న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం.. ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నాం'

Nathan Lyon said Australias Rivalry With India Getting Up There With the Ashes

సిడ్నీ: 2018-19లో భారత్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్‌ నాథన్‌ లైయన్‌ అన్నాడు. భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ యాషెస్‌తో సమానమని లైయన్‌ పేర్కొన్నాడు. 2018-19 పర్యటనలో కోహ్లీసేన 2-1తో ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గిన జట్టుగా రికార్డుకెక్కింది. మరోసారి అదే విజయాన్ని రిపీట్ చేయాలని కోహ్లీసేన భావిస్తోంది.

 భారత్‌తో సిరీస్‌ యాషెస్‌తో సమానం:

భారత్‌తో సిరీస్‌ యాషెస్‌తో సమానం:

తాజాగా నాథన్‌ లైయన్ క్రికెట్ ఆస్ట్రేలియా ఫేస్‌బుక్ పేజీ ద్వారా మాట్లాడుతూ... 'భారత్‌తో సిరీస్‌.. యాషెస్‌ మాదిరి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. టీంఇండియా సూపర్‌స్టార్లతో నిండిఉంది. భారత్‌తో సిరీస్‌ అతిపెద్ద సవాలే. 2018-19లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటాం. భారత జట్టు ఇక్కడికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. ఆసీస్‌కు ఆడుతున్నప్పుడు మ్యాచ్‌ లేదా సిరీస్‌ కోల్పోవడం బాధగా ఉంటుంది' అని పేర్కొన్నాడు.

ఇంట్లోనే సాధన:

ఇంట్లోనే సాధన:

ప్రీ-సీజన్ ట్రైనింగ్ లేదని 32 ఏళ్ల నాథన్‌ లైయన్ చెప్పాడు. 'కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇంట్లోనే సమయాన్ని ఆస్వాదిస్తున్నా. గత 10 సంవత్సరాలలో ఇంత సమయం ఇంట్లో గడపడం ఇదే తొలిసారి. ప్రీ-సీజన్ ట్రైనింగ్ ఇప్పుడు లేదు. ఇంట్లోనే రోజు సాధన చేస్తున్నా' అని లైయన్ తెలిపాడు. నాథన్‌ లైయన్ ఆసీస్ తరపున 96 టెస్టులు, 29 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. ముఖ్యంగా టెస్ట్ స్పెసలిస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ‌96 టెస్టుల్లో 390 వికెట్లు పడగొట్టాడు.

 71 ఏళ్ల కల:

71 ఏళ్ల కల:

ఎన్నో ఏళ్ల నిరీక్షణను తెరదించుతూ ఏడాదిన్నర కిందట ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ అందుకుంది విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు. 1947 నుంచి భారత్‌ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నా 2018 వరకు ఒక్క టెస్టు సిరీస్‌‌లో కూడా విజయం సాధించలేదు. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఘనత సాధించి 71 ఏళ్ల కలను నెరవేర్చడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

2-1 తేడాతో సిరీస్ కైవసం:

2-1 తేడాతో సిరీస్ కైవసం:

అప్పటి సిరీస్‌లో ఛటేశ్వర్ పుజారా, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో విజయం సాధించింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా గెలుపొందడంతో సిరిస్ 1-1తో సమం అయింది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 137 పరుగులతో విజయం సాధించింది. సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టుకు పలు మార్లు వరుణుడు అంతరాయం కలిగించడంతో డ్రాగా ముగిసింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను కోహ్లీసేన 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

బుమ్రా, పుజారా కీలకపాత్ర:

బుమ్రా, పుజారా కీలకపాత్ర:

ఆ సిరిస్‌లో జస్ప్రీత్ బుమ్రా 17 యావరేజితో 21 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. ఇక ఛటేశ్వర్ పుజారా 74.42 యావరేజితో 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఈ ఏడాది చివరలో టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అయితే ఈసారి మాత్రం ఆ దేశ పర్యటనలో టీమిండియాకు అంత సులువుగా ఉండదని మాజీలు అంటున్నారు. బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా స్టీవ్ స్మిత్‌, డేవిడ్ వార్నర్‌లు అప్పుడు లేరని, ఇప్పుడు వారు జట్టులో ఉన్నారంటున్నారు.

నా కొడుకునే నిందిస్తారెందుకు?.. అతను అనారోగ్యంతోనే టోర్నీకి వచ్చాడేమో!!

Story first published: Thursday, June 25, 2020, 13:07 [IST]
Other articles published on Jun 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X