
అనారోగ్యంతోనే టోర్నీకి వచ్చాడేమో?:
ప్రపంచవ్యాప్తంగా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహణ ఓ తెలివి తక్కువ పనంటూ నెటిజన్లు జకోవిచ్‌ను విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో జకోవిచ్‌ను అతని తల్లిదండ్రులు వెనకేసుకొచ్చారు. వైరస్ వ్యాప్తికి దిమిత్రోవ్ కారణమంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 'కేవలం జకోవిచ్ వల్లే ఇలా జరిగిందా?. దిమిత్రోవ్ అనారోగ్యంతోనే టోర్నీకి వచ్చాడేమో? ఎవరికి తెలుసు. అతను ఎక్కడో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. అతను క్రొయేషియాతో పాటు సెర్బియాలోని మా కుటుంబానికి నష్టాన్ని అంటగట్టాలని చూస్తున్నాడు' అని జకోవిచ్ తండ్రి సర్జాన్ అన్నారు.

విమర్శలే వాళ్లను బాధిస్తున్నాయి:
జకోవిచ్ భార్యకూ వైరస్ సోకిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడ్డ తమ అబ్బాయి, కోడలు ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారని జొకో తల్లి డయానా తెలిపారు. కానీ ఈ విమర్శలే వాళ్లను బాధిస్తున్నాయన్నారు. అందరూ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని మొక్కుతున్నానన్నారు. సెర్బియాలో గత ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో.. ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్ ఛారిటీ టోర్నీని జకోవిచ్ నిర్వహించాడు. ఈ టోర్నీలో ఆడేందుకు స్టార్ క్రీడాకారుల్ని ఆహ్వానించిన జకోవిచ్.. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. టోర్నీ టైమ్‌లోనే జకోవిచ్.. క్రీడాకారులతో కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత జాగ్రత్తగా పోటీలను నిర్వహించాలి:
జకోవిచ్, దిమిత్రోవ్, ట్రయోకి, కొరిచ్ వైరస్ బారిన పడిన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా పోటీలను నిర్వహించాల్సిన అవసరం ఉందని ఏటీపీ ఛైర్మన్ ఆండ్రియా గౌడెంజి ఓ ప్రకటనలో తెలిపాడు. 'మీ పిల్లలు ద్విచక్రవాహనం నేర్చుకునేటపుడు హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పడం ఓ మార్గం. వాళ్లు ఎలాంటి రక్షణ పాటించకుండా బండి నడిపి కింద పడిన తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలని నిర్ణయించుకోవడం మరో మార్గం. మనం ఇప్పుడు రెండో మార్గం వల్ల కలిగే అనర్థాలు తెలుసుకున్నాం' అని చెప్పారు.

వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేశా:
తనకి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో నొవాక్ జకోవిచ్ తాజాగా స్పందించాడు 'సెర్బియాలో వైరస్ వ్యాప్తిని తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు నాతో పాటు నా భార్యకి కూడా కరోనా సోకింది. సంతోషకర విషయం ఏంటంటే.. నా పిల్లలకి మాత్రం నెగటివ్‌గా తేలింది. టోర్నీ కారణంగా వైరస్ బారినపడిన వారిని క్షమాపణలు కోరుతున్నా' అని అన్నాడు.
హాకీ స్టిక్ వదిలేసి క్రికెట్ బ్యాట్ పట్టిన మధుర క్షణాలు.. వన్డే ప్రపంచకప్‌కి 37 ఏళ్లు!!


Click it and Unblock the Notifications












