అనుకుంటున్న 500 రన్స్ మైలురాయికి ఆ జట్టు కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది. నెదర్లాండ్స్ టూర్‌లో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓ రేంజ్‌లో విజృంభించి పరుగుల మోత మోగించింది. అయితే సిక్సర్ల వర్షం కురిసిన ఈ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

కొడితే తుప్పల్లో పడ్డ బంతి..

కొడితే తుప్పల్లో పడ్డ బంతి..

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మాలాన్ కొట్టిన సిక్సర్‌కు నెదర్లాండ్ ఆటగాళ్లు చెట్లు, పుట్టలు పట్టుకొని తిరిగారు. టాస్ ఓడి ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ మలన్.. నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ వేసిన 9వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదాడు. తన బలాన్నంతా ఉపయోగించి కొట్టడంతో ఆ బంతి కాస్తా స్టేడియంను ఆనుకుని ఉన్న పెద్ద పెద్ద చెట్లు, దాని కింద ఉన్న తుప్పల్లో పడింది.

నెదర్లండ్ ఆటగాళ్ల గోస..

నెదర్లండ్ ఆటగాళ్ల గోస..

దీంతో గ్రౌండ్ సిబ్బందితో పాటు నెదర్లాండ్స్ ఆడగాళ్లు కూడా తుప్పల్లోకి వెళ్లి బంతి కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.కొద్దిసేపు తర్వాత బంతి దొరకడంతో అక్కడ ఉన్నవాళ్లంతా జరుగుతున్న తంతు చూసి కాసేపు నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. 50 ఓవర్లలో 498/4 స్కోర్ చేసిన ఇంగ్లీష్ టీమ్.. 2018లో ఆస్ట్రేలియాపై 481/6తో నెలకొల్పిన వరల్డ్ రికార్డును అధిగమించింది.

జోస్ బట్లర్ జోరు..

జోస్ బట్లర్ జోరు..

ఐపీఎల్‌లో ఇరగదీసిన జోస్ బట్లర్(70 బంతుల్లో 7 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 నాటౌట్)కు తోడు డేవిడ్ మలన్(109 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 125), ఫిల్ సాల్ట్(93 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 122) సెంచరీలు బాదగా.. లివింగ్ స్టోన్(22 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 నాటౌట్) ఇంగ్లండ్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో రికార్డు స్కోర్ నమోదు చేసింది. ఛేజింగ్‌లో నెదర్లాండ్స్ 49.4 ఓవర్లలో 266 వద్ద ఆలౌటై.. 232 రన్స్ తేడాతో ఓడిపోయింది. బట్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.

వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోర్లు :

వన్డే క్రికెట్ లో అత్యధిక స్కోర్లు :

- ఇంగ్లాండ్: 498-4 (నెదర్లాండ్స్-2022)

- ఇంగ్లాండ్: 481-6 (ఆస్ట్రేలియా-2018)

- ఇంగ్లాండ్: 444-3 (పాకిస్తాన్ - 2016)

- శ్రీలంక: 443-9 (నెదర్లాండ్స్ - 2006)

- సౌతాఫ్రికా: 439-2 (వెస్టిండీస్ - 2015)

- సౌతాఫ్రికా: 438-9 (ఆస్ట్రేలియా-2006)

Story first published: Saturday, June 18, 2022, 14:15 [IST]
Other articles published on Jun 18, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X